Latest Updates
-
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్
ఈ రోజుల్లో బరువు తగ్గాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఓట్స్. కానీ, కాస్త తీరిక చేసుకుని మన వంటగది వైపు చూస్తే ఓట్స్ కంటే ఎంతో రుచికరమైన, మరెన్నో రెట్లు పోషక విలువలున్న బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్స్ ఎన్నో కనిపిస్తాయి. ప్రముఖ పోషకాహార నిపుణురాలు లవ్ నీత్ బాత్రా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఒక పోస్ట్ లో.. ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, శరీరానికి కావలసిన అన్ని ముఖ్యమైన పోషకాలను అందించే ఆరు అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ లను సూచిస్తున్నారు.

ఆమె మాటల్లో చెప్పాలంటే.. మన అమ్మమ్మలు, నానమ్మలు ఎప్పుడూ దిగుమతి చేసుకున్న ధాన్యాలు తినలేదు, అయినా వాళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి మనకు కూడా ఇవి అవసరం లేదు. మన వాతావరణానికి, మన జీర్ణవ్యవస్థకు అలవాటు పడిన స్థానిక ఆహారం తీసుకున్నప్పుడే మన శరీరం, పేగుల్లోని మంచి బ్యాక్టీరియా చురుకుగా పనిచేస్తాయి.
ఉదయం తినాల్సిన బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ లు ఇవే
పెసరట్టు లేదా పెసరపిండి అట్టు
ఉదయాన్నే కడుపుకు తేలికగా ఉండే ఆహారం కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. మీ ప్రధాన లక్ష్యం మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను పుష్కలంగా పొందడం అయితే పెసరట్టును మించిన ప్రత్యామ్నాయం లేదు. పోషకాహార నిపుణుల ప్రకారం.. ఓట్స్ తో పోలిస్తే మన పెసరట్టులో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ. పైగా దీని గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) చాలా తక్కువగా ఉండటం వల్ల షుగర్ పేషెంట్లకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.
రాగి జావ లేదా రాగి గంజి
రాగులు పోషకాల గని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా మొక్కల ఆధారిత కాల్షియం రాగుల్లో ఉన్నంతగా మరెందులోనూ ఉండదు. ఇది ఎముకల పటిష్టతకు ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే మహిళల ఆరోగ్యానికి, ఎదుగుతున్న పిల్లలకు ఇది ఒక దివ్యౌషధం. ఇందులో అధిక స్థాయిలో ఐరన్, అమైనో ఆమ్లాలు మెండుగా ఉంటాయి. ఈ అద్భుత ప్రయోజనాల వల్లే ఓట్స్ కంటే రాగి జావ ఎన్నో రెట్లు మెరుగైనదని నిపుణులు చెబుతారు.
సజ్జల కిచిడీ
సజ్జలు మన శరీరానికి కావాల్సిన బలాన్ని ఇస్తాయి. ఓట్స్ తో పోలిస్తే సజ్జల్లో ఐరన్, మెగ్నీషియం, ప్రోటీన్లు చాలా ఎక్కువ సాంద్రతలో ఉంటాయి. ఉదయం ఒక గిన్నె సజ్జల కిచిడీ తింటే చాలు, చాలా గంటల పాటు కడుపు నిండుగా ఉండి ఆకలి వేయదు. దీనిని పెసరపప్పుతో కలిపి వండినప్పుడు, ఇది శరీరానికి అవసరమైన సంపూర్ణ శాకాహార ప్రోటీన్ ను అందిస్తుంది.
అటుకులు - మొలకల మిశ్రమం
అటుకులు అనగానే తేలికపాటి ఆహారం గుర్తొస్తుంది. అయితే ఈ అటుకులను మొలకలతో (Sprouts) కలిపి తీసుకుంటే అదొక న్యూట్రిషన్ పవర్ హౌస్ లా మారుతుంది. సాధారణ ఓట్స్ లో ప్రోటీన్, పీచుపదార్థం ఉన్నప్పటికీ.. అటుకులు, మొలకల మిశ్రమం వాటికంటే ఎక్కువ ఐరన్, సమతుల్యమైన పోషకాలను అందిస్తుంది. ముఖ్యంగా పీసీఓడీ లేదా థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఉదయం పూట ఇది ఒక అద్భుతమైన వరం.
జొన్న ఉప్మా
మన సాంప్రదాయ సిరిధాన్యాల్లో జొన్నలకు ప్రత్యేక స్థానం ఉంది. జొన్నలు రక్తంలో చక్కెర స్థాయిలను అద్భుతంగా నియంత్రిస్తాయి. మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలను పుష్కలంగా అందిస్తాయి. జీర్ణకోశ సమస్యలు ఉన్నవారికి ఉదయం పూట జొన్న ఉప్మా తినడం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది.
శనగపిండి అట్టు
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే మరో బ్రేక్ ఫాస్ట్.. శనగపిండి అట్టు. శనగపిండిలో మొక్కల ఆధారిత ప్రోటీన్, ఐరన్ అత్యధిక మోతాదులో ఉంటాయి. వ్యాయామం చేసేవారికి, కండరాల మరమ్మత్తుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కూడా తక్కువే కాబట్టి, రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా చూసుకుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
