Latest Updates
-
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే!
మండే ఎండల్లోనూ మేకప్....!?

1. డ్రెస్సింగ్ ను అనుసరించి స్కిన్ టోన్, బ్లషర్ ఉపయోగింస్తే మంచిది.
2. మేకప్ వేసుకోవాలనుకునేవారు మీకు నప్పే ఫౌండేషన్ తీసుకొని, తాజాగా ఉన్న ముఖం, మెడ మీద తేలిగ్గా రాయండి.
3. ఐబ్రో షేప్ చేసేందుకు వార్మ్ చాక్‌లేట్, స్లేటీ, గ్రే లేదా నేవీ బ్లూ షేడ్‌లు కలిగిన ఐ పెన్సిల్ ఉపయోగించండి.
3. ఐ షాడో వేసుకోవాలనుకునే వాళ్లు గోధుమ రంగును ఎంచుకోండి. ఐ షాడోని ఎప్పుడూ కంటిని దాటి బయటకి వెళ్లనివ్వకూడదు అప్పుడే అందంగా కనిపిస్తాయి.
4. ఎప్పుడూ గులాబీ, ఎరుపు, కాషాయం రంగుల ఐ షాడోలతో ప్రయోగాలు చేయొద్దు. అందరికీ ఈ రంగులు నప్పవు. బ్లషర్‌ని అవసరమైతేనే వాడాలి.
5. చీక్ బోన్ కింద నుంచి కణతల వరుకు తేలిగ్గా రాయాలి. బుగ్గలు లావుగా ఉంటే వాటి మీదా వేసుకోవచ్చు. కానీ చర్మంతో కలిసిపోయేలా రాస్తే అందంగా ఉంటుంది. మీరు మేకప్ వేసుకున్నట్లు కనపడదు.
6. కళ్లు పెద్దవిగా ఉంటే లోపల మాత్రమే కాటుక పెట్టుకోండి. సాధారణ కళ్లకు కనురెప్పల పైన, కింద ఐ లైనర్‌గానీ, ఐ పెన్సిల్‌గానీ వాడుకోవచ్చు. నలుపు, ముదురు గోధుమ, ముదురు నీలం రంగులు బావుంటాయి. మేకప్ వేసుకునే సమయంలో కళ్ళపై మాయిశ్చరైజర్ అప్లై చేయండి. దీంతో మరింత అందంగా కనబడతాయి.
7. ప్రస్తుతం వేసవికాలం కాబట్టి మీ పెదాలకు క్రీమ్ రూపంలో ఉన్న లిప్‌స్టిక్ ఉపయోగించండి. దీనికి ప్లమ్, బర్గండీ, వైన్, కోరల్, బ్రాంజ్ షేడ్‌లు ఉపయోగిస్తే మీ అందమైన పెదాల అందం ఇనుమడిస్తుంది.
8. కాంపాక్ట్ పౌడర్‌గానీ, ట్రాన్స్‌ల్యూసెంట్ పౌడర్ గానీ పఫ్‌తో ముఖానికి, మెడకు రాయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ షైనింగ్ పౌడర్‌గానీ, గ్లిట్టర్స్‌ను గానీ ముఖ్యంగా పగటి పూట వాడకూడదు.
9. వేసవికాలంలో ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి లిక్విడ్ లేదా క్రీమ్ తప్పనిసరిగా ఉపయోగిస్తే చర్మం ఎప్పుడూ తేమగా ఉంటుంది
10 ఇటువంటి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ తాజా పండ్లు, కొబ్బరినీళ్లు ఎక్కువ గా తీసుకుంటే మీ ముఖంలో అలసట కనిపించకుండా ఉంటుంది.



Click it and Unblock the Notifications