Latest Updates
-
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి
మేకప్ బ్రష్ లు ఎక్కువ కాలం మన్నాలంటే....?

చాలా మంది మేకప్ వేసుకొని బ్రష్ లను అలా వదిలేస్తుంటారు. కానీ వాటి మీదున్న తేమ కారణంగా దుమ్ము చేరిపోతుంది. ఫలితంగా చర్మం పై మృతకణాలు పేరుకుపోయి ముఖంలో కళ తప్పుతుంది. అందుకే వాటితో పనయ్యాక ఐదారు నిమిషాలు గాలికి ఉంచి కొద్దిసేపయ్యాక ఏదైనా సంచిలో లేదా డబ్బాలో పెట్టాలి.
బ్రష్ లను ఎండ, వంటింటి వేడికి దూరంగా ఉంచాలి. లేదంటే బ్రిలిల్స్ నాణ్యత తగ్గిపోతాయి. ఒక్కోసారి అవి ఊడిపోయే ఆస్కారము ఉంటుంది. వాటిని రెండు, మూడు వారాలకోసారి పంపు ధార కింద ఉంచితే బ్రష్ లలో పేరుకుపోయిన మలినాలు బయటకు వచ్చేస్తాయి. అలాగే బ్రష్ ను తలక్రిందులగా పట్టకుని గోరువెచ్చని నీటిని దారగా పోయాలి. శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్న వీటిని మందపాటి వస్త్రంలో ఉంచితే తేమ పోయి త్వరగా పొడిగా మారుతాయి.
బ్రష్ లను శుభ్రపరిచే ముందు చాలా సున్నితంగా శుభ్రపరచాలి. రష్ గా ఎలా పడితే అలా రుద్దకూడదు. అలే చేస్తే బ్రిలిల్స్ రాలిపోతాయి. బ్రష్ లను శుభ్రపరచడానికి బేబి షాంపూ లేదా ఏదైనా ఫేష్ వాష్ క్రీం వేసి సున్నితంగా కడగాలి. తర్వాత శుభ్రమైన, మెత్తటి పొడి వస్త్రం ఉపయోగించి బ్రష్ లో ఉండే నీటిని పిండివేయాలి. పొడి టవల్ మీద ఆ బ్రెష్ ను అలాగే పొడి వాతారణంలో ఆరనివ్వాలి. కొన్ని(ఐ షాడో, కన్సీలర్స్) బ్రష్ లు అతి త్వరగా ఆరిపోతాయి. మరికొన్ని(బుకీ)బ్రష్ లు ఆరడానికి ఎక్కువ సమయం తీసుకొంటాయి. అది గమనించాలి.
హ్యాండ్ బ్యాగులో రకరకాల వస్తువులతో పాటు బ్రష్ లను ఉంచాల్సిన వస్తే వాటిని టిష్యూ కాగితంలో చుట్టుకోవాలి. లేదంటే బ్యాగులో ఉన్న మురికి వీటికి అంటుకుపోతుంది. దాంతో చర్మం ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది.



Click it and Unblock the Notifications