Latest Updates
-
ఈద్ ఉల్ ఫితర్ 2026..మీ బంధుమిత్రులకు రంజాన్ విషెస్ ఇలా అందంగా చెప్పండి! -
ఈరోజు రాశి ఫలాలు (21.03.26): శని దేవుని అనుగ్రహం ఎవరిపై ఉంటుంది? మీ జాతకం ఇక్కడ చూడండి! -
మష్రూమ్ చికెన్ మసాలా..కిర్రాక్ టేస్ట్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె లేకుండా 'దహీ భల్లా'.. రుచికి రాజీ లేదు, ఆరోగ్యానికి డోకా లేదు! -
ఉదయాన్నే పరగడుపున కుంకుమపువ్వు నీరు తాగితే... మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
ఈరోజు రాశి ఫలాలు (20.03.26): శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికి? -
ఉల్లి, వెల్లుల్లి లేకుండానే..హోటల్ రుచితో బ్రాహ్మణ శైలి వెజ్ కుర్మా.. చపాతీ, పూరీల్లోకి పర్ఫెక్ట్! -
30 ఏళ్లకే కీళ్ల నొప్పులా? వంటింట్లో ఉండే ఈ గింజలతో ఉక్కులాంటి ఎముకలు మీ సొంతం! -
ఎగ్ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఈ అద్భుతమైన రుచికి మీరే ఫిదా అవుతారు! -
వారపు రాశి ఫలాలు [19 నుండి 26 మార్చి]: ఈ వారం మీ అదృష్టం ఎలా ఉండబోతోంది? మీ రాశి ఫలాలు ఇక్కడ చూడండి!
బెల్లం, నువ్వులను కాకులకు ఆహారంగా పెడితే..శని ప్రభావం తగ్గుతుందా..!?
పుష్యమాసం శని మాసం. ఈ మాసంలో శని ప్రభావం అధికంగా ఉంటుంది. జ్యోతిశాస్త్రం ప్రకారం శని మన శరీర జీవ నాడి కారకుడై ఉంటాడు. ఈ జీవనాడి యొక్క ఒక శాఖ హ్రుదయస్పందనను, రక్తప్రసరణను నిర్ణయిస్తుంది. ధనుర్మాసం అయిపోయేటప్పటికి, శరీరంలోని కొవ్వు పదార్థం తగ్గడం వల్ల, మకర మాసం మొదలు అయ్యే సమయానికే ఈ కొవ్వు పదార్థపు కొరతను తీర్చాలని చెప్పబడింది. ఇందువల్ల రవి ప్రభావం(ఎండ వేడిని)ఎదుర్కోవటానికి శరీరంలోని ముఖ్య జీవనాడి ఆరోగ్యంగా పనిచేయడం వల్ల హ్రుదయ స్పందన సక్రమంగాఉండేట్టు చెయ్యగలవు నువ్వులు-బెల్లం '' తినాలనే నియమం పెట్టారు.
జాతకంలో శని ప్రభావం ఉందని జ్యోతిష్యులు చెప్పారా? శని దశ కారణంతో ఈతి బాధలు ఎదుర్కొంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. శనీశ్వరుడి ప్రభావంతో మంచిచెడూ రెండూ జరుగుతుంటాయి. నవగ్రహాల్లో శనీశ్వరుడి పాప గ్రహమంటారు. శనీశ్వరుడు సూర్యుడి పుత్రుడు. అయితే తండ్రీకుమారులైన శనీశ్వరుడికి, సూర్యుడికి ఏమాత్రం పోలికలు వుండవు. వీరిద్దరూ జన్మతహా శత్రువులు.
ఒక్కో రాశిని రెండున్నర సంవత్సరం పాలించే శనీశ్వరుడికి బుధ, శుక్ర, రాహు, కేతు గ్రహాలు స్నేహాధిపత్య గ్రహాలు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు శత్రు గ్రహాలు. శని దశాకాలం 19 సంవత్సరాలు. శని భగవానుడి వాహనం కాకి, దున్నపోతు. నచ్చిన లోహం ఇనుము. వస్త్రం నలుపు, పువ్వులు నీలపుశంఖువులు. దేవతామూర్తి యముడు. నచ్చిన ధాన్యం నువ్వులు. చేదంటే శనీశ్వరుడికి చాలా ఇష్టం. ఇంకా శనిభగవానుడికి స్తోత్రాలంటే మహాఇష్టం. శని గ్రహ దోషనివారణకు మరికొన్ని మార్గాలు..

శనిగ్రహ దోష నివారణకు
శనిగ్రహ దోష నివారణకు తమిళనాడులోని తిరునల్లార్ దేవస్థానాన్ని దర్శించుకుని శనిహోమం జరిపించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. తిరునల్లార్ మాత్రమే గాకుండా మందపల్లి, సింగనాపూర్, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలోని శనైశ్వర ఆలయంలో శని త్రయోదశి నాడు అభిషేకం జరిపించడం శుభఫలితాలనిస్తుంది.

శనిగ్రహ దోష నివారణకు
ప్రతిరోజూ మధ్యాహ్నం బెల్లం కలిపిన నల్లనువ్వులు కాకులకు ఆహారంగా పెట్టడం ద్వారా శనిగ్రహ ప్రభావంచే కలిగే ఈతిబాధలు, ఆర్థిక పతనం, వ్యాపారంలో నష్టం, ఉద్యోగావకాశాలు చేజారిపోవడం వంటి దుష్ఫలితాల నుంచి తప్పుకోవచ్చు.

శనిగ్రహ దోష నివారణకు
అలాగే శనిగ్రహ దోష నివారణకు హనుమంతుడిని ప్రతి శనివారం దర్శించుకుని నేతితో దీపమెలిగించడం మంచిది. ఇంకా శనివారం రోజున నువ్వుండలు కానీ, లేదా నువ్వులతో చేసిన ఏదైనా పిండివంటలను సాధువులకు దానం చేయండి.

శనిగ్రహ దోష నివారణకు
పుష్యమి నక్షత్రం రోజున నల్లనువ్వులు, నల్లని వస్త్రంలో ఉంచి, రెండు కిలోల బియ్యం కూడా వేరే వస్త్రంలో మూటగా చుట్టి బ్రాహ్మణునికి దానం చేయండి. ఇలా చెస్తే శనిగ్రహ దోషాలచే కలిగే దుష్ఫలితాలు దరిచేరవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా నీలిరంగు పువ్వులు, నల్లని వస్త్రాలు, నూనె దానం, స్టీల్ పాత్రలు దానం చేయాలి

శనిగ్రహ దోష నివారణకు
"ఓం హ్రాం హనుమతే నమ:
ఓం నమో రామచంద్రాయ నమ:"
అనే మంత్రాలను ప్రతినిత్యం పఠించినట్లైతే శనిగ్రహ నివారణ జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

శనిగ్రహ దోష నివారణకు
శనిభగవానుడిచే ఏర్పడే శనిదోషం నివృత్తికావాలంటే.. శనివారాల్లో వ్రతమాచరించాలి. శనిభగవానుడి సన్నిధిలో రెండు ప్రమిదల్లో నువ్వుల నూనెతో దీపమెలిగించాలి. నువ్వులతో కూడిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. శని కవచం, శనీశ్వర అష్టోత్తరంతో పారాయణ చేయాలి. పేదలకు నలుపు రంగు దుస్తులు దానం చేయాలి. శనీశ్వరుడికి ఎదురుగా నిలబడి ఆయనను ప్రార్థించడం చేయకూడదు. ఆయనకు నేరుగా కాకుండా పక్కగా నిలబడి దండం పెట్టుకోవాలి.

శనిగ్రహ దోష నివారణకు
ఇంకా తమిళనాడు, కారైక్కాల్ తిరునళ్లార్‌కు వెళ్ళి.. నళ తీర్థంలో స్నానమాచరించి ఆ శనిదేవుడికి పూజలు చేస్తే.. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శనిదోషాలు నివృత్తి అవుతాయి. కాకికి రోజూ అన్నం పెట్టడం.. ఉద్దిపప్పును దానం చేయడం ఉత్తమం. ఆలయాల్లో నవగ్రహాలను తొమ్మిదిసార్లు ప్రదక్షిణ చేయడం, శనివారాల్లో సూర్యోదయానికి ముందే సుందరకాండ పారాయణం చేయడం ద్వారా ఏలినాటి శని దోషం నివృతి అవుతుంది.

శనిగ్రహ దోష నివారణకు
కానీ శనిదోషాల ద్వారా ఈతిబాధలు, సమస్యలు అధికమైనట్లైతే.. నలుపు రంగుతో కూడిన తొక్క తీయని మినపప్పుల్ని 108 తీసుకుని.. రాత్రి దిండు కింద పెట్టి నిద్రించి.. మరుసటి రోజు ఉదయం శుచిగా స్నానమాచరించి.. శనిభగవానుడిని 108 సార్లు ప్రదక్షణ చేయాలి. ఒక్కో ప్రదక్షణ ముగిశాక.. ఒక్కో మినపప్పును శనిభగవానుడి వద్ద ఉంచాలి లేదా నేలపై వదలాలి. ఇలా చేస్తే శనిభగవానుని అనుగ్రహం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి.

శనిగ్రహ దోష నివారణకు
ప్రతి శనివారం తైలాభిషేకం చేస్తే చాలా మంచిది.అంటే నువ్వుల నూనెతో(మీకు తోచినంత ఎంత కొంచమైన ఫర్వాలేదు)అభిషేకం చేస్తే ,శని కొంతవరకు శాంతించి అనుగ్రహిస్తాడు.



Click it and Unblock the Notifications







![వారపు రాశి ఫలాలు [19 నుండి 26 మార్చి]: ఈ వారం మీ అదృష్టం ఎలా ఉండబోతోంది? మీ రాశి ఫలాలు ఇక్కడ చూడండి!](https://images.boldsky.com/fit-in/400x225/te/img/2026/03/today-rasi-phalalu-for-all-12-zodiac-signs-19-mar-2026.jpg)



