Latest Updates
-
చపాతీ, నాన్, జీరా రైస్ లోకి అమృతంలాంటి నవరతన్ కుర్మా.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
శృంగార సమస్యల సంజీవని.. ఈ హల్వాను కప్పు తిన్నారంటే వీర్య పుష్టి మీ సొంతం.! -
నెలసరి సమయంలో చేసే పొరపాట్లు.. శానిటరీ ప్యాడ్లో ఇది ఉందో లేదో చెక్ చేసుకుంటున్నారా.? -
జలుబు, దగ్గుని ఒక్కరోజులో మాయం చేసే పాతకాలంనాటి ఘాటైన రసం.. ఐదే నిమిషాల్లో రెడీ -
రోడ్డుపై పెరిగే బిచ్చగాళ్ల పిల్లలు వ్యాక్సిన్లు లేకపోయినా.. హెల్తీగా, స్ట్రాంగ్ గా ఎందుకు కనబడతారు? -
కుజ, రాహువుల మధ్య నవపంచమ యోగం.. ఈ 4 రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు -
రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ చిల్లీ చికెన్.. ఇంట్లోనే పక్కా లోకల్ ఫ్లేవర్ తో ఇలా చేసేయండి! -
90స్ కిడ్స్ ఫేవరెట్ కొబ్బరి మిఠాయి.. అప్పటి ఆ రుచిని ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
పిత్తులు వేసే వాళ్లని చూసి నవ్వుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి.. -
స్పైసీ మసాలా కార్న్ కర్రీ..చపాతీ, నాన్ లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్!
వారణాసిలోని వారాహి అమ్మవారి ఆలయంలో సాధారణ భక్తులకు ప్రవేశం ఎందుకు లేదో తెలుసా..?
వారణాసిలో వున్న శక్తివంతమైన దేవాలయాల్లో వారాహి దేవాలయం కూడా ఒకటి. కాశీలో వున్న శివాలయం నుంచి కేవలం కాలినడకన మనం ఈ ఆలయానికి వెళ్లవచ్చు. ఇరుకు సందుల గుండా వెళితే ఎరుపురంగు తలుపులతో మనకు వారాహి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. ఆ ఆలయంలో భూగర్భంలో అత్యంత ఎత్తైన విగ్రహంతో శక్తిస్వరూపిణిగా ఉగ్రరూపంతో మనకు దర్శనమిస్తుంది. వారణాసిలోని వారాహి అమ్మవారు ఉగ్రస్వరూపిని కాబట్టి ఈ దేవాలయంలోకి పూజారికి తప్ప ఇంకెవ్వరికీ ప్రవేశం వుండదు. వారాహి దేవి రాత్రి దేవత. రాత్రి సమయంలో అమ్మవారు రక్షకురాలిగా వుంటారు.పగటిపూట కాశీనగరానికి రక్షకుడు కాలభైరవుడు.

వారాహి అమ్మవారు పగటిపూజ విశ్రాంతి తీసుకుంటారు. అందుకే ఈ ఆలయాన్ని కేవలం బ్రహ్మముహూర్తంలో మాత్రమే తెరిచి వుంచుతారు. ఆ సమయంలోనే ఆలయ పూజారి భూగర్భంలోకి వెళ్లి పూజా హారతి ముగించుకొని బయటకు వస్తాడు. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు కూడా పూజారి ఆలయం లోపలికి వెళ్లి మాయి మాయి అని పిలుస్తాడు. అమ్మ మీరు ఈ రోజు ఎలాంటి వస్త్రాలను ధరించాలనుకుంటున్నారు, మీరు ఏ అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వాలనుకుంటున్నారు అని అడుగుతారు.
సాధారణ భక్తులకు ఈ ఆలయంలోపలికి వెళ్లే అనుమతి లేదు. ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపంలో వుండే శక్తిస్వరూపిని కాబట్టి వారాహి అమ్మవారిని అలా చూసే సామర్ధ్యం మనలాంటి సామాన్య భక్తులకు వుండదు. ఈ ఉగ్రరూపాన్ని గురువు చేత మంత్రోపదేశం నేర్చుకొని ఆధ్యాత్మిక లక్షణాలు కలిగిన వారికి మాత్రమే వుంటుంది.
సాధారణ భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలంటే ఆలయం పై స్థానంలో రెండు రంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రంద్రం లోంచి అమ్మవారి ముఖాన్ని, మరో రంద్రం లోంచి అమ్మవారి పాదాలను చూడవచ్చు.
తాంత్రికులు వారామి అమ్మవారిని పూజిస్తారు. సూర్యాస్తమయం తరువాత, సూర్యోదయానికి ముందు వారాహి అమ్మవారిని పూజిస్తే ఫలప్రదం వుంటుందని తాంత్రికులు విశ్వసిస్తున్నారు. ఈ అమ్మవారు న్యాయ దేవత కూడా, అందువల్ల చాలా మంది భక్తులు తమకు న్యాయం జరగాలని అమ్మవారిని మొక్కుకుంటారు. వారాహి అమ్మవారిని దయ్యాలు, భూతాలు, యక్షులు, యక్షిణులు సాయంత్రం వేలలో పూజిస్తారని పండితులు చెబుతున్నారు. సాయంత్రం వేలలో ఆలయాన్ని దర్శించడానికి వెళ్లిన వారు ప్రాణాలతో బయటపడరని కూడా అంటారు.
అమ్మవారి ముందు ఎవరైనా తప్పుడు పనులు చేస్తే అమ్మవారు వారిని దండిస్తుంది. ఒకసారి బ్రహ్మముహూర్తంలో అమ్మవారికి పూజలు చేయడానికి అమ్మవారి వద్దకు వెళ్లి తప్పుడు మంత్రాలు చదువుతాడు. దీంతో అమ్మవారు ఆ పూజారిని మింగేసిందని అక్కడి వారు చెబుతుంటారు. కొత్తగా పెళ్లైన జంట వద్దనావినకుండా సాయంత్రం సమయంలో వారాహి అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయం లోపలికి వెళ్తారు. వెళ్లగానే ఇద్దరూ కళ్లు తిరిగి కింద పడిపోతారు. పూజారులు వెంటనే శాంతి మంత్రాలు చదవడంతో వారి ప్రాణాలు దక్కుతాయ్.
గమనిక : పైన ఇవ్వబడిన వివరాలను ప్రముఖ పండితులు, పురాణాలు, శాస్త్రాలూ, ఇంటర్నెట్ నుంచి సేకరించింది. వీటిని మేము ఎట్టి పరిస్థితిలో దృవీకరించము.



Click it and Unblock the Notifications