Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ!
దక్షిణ భారతదేశంలో ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, పొంగల్, ఊతప్పం, పునుగులు.. ఇలా ఏ టిఫిన్ చేసినా దానికి సరైన కాంబినేషన్ చట్నీ ఉండాల్సిందే. అయితే ప్రతిరోజూ ఉదయం ఆదరాబాదరాగా చట్నీ చేయడం, దానికి కొబ్బరి తురుమడం, పల్లీలు వేయించడం, మిక్సీ పట్టడం, తాలింపు వేయడం కాస్త సమయంతో కూడుకున్న పనే. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు, హడావిడిగా ఉండే గృహిణులకు అద్భుతంగా ఉపయోగపడేదే ఇన్ స్టంట్ చట్నీ పొడి.

ఈ ఇన్ స్టంట్ చట్నీ పొడిని ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు చట్నీ కావాలన్నా.. జస్ట్ ఆ పొడిలో కాస్త నీళ్లు కలిపితే చాలు, నిమిషాల్లో రుచికరమైన చట్నీ రెడీ అయిపోతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు, హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులకు, బ్యాచిలర్స్‌కి, ఇది ఒక వరం లాంటిది.
చట్నీ పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-పల్లీలు
-పుట్నాల పప్పు
-ఎండుమిర్చి
-కరివేపాకు
-ఆవాలు
-జీలకర్ర
-వెల్లుల్లి
-చింతపండు
-ఎండుకొబ్బరి
-నూనె
-ఉప్పు
-మినపప్పు
చట్నీ పొడి తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులో 1 కప్పు పల్లీలు వేసి మీడియం మంట మీద బాగా ఫ్రై చేయండి. తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీలో ముప్పావు కప్పు పుట్నాల పప్పు(వేయించిన శెనగపప్పు)వేసి 1-2 నిమిషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీలోనే పావు కప్పు ఎండుకొబ్బరి ముక్కలు వేసి 1-2 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీలో 1-2 టీస్పూన్ల ఆయిల్ వేసి అందులో 15-20 ఎండుమిరపకాయలు వేసి 1-2 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు బాండీలో ఉన్న కొద్దిపాటి నూనెలోనే పిడికెడు కరివేపాకు వేసి తక్కువ మంట మీద కలుపుతూ వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీలోనే 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి కొంచెం రంగు మారేవరకు మీడియం మంట మీద ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ ఆపేసి ఆ బాండీలో 10 గ్రాముల చింతపండు వేయండి. బాండీ చల్లారేలోపు చింతపండు కొంచెం ఫ్రై అయిపోతుంది.
-ఇప్పుడు వేయంచినవన్నీ పూర్తిగా చల్లారాక వాటన్నింటిని మిక్సీ గిన్నెలో వేయండి, ఇందులోనే 1 టీస్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీస్పూన్ ఉప్పు కూడా వేసి పల్స్ మోడ్ లో తిప్పుతూ మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఈ పొడిని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఆ పొడిలోకి తాలింపు రెడీ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడయ్యాక అందులో 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేయండి. అవి కాస్త వేగాక అందులో అర టీస్పూన్ ఇంగువ, 4 ఎండుమిరపకాయల ముక్కలు, కరివేపాకు కొంచెం వేసి తాలింపుని బాగా ఫ్రై చేసి పక్కకు తీసుకోండి.
-తాలింపు లైట్ గా చల్లబడ్డాక ఇందులో గ్రైండ్ చేసిన చట్నీ పొడిని వేసి కలుపుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాక ఏదైనా డబ్బాలో నింపుకుంటే 20 రోజుల వరకు వాడుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications