Latest Updates
-
అక్కడ అడ్మిషన్ దొరికితే లైఫ్ సెటిల్ అయినట్టే.. ఇండియాలో అత్యంత ఖరీదైన టాప్ స్కూల్స్ ఇవే.. -
తల నుంచి కాలి వరకు..శరీరంలో ప్రతి భాగాన్ని హెల్తీగా ఉంచే హెల్తీ ఫుడ్స్ -
ఈ ఆదివారం ఈ 5 రాశుల వారికి కాసుల వర్షం.. అదృష్టం మీ వెంటే! -
ఏ కూరైనా అమృతంలా మారాలంటే.. గరం మసాలా ఎప్పుడు,ఎలా వేయాలో తెలుసా? -
భాగస్వామి విషయంలో ఈ ఒక్కటి ఆపేస్తే.. ఇక మీ బంధానికి ఎలాంటి ఢోకా ఉండదు.! -
ఆలయాల్లో రథోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు? -
ధనూ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: వీసా, విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అద్భుతమైన సమయం! -
మిథునం, కన్య, కుంభ రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 28 జూన్ నుండి 04 జూలై 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - ఆదివారం, 28 జూన్ 2026 -
ప్రధానినైనా అరెస్ట్ చేయొచ్చు..కానీ మనదేశంలో ఈ ఇద్దరినీ ఎవ్వరూ టచ్ చేయలేరు!
ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం నిల్వ..దేంతో తిన్నా అదిరిపోయే మహారాష్ట్ర స్పెషల్ వెల్లుల్లి కారం!
మహారాష్ట్ర స్ట్రీట్ ఫుడ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వడా పావ్. వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి వడా పావ్ తింటుంటే ఆ మజాయే వేరు. అయితే వడా పావ్ కు అంత అద్భుతమైన రుచి ఎలా వస్తుందో ఎప్పుడైనా గమనించారా? దానికి కారణం అందులో వాడే ఆ ఎర్రటి కారం పొడి. వడా పావ్ తో పాటు వడ్డించే ఎర్ర మిరపకాయ, వెల్లుల్లితో చేసిన పొడి చట్నీయే దాని అసలైన సీక్రెట్.

దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం వడా పావ్ కు మాత్రమే పరిమితం కాదు. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ కారం పొడి కలుపుకుని తింటే.. అమృతంలా ఉంటుంది. అలాగే చపాతీ, రోటీ, పప్పు అన్నం, ఇడ్లీ, దోశ.. ఇలా దేనితో తిన్నా దాని రుచి రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా బ్యాచిలర్స్ కు, సమయం తక్కువగా ఉండే ఉద్యోగులకు ఈ నిల్వ ఉండే పొడి ఎంతగానో ఉపయోగపడుతుంది.
వెల్లుల్లి కారం పొడి తయారీకి కావలసిన పదార్థాలు
ఎండు కొబ్బరి తురుము - 6 టేబుల్ స్పూన్లు
వేరుశెనగ గుళ్లు (పల్లీలు) - 2 టీస్పూన్లు
ఎండు మిరపకాయలు - 15
వెల్లుల్లి రెబ్బలు - 15 నుండి 20
కాశ్మీరీ ఎర్ర కారం పొడి - 2 టీస్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
వెల్లుల్లి కారం పొడి తయారీ విధానం
-ముందుగా ఒక తాజా ఎండు కొబ్బరికాయను తీసుకుని సగం వరకు కట్ చేసుకోండి. ఆ సగం చిప్పను సన్నగా తురుముకోవాలి. ఇలా చేస్తే మీకు దాదాపు ఆరు టేబుల్ స్పూన్ల కమ్మని ఎండు కొబ్బరి తురుము సిద్ధం అవుతుంది.
-స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ పెట్టండి. మంటను మీడియంలో ఉంచి, ముందుగా వేరుశెనగలను వేసి దోరగా వేయించండి. పల్లీలు మంచి వాసన వస్తూ వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే పాన్ లో ఎండు మిరపకాయలను వేసి మాడిపోకుండా వేయించండి. చివరగా వెల్లుల్లి రెబ్బలను వేయించాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వెల్లుల్లి పొట్టు అస్సలు తీయకూడదు.
-వేయించిన పదార్థాలన్నీ పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత వాటన్నింటినీ ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోండి. అందులో మంచి రంగు కోసం కాశ్మీరీ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఇప్పుడు మిక్సీని ఆపి ఆపి (పల్స్ మోడ్ లో) బరకగా రుబ్బుకోవాలి. దీన్ని మెత్తటి పౌడర్ లా చేయకూడదు. కరకరలాడుతూ, పలుకులుగా ఉంటేనే దీని అసలు రుచి తెలుస్తుంది. ఇందులో ఒక్క చుక్క నీరు కూడా కలపకూడదు.
-రుబ్బుకున్న ఈ వెల్లుల్లి కారం పొడిని ఒక గాజు సీసాలో లేదా గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకోండి. ఏకంగా ఒక సంవత్సరం పాటు ఫ్రెష్ గా ఉంటుంది.
-అంతే ఎంతో రుచికరమైన, ఘాటైన మహారాష్ట్ర స్పెషల్ వెల్లుల్లి కారం రెడీ. వెల్లుల్లి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications