Latest Updates
-
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా..
35 ఏళ్ల తర్వాత శృంగారంపై ఆసక్తి, స్టామినా తగ్గుతుందా? తిరిగి ఎనర్జీ పొందే సూపర్ టిప్స్!
35 ఏళ్ల వయసు.. జీవితంలో ఒక ముఖ్యమైన దశ. కెరీర్ లో స్థిరపడటం, కుటుంబ బాధ్యతలు పెరగడం వంటివి ఈ వయసులోనే జరుగుతాయి. అయితే ఈ బిజీ లైఫ్ లో చాలా మంది దంపతులు ఎదుర్కొనే ఒక నిశ్శబ్ద సమస్య.. శృంగారంపై ఆసక్తి, శరీరంలో ఎనర్జీ క్రమంగా తగ్గిపోవడం.

గతంలో ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు ఎందుకు ఉండటం లేదు? స్టామినా ఎందుకు పడిపోతోంది? అని చాలా మంది లోలోపల మదనపడుతుంటారు. ఇది కేవలం మీ ఒక్కరి సమస్య కాదు, చాలా మందిని వేధించే సాధారణ సమస్యే. ఇలా మీ శరీరంలో మార్పులు రావడానికి ప్రధానంగా 7 కారణాలు ఉన్నాయని డాక్గర్ చేతన,గైనకాలజిస్ట్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో చెప్పారు. అవేంటో ఇక్కడ చూడండి.
పోషకాల లోపం
బండి సాఫీగా నడవాలంటే ఇంధనం ఎంత అవసరమో, మన శరీరానికి పోషకాలు కూడా అంతే అవసరం. ముఖ్యంగా విటమిన్ D, B12, ఐరన్, జింక్ వంటి అత్యవసర ఖనిజాల లోపం వల్ల శారీరక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. ఇవి లోపిస్తే కండరాల బలహీనత, రోజంతా అలసటగా అనిపించడం జరుగుతుంది.
అనారోగ్యకరమైన జీవనశైలి
గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగాలు, వ్యాయామం అస్సలు లేకపోవడం ఈ సమస్యకు మరో పెద్ద కారణం. తీసుకునే ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోవడం, జంక్ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలో స్టామినా నశిస్తుంది. శారీరక శ్రమ లేకపోతే రక్త ప్రసరణ మందగించి ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి.
హార్మోన్ల మార్పులు
వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి సహజంగానే తగ్గుతుంది. ముఖ్యంగా పురుషుల్లో టెస్టోస్టెరాన్, స్త్రీలలో ఈస్ట్రోజెన్ లెవల్స్ పడిపోవడం వల్ల శృంగారం పట్ల కోరికలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి.
నిద్రలేమి
శరీరానికి తగినంత విశ్రాంతి లేకపోతే ఏ పనీ సరిగ్గా చేయలేం. రోజుకు 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర లేకపోవడం వల్ల మెదడు, శరీరం అలసిపోతాయి. ఈ నిరంతర అలసట శృంగార జీవితంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది.
చెడు అలవాట్లు
ధూమపానం, మద్యం సేవించడం వంటి అలవాట్లు మీ స్టామినాను నిలువునా దెబ్బతీస్తాయి. ఇవి రక్తనాళాలను కుదించి, శరీరంలోని ముఖ్యమైన భాగాలకు రక్త ప్రసరణ జరగకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల బాడీ త్వరగా వీక్ అవుతుంది.
అనారోగ్య సమస్యలు
30 ఏళ్లు దాటగానే నేటి కాలంలో మధుమేహం, హై బీపీ, థైరాయిడ్ వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ దీర్ఘకాలిక వ్యాధులు నరాల పనితీరును దెబ్బతీసి, శృంగార సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.
తీవ్రమైన ఒత్తిడి
ఆఫీస్ టార్గెట్లు, ఆర్థిక సమస్యల వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది హ్యాపీ హార్మోన్లను అణిచివేసి, శరీరాన్ని మానసికంగా, భౌతికంగా బలహీనపరుస్తుంది.
పరిష్కారం ఏమిటి?
35 ఏళ్లు దాటినంత మాత్రాన మీ యవ్వనం ఆవిరైపోయినట్లు కాదు. సరైన పౌష్టికాహారం, రోజువారీ వ్యాయామంతో మీ స్టామినాను కచ్చితంగా తిరిగి పొందవచ్చు. తాజా పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ ఫుడ్స్ మీ డైట్ లో చేర్చుకోండి. యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడిని జయించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications