Latest Updates
-
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు
దసరా శరన్నవరాత్రులు 2026 లో భాగంగా ఇవాళ రెండో రోజు. నవరాత్రులలో రెండవ రోజున భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించే దుర్గామాత రూపం..మా బ్రహ్మచారిణి(maa brahmacharini). అయితే ఇవాళ నార్త్ ఇండియాలో,దుర్గ సంప్రదాయంలో బ్రహ్మచారిణి దేవిని, తెలుగు రాష్ట్రాల సంప్రదాయంలో శ్రీ గాయత్రీ దేవిని పూజిస్తారు. గాయత్రీ దేవిని వేదమాత అని పిలుస్తారు. ముక్కోటి దేవతల శక్తుల కలయికగా, సకల మంత్రాలకు మూలశక్తిగా ఆమెను ఆరాధిస్తారు.
బ్రహ్మ అంటే తపస్సు, చారిణి అంటే ఆచరించేది అని అర్థం. త్యాగానికి, సంకల్పానికి, వైరాగ్యానికి ప్రతిరూపమైన ఈ తల్లిని అక్టోబర్ 12న పూజిస్తారు. అమ్మవారిని ఆరాధించడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం, సహనం, కష్టాలను ఎదుర్కొనే స్థైర్యం పెంపొందుతాయి.

అమ్మవారి స్వరూపం ..పురాణ గాథ
కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ధరించి ప్రశాంత వదనంతో దర్శనమిచ్చే బ్రహ్మచారిణి తల్లి స్వరూపం వెనుక ఒక గొప్ప పురాణ గాథ ఉంది. హిమవంతుడు, మైనా దేవిల పుత్రిక అయిన పార్వతీ దేవి.. నారద మహర్షి ఉపదేశంతో శివుడిని భర్తగా పొందాలని నిశ్చయించుకుంటుంది. కఠోరమైన తపస్సు చేసింది. ఆకులు, అలములు మాత్రమే తింటూ, చివరకు ఆహారం, నీరు కూడా విడిచిపెట్టి పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు చేసింది. ఆమె అచంచల భక్తికి, త్యాగానికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆమెను వివాహమాడతాడు. ఆ అద్భుతమైన తపస్విని రూపమే ఈ బ్రహ్మచారిణి.
పూజా విధానం, నైవేద్యం
ఇవాళ ఉదయాన్నే స్నానం చేసి పసుపు లేదా తెలుపు రంగు బట్టలు వేసుకోవాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసి, అమ్మవారి పటాన్ని అలంకరించి నెయ్యి దీపం వెలిగించాలి. కుంకుమ, చందనం, అక్షతలు, సుగంధ ద్రవ్యాలు, తెల్లని పూలతో అమ్మను అర్చించాలి. బ్రహ్మచారిణి మాతకు పంచదార, పటికబెల్లం, పంచామృతం, పండ్లు నైవేద్యంగా సమర్పించడం అత్యంత శుభప్రదం. పూజ పూర్తయిన తర్వాత ఈ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి.

శక్తివంతమైన మంత్రాలు - దోష నివారణ
జాతకంలో చంద్ర దోషం లేదా కుజ గ్రహ దోషం ఉన్నవారు ఈ రోజున అమ్మను ఆరాధిస్తే విశేష ఫలితం ఉంటుంది. పూజ సమయంలో ఈ కింది మంత్రాలను భక్తిశ్రద్ధలతో జపించండి.
"ఓం దేవీ బ్రహ్మచారిణ్యై నమః"
"ఓం ఐం నమః"
చంద్రుడిని బలపరచడానికి తెల్లని పూలు సమర్పిస్తూ ఓం శ్రాం శ్రీం శ్రౌం సః అని జపించండి.
ఆర్థిక బాధల నివారణకు అద్భుత పరిహారం
మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ చిన్న పరిహారం చేసి చూడండి. నీటితో నిండిన ఒక కొబ్బరికాయను ఒడిలో లేదా చేతిలో పట్టుకుని ఓం దుం దుర్గాయై నమః అని 108 సార్లు జపించండి. ఆ తర్వాత ఆ కొబ్బరికాయను ప్రవహించే నీటిలో వదిలేయండి. ఇలా చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ప్రగాఢ విశ్వాసం.
హారతి, ప్రార్థన
"యా దేవి సర్వభూతేషు మా బ్రహ్మచారిణి రూపేణ సంస్థితా.. నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః" (సకల ప్రాణులలో బ్రహ్మచారిణి రూపంలో కొలువై ఉన్న ఓ తల్లికి నమస్కారం) అని స్మరిస్తూ అమ్మవారికి హారతి ఇవ్వాలి.



Click it and Unblock the Notifications
