Latest Updates
-
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.!
శివుడు స్మశానంలోనే ఎందుకు వుంటాడో తెలుసా..?
చాలా మంది దేవుళ్లు వైకుంఠం, సముద్రం, స్వర్గం, ఇలాంటి ప్రదేశాల్లో వుంటారు. కానీ శివుడు మాత్రం స్మశానంలో వుంటాడు. మనుషులు చనిపోయిన తరువాత ఆ మృతదేహాన్ని స్మశానంలో పాతిపెట్టడం, లేదా కాల్చివేయడం చేస్తారు. ఉదయం ఆ ప్రదేశంలోకి ఎవ్వరూ వెళ్లరు. ఇక రాత్రుళ్లైతే చాలా భయానకంగా వుంటుంది. ఎన్నో మంచి ప్రదేశాలను వదులుకొని శివుడు ఎందుకు స్మశానంలో వుంటాడో మీకు తెలియజేస్తున్నాం.
మహాభారత అనుశాసన పర్వం 141 వ అధ్యాయంలో దీని గురించి వర్ణించబడి వుంది. ఎన్నో మంచి ప్రదేశాలు వదిలి స్మాశానంలో నివసించడానికి కారణమేంటని శివుని భార్య ఉమాదేవి ప్రశ్నిస్తుంది. అపవిత్ర స్థానంలో ఎందుకు వుంటున్నారని అడుగుతుంది. దానికి ఆ మహాదేవుడు.. దేవీ, నేను రాత్రీ పగలు ఈ భూమిమీద పవిత్ర స్థలం ఎక్కడ వున్నదా అని వెతుకుతూ వుంటాను. ఈ స్మశానానికి మించిన మంచి ప్రదేశం నాకు ఈ భూమి మీద కనిపించడం లేదు. అందుకే ఈ స్మశానంలోనే నివాసం వుంటున్నాను. నా భూత గణాలు ఎక్కడే వుంటాయ్. కాబట్టి నాకు ఈ ప్రదేశమంటేనే ఇష్టమని శివుడు అంటాడు.

ఇది అపవిత్ర ప్రదేశం కాదు, ఇదే నాకు స్వర్గమని చెబుతాడు. ఇది వీరుల నివాస స్థలం, కపాలాలతో నిండివుండే ఈ భయంకర ప్రదేశం నాకు అందంగానే కనిపిస్తుంది. నిట్టమద్యాహ్నం సమయంలో ఆరుద్ర నక్షత్రం వున్న రోజు దీర్ఘాయుష్షు కోసం పూజచేసేవారు, అపవిత్ర, పాపపు పనులు చేసే మగవారు స్మశానంలో వెల్లకూడదని అంటారు.
శివుడు ఇంకా చెబుతూ.. నా ఆఘ్న లేకుండా భూత గణాలు ఎవ్వరికీ ఏ హానీ తలపెట్టవు. మానవుల క్షేమం కోరే వాడిని కాబట్టే నా భూతగణాలను స్మశానం దాటి బయటకు పోనివ్వను, ఇదే నేను ఇక్కడ వుండటానికి గల రహస్యమని చెబుతాడు. స్మశానంలో శివుడి రూపం గురించి కూడా అమ్మవారు అడిగి తెలుసుకుంటారు. అప్పుడు చాలా భయంకరమైన రూపంతో శివుడు కనబడతాడు, శరీరం మొత్తం బూడిదతో, జుట్టు ముడి వేసి, ఎర్రటి కళ్లతో కనిపిస్తాడు. లోక రక్షణ కోసమే ఈ భీకర రూపం దాల్చానని చెబుతాడు.

శివుడు, విష్ణువు, ఇద్దరు ఒకే పరమాత్మ యొక్క భిన్న రూపాలు. మానవ సహజ స్వభావాలకు వీరు ప్రతీకలుగా నిలిచారు. విష్ణువు హృదయంలో శివుడు, శివుడి హృదయంలో విష్ణువు వుంటాడని అంటారు. భగవంతుడు ఒక్కడే కాని ఆయన రూపాలు అనేకమని గ్రహించాలి. ఒకరు సౌమ్య గుణానికి మరొకరు తేజో గుణానికి ప్రతీకలు.
మీరు శరీరానికి బూడిదను ఎప్పుడూ ఎందుకు పూసుకుంటారో చెప్పమని అడుగుతుండి పార్వతి. దానికి శివుడు.. స్మశానానికి అందరూ రామనామ జపాన్ని చేస్తూ వస్తారు. ఆ రామనామం వినడానికి నేను ఈ రుద్రభూమికి వస్తూ వుంటాను. రామనామాన్ని జపించచేలా చేసిన ఆ శవానికి నేను నమస్కరిస్తాను. కాబట్టి అగ్నితో దహించబడ్డ ఆ శరీరానికి సంబంధించిన చితా భస్మాన్ని ఒంటికి పూసుకుంటాను. రామనామం జపించేవారంటే తనకు చాలా ఇష్టమని కూడా చెబుతాడు.
గమనిక : పైన ఇవ్వబడిన విషయాలన్నీ ప్రముఖ పండితులు, ఇంటర్నెట్, ఆధ్మాత్మిక పుస్తకాల నుంచి సేకరించబడింది. కాబట్టి వీటిని మేము పూర్తిగా సరైనదని దృవీకరించలేము.



Click it and Unblock the Notifications
