For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  రావి చెట్టుతో కూడిన ఆధ్యాత్మిక ప్రయోజనాలేమిటో తెలుసా ?

  |

  రావి చెట్టును ఋగ్వేదంలో ఒక దేవునిగా సూచించబడుతుంది, యజుర్వేదo ప్రకారం ప్రతి యాగములో అత్యంత ప్రామాణికమైనదిగా పరిగణించబడుతుంది మరియు ఇది అధర్వణవేదంలో అన్ని దేవతల నివాసంగా వర్ణించబడింది.

  హరప్పా లోయలో జరిగిన త్రవ్వకాలలో కూడా, రావిచెట్టును ఆరాధించే జాడలు కనిపించాయి. అంతేకాకుండా, అక్కడ లభించిన దేవతల చిత్రాలను రావి ఆకులు చుట్టుముట్టి కనిపించాయి. తద్వారా రావి చెట్టును దేవతగా కొలిచే సంప్రదాయాల మూలాలు ప్రాచీన కాలం నుండే వస్తున్నాయని అవగతమవుతుంది .

  Spiritual Importance Of The Peepal Tree

  వస్తువుల తయారీలో మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాల దృష్ట్యా, రెండింటిలోనూ రావి చెట్టు ఒక బహుమతిగా చెప్పబడిన వృక్షం. 24 గంటలు ఆక్సిజన్ ఇచ్చే చెట్లలో ఇది ప్రముఖమైనదిగా ఉన్నది. హిందూ మతం ప్రకృతికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది.

  అందువల్ల, మొక్కలు మరియు చెట్లను పూజించడం హిందువుల సాంప్రదాయంలో భాగంగా వస్తూ ఉన్నది. తద్వారా వేప, తులసి, జమ్మి, రావి, మర్రి, మామిడి మొదలైన అనేక రకాల చెట్ల ఆకులను లేదా, వాటి ఫలాలను దైవ కార్యాలకు వినియోగించడం ఆనవాయితీగా వస్తున్నది. అందులో ముఖ్యంగా రావి చెట్టుని ప్రధానంగా చెప్పబడుతున్నది. రావి చెట్టు లేని గ్రామం, దేవాలయాలు అతి తక్కువగా కనిపిస్తాయి అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఆక్సిజన్ అధికంగా ఇచ్చే రావి చెట్టుని పెంచడం ద్వారా తెలీకుండానే సమాజ సేవకు పూనుకున్న అభిప్రాయం జనులది. గ్రామాలలో కూడా రావి చెట్టు కింద సేద తీరే పెద్దవారిని కూడా మనం గమనిస్తూ ఉంటాం. రావి చెట్లు అధికంగా ఉన్న ప్రాంతాలలో స్వచ్చమైన గాలి తో కూడా కాలుష్య జాడలు కాస్త తక్కువగా ఉంటాయి అనడంలో ఆశ్చర్యం లేదు.

  విష్ణు భగవానుడు రావి చెట్టులో ఉంటాడని తెలుసా ?

  విష్ణు భగవానుడు రావి చెట్టులో ఉంటాడని తెలుసా ?

  మహా భారతంలో, కృష్ణుడు తనను తాను రావి చెట్టుగా అభివర్ణించినాడు. ఈ చెట్టు యొక్క మూలాలు విష్ణువు. దాని కాండం కేశవుడు. శాఖలు నారాయణ మరియు ఆకులు హరిగా స్వయంగా ఉన్నారు. అందువల్ల పూర్వ కాలం నుండే రావి చెట్టును ఆరాధించే సాంప్రదాయం ఉన్నది. సోమావతి అమావాస్య రోజున రావి చెట్టులో విష్ణు భగవానుడు, లక్ష్మి సమేతంగా కొలువు తీరి ఉంటారని నమ్ముతారు. పెళ్ళైన ఆడవారు ఈరోజు ఉపవాసం ఉండడం ద్వారా భర్తలకు ఆయురారోగ్యాలు సిద్దిస్తాయని , మరియు పితృదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని విశ్వసిస్తుంటారు. ఈరోజు రావిచెట్టుకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ. దీనిని రావిచెట్టు ప్రదక్షిణ వ్రతంగా గుర్తిస్తారు కూడా.

  పుట్టుక మరియు మరణాన్ని సూచిస్తుంది :

  పుట్టుక మరియు మరణాన్ని సూచిస్తుంది :

  రావి చెట్టు ఎన్నడూ ఒకేసారి ఆకులను జారవిడువదు. ఆకులు పడిపోఏ కొలదీ కొత్త ఆకులు చిగురిస్తూ నూతన జన్మను తీసుకొంటాయి. ఇది జన్మ మరియు మరణ చక్రం అని సూచిస్తుంది. అందువలన దీనిని ఆధ్యాత్మిక వాస్తవికతకు సంబంధించిన చెట్టుగా భావిస్తుంటారు. చెట్టు యొక్క క్లిష్టమైన నిర్మాణం మొత్తo, జీవితం మరియు మరణ చక్రాన్ని సూచిస్తుంది. దీని ద్వారానే ప్రకృతి సైతం నడుస్తుంది అని చెప్పబడినది. కొందరి నమ్మకాల ప్రకారం ఈ భూమి మీద ఉన్న ప్రతి రావి చెట్టు ఆకు ఒక ప్రాణంగా చెప్పబడుతున్నది కూడా.

  శాశ్వత ఆధ్యాత్మికత :

  శాశ్వత ఆధ్యాత్మికత :

  రావి చెట్టు ఎన్నటికీ చనిపోదు. అది శాశ్వతంగా ఉంటుంది. దాని శాశ్వత స్వభావం కూడా శాశ్వతాత్మతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది శాశ్వతమై మరణం లేనిదిగా ఉంటుంది. మానవ శరీరం నశించిపోతుంది కానీ ఆత్మ ఎప్పటికీ నశించదు. ఆ ఆత్మలు చివరికి చేరే పవిత్రమైన ప్రదేశంగా రావి చెట్టు ఉన్నది. రావి చెట్టును పూజించడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్తుంటారు.

  సావిత్రి మరియు సత్యవoతుని కథ:

  సావిత్రి మరియు సత్యవoతుని కథ:

  మహా భారతంలో సావిత్రి మరియు సత్యవంతుని కథను ప్రస్తావిస్తుంది. సావిత్రి భర్త సత్యవంతుడు రావి చెట్టు కింద మరణించాడు. ఈ ఊహించని ఘటనతో సావిత్రి చాలా బాధపడింది. ఆమె మరణానికి రాజైన, యముని ఆరాధించడం మొదలుపెట్టింది. మరియు రావిచెట్టు చుట్టూ ఒక పవిత్రమైన తాడుతో కట్టి, తన భర్తను తిరిగి బ్రతికించాలని ప్రాధేయపడింది. ఆమె ప్రార్ధనకు తలొగ్గిన యముడు సత్యవంతునికి తిరిగి ప్రాణం పోశాడు. అప్పటి నుండి, హిందూ స్త్రీలు వటసావిత్రి వ్రతం రోజున రావి చెట్టును పూజించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ వ్రతం రోజున ఉపవాసం చేయడం, దానధర్మాలు చేయడం, అన్నదానం నిర్వహించడం అతి ముఖ్యమైనదిగా చెప్తారు. తద్వారా తమ భర్త ఆయురారోగ్యాలతో వర్దిల్లుతారని ప్రఘాడ నమ్మకం.

  బుద్దుని జ్ఞానోదయం :

  బుద్దుని జ్ఞానోదయం :

  అనేక ఋషులు సన్యాసాన్ని స్వీకరించే క్రమంలో రావి చెట్టు క్రింద జ్ఞానోదయం సాధించారు. వారిలో గౌతమ బుద్దుడు అతిపెద్ద ఉదాహరణ. బుద్దుడు బీహార్ లోని గయలో ఒక నది దగ్గర ఉన్న రావి చెట్టు కింద కూర్చున్నారు. అతను పద్నాలుగవ రోజు సాయంత్రాన జ్ఞానోదయం పొందాడు. ఈ చెట్టుని మహాబోది వృక్షమని, ఆ ప్రదేశాన్ని బుద్ధగయగా పిలువబడింది. ఈ చెట్టు యొక్క శాఖ నుండి ఎదిగిన ఏ చెట్టునైనా కూడా బోధి వృక్షం అని పిలవడం ఆనవాయితీగా వస్తున్నది.

  రావి చెట్టు ద్వారా పూర్వీకులను పూజించవచ్చు :

  రావి చెట్టు ద్వారా పూర్వీకులను పూజించవచ్చు :

  పూర్వీకుల ఆత్మలు రావి చెట్టు మీద నివసిస్తాయని హిందువుల ప్రఘాడ విశ్వాసం. అన్ని మతాలలో, ప్రత్యేకించి హిందూమతంలో పూర్వీకులను పూజించే సాంప్రదాయం ప్రధానంగా ఉంది. పూర్వీకులను ముఖ్యంగా అమావాస్య రోజున పూజిస్తారు. కాబట్టి, రావి చెట్టును ఆరాధించడం ద్వారా పూర్వీకులకు మన ప్రార్ధనలను అర్పణగా భావించబడుతుంది.

  బ్రహ్మదేవుడు :

  బ్రహ్మదేవుడు :

  రావిచెట్టుకు బ్రహ్మదేవునితో కూడా సంబంధం ఉంది. చావు పుట్టుకలు లేని బ్రహ్మదేవుడు మరణించిన వారి ఆత్మలను తనలో కలుపుకునే చెట్టుగా రావి చెట్టు ఉన్నది. రావి చెట్టు కింద కర్మ క్రతువులను జరుపుటకు కూడా కారణం ఇదే. రావి చెట్టు దగ్గరలో లేని పక్షాన రావి ఆకులనైనా కర్మ క్రతువులకు వినియోగించడం పరిపాటి.

  English summary

  Spiritual Importance Of The Peepal Tree

  Peepal tree is largely worshiped in Hinduism. The spiritual importance of the Peepal tree lies in the fact that Lord Vishnu himself is believed to be staying in the Peepal tree. Lord Buddha too found enlightenment while meditating under the Peepal tree. Along with these, this tree also signifies the cycle of birth and death and the permanence of spirituality.
  Story first published: Monday, May 7, 2018, 11:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more