Latest Updates
-
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే..
గుండె పదిలం, కండరాలు దృఢం.. 30 ఏళ్లు దాటిన మగవాళ్లు రోజూ తినాల్సిన అద్భుతమైన గింజలివే
30 ఏళ్లు దాటగానే మగవాళ్ల శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. గతంలో ఉన్నంత స్టామినా ఇప్పుడు ఉండకపోవచ్చు. ఆఫీసు పనులు, కుటుంబ బాధ్యతలు, పెరిగే ఒత్తిడి.. వీటన్నింటి మధ్య ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం చాలా కామన్. కానీ 30 దాటిన తర్వాతే మన శరీరంపై మరింత శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా పురుషుల ఆరోగ్యం, ఫిట్ నెస్, సంతానోత్పత్తి సామర్థ్యం(ఫెర్టిలిటీ) మెరుగుపరచడంలో కొన్ని రకాల గింజలు అద్భుతంగా పనిచేస్తాయని ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ మువ్వ శృతి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన వీడియోలో తెలిపారు . 30 ఏళ్లు దాటిన ప్రతి అబ్బాయి తన రోజువారీ డైట్ లో తప్పకుండా చేర్చుకోవాల్సిన 5 రకాల సూపర్ సీడ్స్ ఏవో ఇక్కడ చూడండి.

చియా గింజలు
30 దాటిన తర్వాత బరువు పెరగడం, పొట్ట రావడం అనేది చాలా మంది పురుషులు ఎదుర్కొనే పెద్ద సమస్య. బరువు తగ్గాలనుకునే వారికి చియా గింజలు ఒక వరం లాంటివి. వీటిలో ఫైబర్, ప్రోటీన్ అత్యధికంగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి, అతిగా తినకుండా ఉంటారు. బరువు తగ్గడంలో ఇవి అద్భుతంగా సహాయపడతాయి. అంతేకాకుండా పురుషులలో ఫెర్టిలిటీ రేటును పెంచడానికి, రోజంతా ఉత్సాహంగా ఉంచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
నువ్వులు
మన వంటింట్లో సులభంగా దొరికే నువ్వులు పోషకాలకు పవర్ హౌస్ లాంటివి. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల బలం తగ్గుతుంది. క్యాల్షియం, ఐరన్, జింక్ పుష్కలంగా ఉండే నువ్వులు.. ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడతాయి. అంతేకాదు జుట్టు రాలడాన్ని అరికట్టి, శరీరాన్ని అంతర్గతంగా ఆరోగ్యంగా ఉంచడంలో నువ్వులు కీలక పాత్ర పోషిస్తాయి. రోజుకో స్పూన్ వేయించిన నువ్వులు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు.
పొద్దుతిరుగుడు గింజలు
ఈ గింజల్లో విటమిన్ ఈ మెండుగా ఉంటుంది. పురుషుల లైంగిక ఆరోగ్యానికి, ముఖ్యంగా స్పెర్మ్ హెల్త్ (వీర్యకణాల నాణ్యత) మెరుగుపరచడానికి పొద్దుతిరుగుడు గింజలు చాలా బాగా పనిచేస్తాయి. శరీరంలోని కణాలను డ్యామేజ్ కాకుండా కాపాడి, బాడీ సెల్స్ ఎప్పుడూ యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. ఒత్తిడిని తగ్గించడంలోనూ ఇవి మేలు చేస్తాయి.
అవిసె గింజలు
మారుతున్న జీవనశైలి కారణంగా గుండె సంబంధిత సమస్యలు యువకుల్లో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. 30 ఏళ్లు దాటిన పురుషులు తమ గుండె ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. అవిసె గింజల్లో హెల్తీ ఫ్యాట్స్ (ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్), ఫైబర్ భారీగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండెను పదిలంగా ఉంచుతాయి. మీరు ఎప్పటికీ స్లిమ్ గా, ఫిట్ గా ఉండేందుకు ఇవి బాగా తోడ్పడతాయి.
గుమ్మడికాయ గింజలు
మగవారి ఆరోగ్యానికి సంబంధించిన అత్యుత్తమ గింజలలో ఇవి ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తికి జింక్ చాలా అవసరం. గుమ్మడికాయ గింజల్లో జింక్, మెగ్నీషియం అత్యధిక మోతాదులో ఉంటాయి. ఇవి మెన్స్ ఫెర్టిలిటీని అమాంతం పెంచుతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో, కండరాలు స్ట్రాంగ్ గా మారడంలో ఇవి బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయి.
ఎలా తీసుకోవాలి?
ఈ ఐదు రకాల గింజలను దోరగా వేయించి స్నాక్స్ లా తినవచ్చు. లేదా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్, స్మూతీలు, మజ్జిగ, సలాడ్స్ లో చల్లుకుని తినడం వల్ల వీటి పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
