Latest Updates
-
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.!
మగువ అధరాలకు అధనపు ఆకర్షణ కలిగించే లిప్స్ స్టిక్స్

ఎరుపు: ప్రస్తుత ట్రెండ్ ప్రకారం సాయంత్రం వేళల్లో ధరించే డ్రెస్సులకు తగినవిధంగా బోల్డ్ రంగులను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. వర్కింగ్ మహిళలు కూడా వారు ధరించే దుస్తులకు తగినవిధంగా టాప్స్, షర్ట్స్, బ్లౌజ్ వంటివాటికి తగినవిధంగా ఎరుపు రంగు లిప్స్ స్టిక్స్ ను వినియోగించవచ్చు. శరీర ఛాయ తక్కువగా ఉండి, కొంచెం డార్క్ లకర్ ఉన్నవారు, పెదాలు గ్లాసీగా నిగనిగలాడేలా కనబడటానికి గ్లాసీ ఎరుపు రంగు లిప్స్ స్టిక్ వాడాలి. డార్క్ స్కిన్ కలిగిన మహళలు వైన్ రెడ్ మరియు డార్క్ రెడ్ కలర్స్ బాగా నప్పుతాయి.
పింక్: లైట్ కలర్స్ చూడటానికి అందంగా కనిపిస్తాయి. అయితే ఈ కలర్స్ వినయోగించడం వల్ల ప్రత్యేకంగా కనబడకపోవచ్చు. అయితే చూడటానికి మాత్రం అందంగా కనిపిస్తుంటాయి. పింక్ కలర్ లిప్స్ స్టిక్ వాడేటప్పుడు లిప్ లైనర్ వాడకూడు. అప్పుడు పెదాలు సాధారణ పెదాలను కలిగి ఉంటాయి.
చాక్లెట్ కలర్: చాక్లెట్ కలర్ లిప్స్ స్టిక్ ను సాయంత్రం వేళ అప్లై చేసుకొన్నట్లైతే మరింత ఆకర్షణీయంగా కనబడుతాయి. ఏదైనా కార్యక్రమానికి వెళ్లాలనుకొన్నప్పుడు చామన ఛాయ కలిగిన వారు రిచ్ కోకో కలర్ మరియు చాక్లెట్ కలర్ లిప్స్ స్టిక్స్ ను అప్లై చేస్తే బాగుంటుంది. ఛామన ఛాయ కలిగిన వారు లిప్ కలర్ లిప్స్ స్టిక్ అప్లై చేసినట్లైతే మరింత అందంగా కనబడుతారు.
ద్రాక్షరంగు: ఛామన ఛాయ కలిగిన వారు ద్రాక్ష రంగు లిప్స్ స్టిక్ అప్లై చేసినట్లైతే సౌందర్యం మరింత మెరుగ్గా కనబడుతుంది. డార్క్ చర్మం తత్వం కలిగిన వారు కూడా ద్రాక్ష రంగు లిప్స్ స్టిక్స్ అప్లై చేసి, దాని మీద లిప్ గ్లాస్, లైట్ కలర్ అవుట్ లైన్ వేసుకొంటే, పెదవులు మరింత ఆకర్షణీయంగా కనబడుతూ పార్టీ లో మీరే సౌందర్య రాశిలా కనిపిస్తారు.



Click it and Unblock the Notifications