Latest Updates
-
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు!
గురువారం ఈ దేవుళ్లను ఆరాధిస్తే.. జాతకంలో దోషాలు తొలగి, దైవానుగ్రహం పొందినట్లే.!
హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి వారానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. వారంలో ఒక్కో రోజు కొందరు దేవుళ్లకు ప్రత్యేకంగా పూజలు చేసి ఆరాధిస్తుంటారు. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయని నమ్మకం. అదేవిధంగా రేపు గురువారం. మరి ఆ రోజు ఏ దేవుడిని పూజిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.? అందుకోసం ఏం చేయాలి.? పండితులు ఏం చెబుతున్నారు.? ఇక్కడ తెలుసుకుందాం.

గురువారం రోజు మహావిష్ణువు, బృహస్పతికి ప్రీతికరమైన రోజు. అదేవిధంగా గురు దత్తాత్రేయ, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, సాయిబాబాలను పూజించడం సాంప్రదాయబద్ధంగా వస్తోంది. ఆ రోజు సంబంధిత ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహిస్తారు. ఆ ప్రత్యేకమైన రోజు ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఇంకా ఇంట్లోని పూజ గదిలో ఇష్ట దైవారాధాన చాలా ముఖ్యం.
విష్ణు ఆరాధన
గురువారం రోజును బృహస్పతిని పాలించాడని భక్తుల విశ్వాసం. ఇంకా ఆ రోజును శ్రీమహా విష్ణువును ఆరాధిస్తే దాంపత్య జీవితంలో శాంతి, సంతోషం లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఫలితంగా కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంట్లో సిరి సంపదలు, ఐశ్వర్యం తొలగిపోతాయని సూచిస్తున్నారు. అందుకోసం గురువారం రోజున ఇవి పాటించాలి.
పూజా విధానం
విష్ణువు, బృహస్పతి ఆశీస్సులు పొందేందుకు గురువారం రోజున ఉదయాన్నే తల స్నానం చేసి పసుపు బట్టలు ధరిస్తే మంచిది. ఆరోజున ఎట్టి పరిస్థితుల్లో నల్లటి దుస్తులు ధరించవద్దని పండితులు సూచిస్తున్నారు. పూజ చేసేటప్పుడు అరటి బోదులో ఆవు నెయ్యితో దీపం వెలిగించడం మంచి ఫలితాలను ఇస్తుంది. దేవుడికి నైవేద్యంగా నెయ్యి, పాలు, పసుపు, పూలు, బెల్లం, లడ్డూలను సమర్పించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగి దేవుడి అనుగ్రహం ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.

దక్షిణామూర్తి, దత్తాత్రేయ పూజ
దక్షిణామూర్తి స్వామిని ఆరాధించేవారు స్వామివారికి పసుపు వస్త్రాలు, తెల్ల జిల్లేడు పూలు, లేదా పసుపు రంగు పూలతో అలంకరించి.. శనగలు, బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి. గురువారం రోజు దత్తాత్రేయ స్వామి వారి విగ్రహానికి గంధంతో బొట్టు పెట్టి, పసుపు రంగు పూలను సమర్పించడం శ్రేయస్కరం. పండ్లు, పరమాన్నం వంటి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. స్వామివారి మంత్రం జపిస్తూ పూజ చేసుకోవాలి.
సాయిబాబా, రాఘవేంద్రుని ఇలా ఆరాధించాలి
షిరిడీ సాయిబాబాకి ప్రీతికరమైన గురువారం రోజున బాబా ఫొటోకి గంధం పూసి, పసుపు, గులాబీ రంగు పూలమాలలు వేసి అలంకరించాలి. పండ్లు, అటుకులు, బూందీ లడ్డూలను చేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా సమర్పించాలి. సాయిబాబా అష్టోత్తరం చదువుతూ చివరిగా బాబాకి హారతి ఇవ్వాలి. రాఘవేంద్ర స్వామిని ఆరాధించే ఈ రోజున స్వామివారికి తులసీమాలలు సమర్పించాలి. గురుస్తోత్రం పఠిస్తూ పండ్లు, తమలపాకులు, కొబ్బరికాయలను నైవేద్యంగా పెట్టి పూజించాలి. ఇలా ప్రతి వారం చేయడం ద్వారా జాతకంలో గురు దోషాలు ఉన్నా తొలగిపోతాయి. బృహస్పతి అనుగ్రహం కలిగి ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం చేకూరుతుందని పండితులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications
