For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Magha Purnima 2021: మాఘ పౌర్ణమి వేళ సంధ్యా సమయంలో ఇవి దానం చేస్తే.. ఏడు జన్మల పాపం తొలగిపోతుందట...!

మాఘ మాసంలో సాయంకాలం సంధ్యా సమయంలో ఇవి దానం చేస్తే వచ్చే ఫలితాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ పురాణాల ప్రకారం, మాఘ మాసం ఎంతో విశిష్టమైనది. రథసప్తమి, జయ భీష్మ ఏకాదశి, శ్రీ పంచమి లేదా వసంతపంచమి(సరస్వతీ దేవి), మహాశివరాత్రి, ఇలా సకల దేవతలందరినీ ఆరాధించేందుకు ఏదో ఒక పర్వదినాన్ని అందించే మాసమే మాఘ మాసం. ఈ మాసంలో పౌర్ణమి వస్తే చాలు మన దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి.

Magha Purnima Importance and Significance in Telugu

అదేవిధంగా స్నానాలన్నింటిలో మాఘస్నానం ఉత్తమం అని పండితులు చెబుతుంటారు. ఈ రోజున నదులు, సముద్రాలు ఆఖరికి దేవాలయాల్లోని కోనేటిలో కూడా ఈరోజు పవిత్రతను సంతరించుకుంటాయని నమ్మకం. సాధారణంగా ఏడాదిలో నాలుగు నెలలు సాగరంలో స్నానానికి అనుకూలమని పండితులు చెబుతుంటారు.

Magha Purnima Importance and Significance in Telugu

వాటిలో ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖ మాసాలలో ప్రవహిస్తున్న నీటిలో స్నానం చేస్తే శుభఫలితాలు వస్తాయని, ఆ సమయంలో చేసే స్నానం వల్ల, అందులోని లవణాలు మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు, ఈ నాలుగు నెలల్లో సాగరం చుట్టూ ఉష్ణోగ్రతలు స్నానానికి తగినట్టుగా ఉంటాయనీ, ఆ సమయంలో సముద్రం మీద పడే చంద్రకిరణాలు కూడా ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయని చెబుతారు.

Magha Purnima Importance and Significance in Telugu

ఈ మాఘ పౌర్ణమి కేవలం స్నానానికే కాదు.. మనకు ఇష్టమైన దేవతలందరినీ ఆరాధించేందుకు, పిత్రుదేవతలను తలచుకునేందుకు కూడా అనువైన సందర్భం. ఈ పవిత్రమైన రోజున భానుడిని, మహాలక్ష్మీని పూజించడంతో పాటు కొన్ని వస్తువులను సాయంకాలం వేళ దానం చేస్తే విశేష ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా మాఘ పౌర్ణమి రోజున సంధ్యా సమయంలో ఏమి దానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అన్నిదానాల కంటే అన్నదానం ఎందుకు ముఖ్యమో తెలుసా...అన్నిదానాల కంటే అన్నదానం ఎందుకు ముఖ్యమో తెలుసా...

మహా మాఘి..

మహా మాఘి..

మాఘ పౌర్ణమినే మహా మాఘి అని కూడా పిలుస్తారు. అన్ని పూర్ణిమల కంటే మాఘ పూర్ణిమ చాలా విశిష్టమైనది. ఈ మాసంలో సకల దేవతలు తమ సర్వశక్తులు, తేజస్సులను జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘ స్నానం చాలా గొప్పది. నది దగ్గర్లో లేని వారు కనీసం చెరువులో లేదా కొలనులో గానీ లేదా బావిలో కూడా స్నానం ఆచరించవచ్చు.

దానధర్మాలు..

దానధర్మాలు..

అనంతరం సకల జీవకోటి రాశికి వెలుగు ప్రసాదించే సూర్యభగవానుడిని నమస్కారం చేయాలి. అనంతరం వైష్ణవ ఆలయాలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి. అలాగే మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి.

విశేష ఫలితం కోసం..

విశేష ఫలితం కోసం..

ఈ పవిత్రమైన రోజు సాయంకాలం వేళలో గొడుగు, నువ్వులు వంటి వాటిని దానం చేస్తే మీకు విశేష ఫలితం వస్తుందని పండితులు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల జన్మజన్మలుగా వెంటాడుతున్న పాపాలు, దోషాలు నశించి, అశ్వమేథ యాగం చేసింత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీక్రిష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్టుగా పురాణాల ద్వారా తెలుస్తోంది.

రోగాల నుండి విముక్తి..

రోగాల నుండి విముక్తి..

ఈ పవిత్రమైన రోజున ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల మరియు మీ కుల దైవాన్ని పూజించి దానం చేయడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుండి విముక్తి కలుగుతుంది. ఆ పుణ్య ఫలాల విశేషం కారణంగా ఉన్నత జీవితం లభిస్తుంది. అలాగే మరణం తర్వాత కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది.

English summary

Magha Purnima 2021 Date, Importance and Significance in Telugu

Here we are talking about the magha purnima importance and significance in Telugu. Read on
Desktop Bottom Promotion