Latest Updates
-
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి!
అక్కడ అడ్మిషన్ దొరికితే లైఫ్ సెటిల్ అయినట్టే.. ఇండియాలో అత్యంత ఖరీదైన టాప్ స్కూల్స్ ఇవే..
భారతదేశంలో అత్యంత ఖరీదైన పాఠశాలలు అనగానే మనకు కేవలం విలాసవంతమైన భవనాలు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ అది నిజం కాదు. ఆ పాఠశాలలు కేవలం లగ్జరీ మాత్రమే కాదు..అవి ప్రపంచస్థాయి విద్యకు, అద్భుతమైన గ్లోబల్ అవకాశాలకు కేరాఫ్ అడ్రస్. ఈ స్కూల్స్ విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాదు, ప్రపంచస్థాయి దృక్పథాన్ని, నాయకత్వ లక్షణాలను నూరిపోస్తూ రేపటి ప్రపంచానికి లీడర్లుగా తీర్చిదిద్దుతున్నాయి. అందుకే ఎంత ఖర్చైనా సరే తమ పిల్లలను ఇందులో చేర్పించేందుకు సంపన్నులు పోటీ పడుతున్నారు.

దేశంలో అత్యంత పేరుగాంచిన ఆ ఖరీదైన పాఠశాలలు ఇవే
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (ముంబై)
ఈ స్కూల్ ఏడాది ఫీజు రూ. 1.7 లక్షల నుంచి రూ. 14.7 లక్షల వరకు ఉంటుంది. బాలీవుడ్ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు, దేశంలోని అత్యంత సంపన్నుల పిల్లలు చదివేందుకు ఫస్ట్ ఛాయిస్ ఈ స్కూల్. ఇక్కడ అడ్మిషన్ దొరకడం చాలా కష్టం.
మయో కాలేజ్ (అజ్మీర్)
ఇక్కడ ఏడాది ఫీజు రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఉంటుంది. దీనిని ప్రారంభంలో రాజస్థాన్ రాజకుటుంబీకులు, ప్రభువుల కోసం నిర్మించారు. ఇప్పుడు ఇది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఖరీదైన బోర్డింగ్ స్కూల్స్ లో ఒకటిగా గుర్తింపు పొందింది.
ఎకోల్ మోండియాల్ వరల్డ్ స్కూల్ (ముంబై)
దీని వార్షిక ఫీజు రూ. 9.5 లక్షల నుంచి రూ. 18 లక్షల వరకు ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి విద్యను అందించే ఈ స్కూల్.. దేశంలోని సంపన్నులు, ఎన్నారైలు, విదేశీయుల పిల్లలకు బెస్ట్ ఆప్షన్.
ది సింధియా స్కూల్ (గ్వాలియర్)
ఏడాది ఫీజు రూ. 6.2 లక్షల నుంచి రూ. 18.2 లక్షల వరకు ఉంటుంది. ఈ స్కూల్ పూర్వ విద్యార్థుల జాబితాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, ఎయిర్‌టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ లాంటి ఎందరో ప్రముఖులు ఉన్నారు.
ది డూన్ స్కూల్ (డెహ్రాడూన్)
వార్షిక ఫీజు రూ. 13.6 లక్షల నుంచి రూ. 15.6 లక్షల వరకు ఉంటుంది. ఈ స్కూల్ లో చదివిన వారిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో పాటు దేశంలోని అనేక రాజకీయ, వ్యాపార కుటుంబాలకు చెందిన దిగ్గజాలు ఉన్నారు.
గుడ్ షెపర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ (ఊటీ)
ఫీజు ఏడాదికి రూ. 15 లక్షల నుంచి రూ. 19.5 లక్షల వరకు ఉంటుంది. ప్రీమియం రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్, పటిష్టమైన అకడమిక్స్, విశాలమైన క్రీడా ప్రాంగణాలకు ఈ స్కూల్ పెట్టింది పేరు.
హారో ఇంటర్నేషనల్ స్కూల్ (బెంగళూరు)
దీని వార్షిక ఫీజు రూ. 18 లక్షల నుంచి రూ. 23 లక్షల వరకు ఉంటుంది. యునైటెడ్ కింగ్‌డమ్ కు చెందిన ప్రఖ్యాత హారో విద్యా సంప్రదాయాలను ఈ స్కూల్ మన దేశానికి పరిచయం చేస్తోంది.
ఉడ్ స్టాక్ స్కూల్ (ముస్సోరీ)
ఏడాది ఫీజు ఏకంగా రూ. 19 లక్షల నుంచి రూ. 30.9 లక్షల వరకు ఉంటుంది. ఆసియాలోనే అత్యంత పురాతన ఇంటర్నేషనల్ బోర్డింగ్ స్కూల్స్ లో ఇది ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో ఇది భిన్నమైన గ్లోబల్ కమ్యూనిటీని కలిగి ఉంటుంది.
అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబే (ముంబై)
దీని వార్షిక ఫీజు రూ. 17.7 లక్షల నుంచి రూ. 32 లక్షలకు పైమాటే. దేశంలో విదేశీ దౌత్యవేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు, మల్టీ మిలియనీర్లు తమ పిల్లలను చేర్పించేందుకు అత్యంత ఆసక్తి చూపే స్కూల్ ఇది.



Click it and Unblock the Notifications
