For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెయిర్ స్ల్పిట్స్ మరియు హెయిర్ డ్యామేజ్ ను నివారించే 7 మ్యాజిక్ రెమెడీస్

|

జుట్టు ఎంత ఒత్తుగా ఉన్నదనడం కన్నా ఎంత అందంగా మరియు ఆరోగ్యంగా ఉన్నదనేది చాలా అవసరం. చాలా మంది పొడవాటి జుట్టు కలిగి ఉంటారు. అయితే ఆ జుట్టు డ్రైగా మరియు డ్యామేజ్ అయి ఉంటే ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. జుట్టు సమస్యల్లో జుట్టు చిట్లడం చాలా సహజం. ఈ సమస్యను చాలా మంది అమ్మాయిలు ఎదుర్కొంటుంటారు .చిట్లిన జుట్టు, జుట్టుని పెరగనివ్వకుండా చేస్తుంది మరియు నిర్జీవంగా మరియు కళ లేకుండా చేస్తుంది.

జుట్టు చిట్లడానికి కారణం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం లేదా కెమికల్ హెయిర్ డైలను అప్లై చేయడం మరియు సలోన్ లో ఉపయోగించే ఇతర కెమికల్ ప్రొడక్ట్స్ అంతే కాదు మరీ ముఖ్యంగా హాట్ హెయిర్ స్ట్రెయిట్నర్ ను ఉపయోగించడం వల్ల లేదా బ్లో డ్రైయింగ్ మరియు తడి జుట్టును దువ్వడం వల్ల కూడా జుట్టు చిట్లడానికి కారణం అవుతుంది. కేశాలకు తగినంత పోషణ, నూనె లేనప్పుడు నిర్జీవంగా మారుతాయి. వీటికి తోడు కేశాలకు ఎక్కువ వేడి తగులుతున్నట్లయితే చివర్లు చిట్లుతాయి.

కారణం ఏదైనా చిట్లిన జుట్టును నివారించడం వల్ల ముందు ముందు ఈ సమస్యను ఎదుర్కోకుండా మరియు డ్యామేజ్ కాకుండా నివారించుకోవచ్చు. ఈ స్ల్పిట్స్ పోవాలంటే కనీసం నెలకు ఒక రోజు చిట్లిన చివర్లను కత్తిరించుకోవాలి. డ్రై హెయిర్ మరియు చిట్లిన జుట్టును నివారించడానికి వివిధ రకాల హోం రెమెడీస్ ఉన్నాయి.. మరి అవేంటో ఒకసారి చూద్దాం...

 గుడ్డు:

గుడ్డు:

గుడ్డులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. జుట్టుకు ఎక్కువ పోషణను అందిస్తుంది. అందుకే కనీసం వారానికొకసారి ఎగ్ వైట్ ను జుట్టుకు పట్టించడం ద్వారా స్ల్పిట్స్ ను నివారించుకోవచ్చు.

 మోయోనైజ్:

మోయోనైజ్:

ఇది చాలా సింపుల్ హోం రెమెడీ. మొదటి జుట్టు చివర్లను తడి చేసి , టవల్ తో తుడిచేసి, తర్వాత మొయోనైజ్ ను తలకు అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. అలాగో మరో చిట్కా...అరకప్పు మోయోజైజ్ లో రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20నిముషాలు అలాగే ఉండి తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లలో నేచురల్ ఆయిల్స్, పొటాషియం, జింక్, ఐరన్, మరియు విటమిన్ ఎ, సి. మరియు ఇలు పుష్కలంగా ఉన్నాయి . జుట్టుకు అప్లై చేయదల్చిన వాటిలో ఇది ఒక హెల్తీ ఫ్రూట్ . మీరు స్ల్పిట్స్ ను నివారించుకోవాలంటే అరటిపండు గుజ్జు మరియు పెరుగుతో హెయిర్ మాస్క్ తయారుచేసుకొని ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత తలను శుభ్రం చేసుకోవాలి.

బొప్పాయి:

బొప్పాయి:

బొప్పాయి గుజ్జు మరియు పెరుగు కాంబినేషన్ . ఇది జుట్టుకు హెల్తీ కాంబినేషన్ . ఈ మిశ్రమాన్ని జుట్టు చివర్ల వరకూ కేశాలకు అప్లై చేయాలి . ఈ హెల్తీ అండ్ విటమిన్ సి ఫ్రూట్ జుట్టు చిట్లడాన్ని నివారిస్తుంది. మరియు సమ్మర్లో డ్రై హెయిర్ ను కూడా నివారిస్తుంది.

క్రీమ్:

క్రీమ్:

ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ క్రీమ్ మరియు అరకప్పు పాలు మిక్స్ చేయాలి. ఈ కాంబినేషన్ ను డ్రై హెయిర్ కు అప్లై చేయాలి. ఈ క్రీమ్ లో ఉండే క్యాల్షియం మీ హెయిర్ ను సాప్ట్ గా మరియు సిల్కీగా మార్చుతుంది. హెయిర్ డ్యామేజ్ ను నివారిస్తుంది.

తేనె:

తేనె:

తేనె మరో హెల్తీ హెయిర్ ప్రొడక్ట్ . జుట్టును సాప్ట్ గా మార్చుతుంది . దీనికి ఒక స్పూన్ ఫుల్ తేనె మరియు పెరుగు మిక్స్ చేసి జుట్టు పొడవునా మరియు జుట్టు చివర్లకు పట్టించి, 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

మెంతి:

మెంతి:

ఒక బౌల్లో మెంతులు తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం మెత్తగా పేస్ట్ చేసి తలకు మాస్క్ లా వేసుకోవాలి. ఇలా వారంలో రెండు మాూడు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల జుట్టుకు మంచి పోషణ అందడంతో పాటు హెయిర్ స్ల్పిట్స్ నివారిస్తుంది.

English summary

Prevent Dry Split Ends With 7 Magical Remedies

Today, in this list, we have a few natural remedies that you can apply in your hair to prevent split ends. If you apply these masks at the ends of your hair every week, you will soon start to see a change in the texture of your hair.
Desktop Bottom Promotion