Latest Updates
-
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.!
తేనె...పాలుతో నిగారింపైన చర్మం..!

రోజూ ఉదయం పూట తేనెతో ముఖం, మెడను ఇరవై నిమిషాలు మర్దన చేసుకుని స్నానం చేస్తే చర్మం తాజాగా ఉంటుంది. కాంతిమంతంగా మారుతుంది.
కోడి గుడ్డు తెల్లసొనలో పావు చెంచా తేనె కలిపి గిలకొట్టి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి వేయాలి. దీని వల్ల ముఖం మీద మచ్చలు, ముడతలు పోతాయి.
పెరుగు, పసుపు, తేనె కలిపి సున్నితంగా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీనిని మొఖంపై మర్దనా చేసి పదిహేను నిమిషాల పాటు ఉంచి, ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. తేనె, రోజ్ వాటర్, పాలపొడి కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీనిని మొఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి.
అదేవిధంగా అర టీ స్పూన్ నిమ్మరసంలో ఒక గ్లాసు వేడి నీటిని, ఒకటి లేక రెండు టీ స్పూన్ తేనె కలిపి ఉదయానె పరగడుపుతో తాగినట్లైతే మేని మిలమిలలాడడమే కాకుండా, శరీరంలో వున్న క్రొవ్వు పదార్థాలు తగ్గి నాజూకుగా తయారవుతారు.
పచ్చిపాలలో తేనె కలిపి ఒంటికి రాయాలి. తర్వాత ముఖం మీద మాత్రం వలయాకారంలో మర్దన చేసి అరగంటయ్యాక స్నానం చేస్తే చర్మం కోమలంగా అవుతుంది. పాలు మాత్రమే కాదు పాలపొడిలో నీళ్ళు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి కడిగేసుకున్నా సరిపోతుంది.
రాత్రిపూట కొబ్బరి నూనె, ఇతార నూనెలు చర్మానికి రాయడం మంచిదే కానీ మేను రంగు మారిపోతుంది. అలాకాకుండా చిన్నారులకు వాడే నూనెలు రాస్తే మంచిది. అవి చర్మాన్ని సున్నితంగా మార్చుతాయి. విటమిన్ ‘ఇ’ ఉన్న నూనెలు శరీరానికి మరింత మేలు చేస్తాయి. పెసలను బరకగా పట్టించి సబ్బుకు బదులు సున్నిపిండిలా ఉపయోగించివచ్చు. అది చర్మం మీద మతకణాలను తొలగించి మేనును మృదువుగా చేస్తుంది.
బొప్పాయి కూడా శరీరానికి తేమనందిస్తుంది. చాయను ద్విగుణీకృతం చేస్తుంది. రాత్రిపూట గుజ్జుతో ముఖం, చేతులకు రాసి బాగా రుద్ది పావుగంటయ్యాక శుభ్రపరచుకోవాలి. స్నానానికి బాగా వేడినీళ్లు కాకుండా గోరు వెచ్చటి నీళ్ళు తీసుకొని అందులో నాలుగు చెంచాలా కొబ్బరినూనె చేర్చితే చర్మం మీద జిడ్డు వదిలిపోతుంది. కాంతి మంతంగా మారుతుంది. మాయిశ్చరైజర్లు పగటిపూట కంటే రాత్రిపూట ఎక్కవగా రాసుకోవాలి. అలానే బాదం నూనె మిగతా వాటికంటే పలుచగా ఉంటుంది. ఈ కాలంలో ఇది సరైన ఎంపిక. ఈ నూనె త్వరగా చర్మంలోకి ఇంకిపోతుంది.
ఘాటైన క్లెన్సర్లు చర్మానికి హాని చేస్తాయి. బాదం పొడికి కాస్త వెన్న కలిపి రాత్రిళ్లు ఫేస్ వాష్ లా ఉపయోగిస్తే చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. చల్లటినీళ్ళతో ముఖం కడిగి తర్వాత గులాబీనీళ్లలో ముంచిన దూదితో చర్మాన్ని బాగా తుడవాలి. గులాబీనీరు మురికిని దూరం చేస్తుంది. ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. కమలాతొక్కల పొడికి తగినంత ఓట్ మీల్ పొడి కలిపి అందులో కాసిన్ని నీరు చేర్చి మర్ధన చేయాలి. ఇలా పదిరోజులకోసారి చేస్తే మృతకణాలు తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది.



Click it and Unblock the Notifications