Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
ఇంట్లో వస్తువులతో జుట్టుకు పట్టులాంటి మెరుపు...!

మనం తీసుకునే ఆహారం ముందుగా జుట్టుమీదే ప్రభావం చూపిస్తుంది. ఏదో సందర్భంగా దిగులుగా వుంటే జుట్టు తొందరగా రాలిపోతుంది. పౌష్టికాహారంతో పాటు, తగినంత నీరు కూడా ముఖ్యం. జుట్టుకు ఉపయోగించే కండీషనర్ లేక షాంపూల వాడకంలో జాగ్రత్త అవసరం. అంటే ఎప్పుడూ ఒకే రకమైనవి కాకుండా, మాయిశ్చరైజర్ కలిగిన షాంపూలు వాడాలి. లేకపోతే జుట్టు పొడిబారుతుంది. వారానికి ఒకసారైనా తలకు ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనె మసాజ్ చేసుకున్న తర్వాత, తలస్నానం చేయాలి. జుట్టు గరుకుగా వుంటే కండీషనర్ ఎక్కువగా వున్న షాంపూలనూ, మామూలుగా వుంటే తక్కువగా కండిషనర్ వున్నవీ వాడవచ్చు. శీకాయ, కుంకుడు కాయలు తలకు ఉత్తమం. చుండ్రు పోవటానికి, తల స్నానం చేసేముందు పెరుగు, నిమ్మకాయను పట్టించాలి. తల స్నానం తరువాత కొంచెం వెనిగర్ రాసుకుని తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు మెత్తగా వుంటుంది.
పెరుగు: ఇది ఒక సహజమైనటువంటి పదార్థం. సాధారణంగా ఇంట్లో దొరికే ఈ పెరుగును అప్పడప్పుడు తలకు పట్టించినట్లైతే జుట్టు మెరుస్తూ, సున్నితంగా ఉంటుంది. బాగా పులిసిన పెరుగును తలకు పట్టించి అరగంట సేపు అలాగే ఉండనిచ్చి తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేసుకోవాలి. ఒక వేళ తలలో చుండ్రు ఉన్నట్లైతే అరకప్పు పెరుగులో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి తలంతటికి పట్టించి తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. నిమ్మరసం చుండ్రును వదలగొడుతుంది.
గుడ్డు: గుడ్డులో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. గుడ్డులోని సల్ఫర్ ఆధారిత అమైనో అమ్లాలు..కెరటిన్ ని అందించి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. అంతే కాదు గుడ్డు లోని తెల్ల సొన జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది. కండీషనర్ గానే కదా జుట్టుకు మంచి మెరుపును మాత్రమే కాదు వెంట్రుకలు చాలా మృదువుగా చేస్తుంది. జుట్టు, ఒత్తుగా, పొడవుగా పెరిగేందుకు మనం వాడే షాంపూలో ఒక గుడ్డును కలిపి, షాంపూతో జుట్టును రుద్ది కడుక్కోవాలి. ఇలా చేస్తే అందంతోపాటు, ఆకర్షణీ యంగా కనిపిస్తుంది.
వెనిగర్ : వెనిగర్ కూడా జుట్టుకు కొత్త మెరుపు నిస్తుంది. అందుకే షాంపూతో స్నానం చేసిన తర్వాత జుట్టుకు వెనిగర్ రాసుకోవాలి. తర్వాత తిరిగి మంచినీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే జుట్టు సిల్కీగా వుండి చక్కని మెరుపును సంతరించుకుంటుంది.
బీర్: ఇది కూడా ఒక రకంగా సహజమైనటువంటి హెయిర్ కండీషనరే..దీన్ని ఉపయోగించడం వల్ల కూడా జుట్టు మెరుస్తూ, కొంత కాంతిని నింపుకొన్న సున్నితమైన జుట్టు మీ సొంతమౌతుంది. తలస్నానం చేసిన తర్వాత రెండు మగ్గుల నీటిలో కొన్ని చుక్కల బీర్ వేసి తలమీద పోసుకోవాలి. లా చేస్తే జుట్టు సిల్కీగా వుండి చక్కని మెరుపును సంతరించుకుంటుంది.
తేనె-అరటిపండు: ఇంట్లో తయారు చేసుకొనే హెయిర్ కండీషనర్స్ లో ఇది చాలా సులభమైనది. ఒక కప్పులో అరటిపండు గుజ్జు మరియు తేనె తీసుకొని, తలకు బాగా పట్టించి అరగంట పాటు అలాగే వదిలేయాలి. తర్వాత చల్లనీళ్ళతో తలస్నానం చేస్తే జుట్టు మెరుస్తుంటుంది. నల్లగా నిగనిగలాడేందుకు వీలైనంత వరకు చల్లని నీటితో తలస్నానం చేయాలి.



Click it and Unblock the Notifications