Latest Updates
-
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం
కైపెక్కించే కళ్ళుకు అదనపు ఆకర్షన మస్కరా..!

మస్కారా ఇంట్లో వుంది కదాని పాత వాటిని అంటే సమయం అయిపోయినవి వేసుకోవద్దు. అలాగే మస్కారా హాండిల్ అంటే చిన్నపుల్లను పైకి క్రిందకు లాగొద్దు. అలా చేయటం వల్ల మస్కారా ట్యూబ్‌లోకి గాలి ప్రవేశించి మస్కారా త్వరగా పొడిబారిపోతుంది. మస్కారా మొద్దుబారి పోయినా లేదా మూడు నెలలు దాటినా వాడడం అంతా మంచిది కాదు. మేకప్ వేసుకోవటానికి, లేదా రెడీ అవ్వటానికి ఎప్పుడూ చేతులను ఉపయోగించరాదు. బ్రష్ లు వాడటం అలవాటు చేసుకోవాలి. అన్నింటకీ ఇప్పుడు ప్రత్యేకంగా బ్రష్‌లు దొరుకుతున్నాయి. వాటిద్వారానే వేసుకోవాలి. ముఖ్యంగా మస్కరాను ఎలా ఉపయోగించిలో తెలుసుకుందాం
1. మస్కరా ఎంపిక: మస్కరాలో చాలా రకాలు ఉన్నాయి. అయితే వాటిని ఎంచుకొనే విధానంలో జాగ్రత్త వహించి మన్నికైనది ఎంచుకోవాలి. పగలు వేసుకొనే మస్కరాలు, రాత్రుల్లో వేసుకొనే మస్కరాలు సపరేట్ గా దొరుకుతాయి. సందర్భాన్ని బట్టి మస్కరా కొనుక్కోవాలి.
2. కలర్ ఎంపిక: మీశరీర తత్వం ఎరుపు లేదా అందమైన ఐ లాషెష్ కలిగి ఉండే వారు, లైట్ బ్రౌన్ కలర్ బాగా నప్పుతుంది. చూడటానికి సాధారణంగా కనబడుతారు. డార్క్ బ్రౌన్ కలర్ రాత్రిల్లో బాగుంటుంది. ఒకవేళ మీ కనురెప్పలు డార్క్ అయితే రాత్రిల్లో గోదుమ రంగు, డార్క్ కలర్స్ ఎంచుకోవాలి.
3. ముందుగా కనురెప్పలను దువ్వడం: మస్కరా వాడముందు కన్నుకు సంబంధించిన మేకప్ అంతా అయిన తర్వాత కనురెప్పలను చిన్నసన్నని, చిన్న దువ్వెన బ్రష్ తో దువ్వుకోవాలి. తర్వాత కనురెప్పలకు స్ట్రెయిట్ గా మస్కరాను వేయాలి. కనురెప్పలు మందంగా ఉన్నట్లైతే కళ్ళు సగ భాగం మూసుకొని మస్కరాను వేసుకోవాలి.
4. మస్కరా ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి. లేదంటు బ్రష్ వదులు అవ్వడం, లేదా విరిగిపోవడం జరుగుతుంది. తర్వాత మస్కరా ఓపెన్ చేసి చాలా సేపు అలాగే ఉంచకూడదు. అలా చాలాసేపు బయటఓపెన్ చేసి పెట్టేస్తే బ్యాక్టీరీ వ్యాపించి కళ్ళకు ఇన్ఫెక్షన్ అవ్వొచ్చు.
5. మస్కరా ముందుగా పై కనురెప్పకు వేసుకోవాలి. మస్కరాను కనురెప్ప లోపలిబాగం నుండి సున్నితంగా బ్రష్ చేయాలి. మస్కరా వేసేటప్పుడు జిగ్ జాగ్ పద్దతిలో చేతిని పైకి కిందకు కదపాలి. అప్పుడే మస్కరా కనురెప్పకు బాగా అంటుంది. మస్కరా వేసిన తర్వాత రెండు సెండ్ల పాటు కన్ను ఆర్పకుండా అలాగే ఉండాలి. కొద్దిగా డ్రై అయిన తర్వాత యథావిధిగా ఉండొచ్చు. మరింత ఆకర్షనీయంగా కనబడేందుకు డబుల్ కోట్ కూడా వేయవచ్చు.
6. ఇప్పుడు మస్కరాను క్రింది రెప్పుకు వేయాలి. పై రెప్పకు ఏ పద్దతిలో వేసామో అదే పద్దతిలో క్రింది రెప్పకు కూడా వేసుకోవాలి.
7. కళ్ళ చుట్టూ మస్కరా చుక్కలు పడిఉంటాయి. కాటన్ తీసుకొని మస్కరా చుక్కలను చెరిపేయాలి. తర్వాత స్కిన్ కలర్ పౌడర్ ను రాసి వదిలేస్తే కళ్లు అందంగా కనిపించి, ఆకర్షిస్తాయి.



Click it and Unblock the Notifications