For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందమైన చర్మ సౌందర్యానికి హానికలిగించే హార్డ్ వాటర్..!

|

పొడి చర్మతత్వం ఉన్న వారు చర్మాన్ని అందంగా మెయింటైన్ చేయడం కొద్దిగా కష్టమైన పనే. పొడి చర్మానికి మార్కెట్లో దొరికే టాప్ బ్యూటీ మాయిశ్చరైజర్ ఉపయోగించినా ఫలితం ఉండదు. అయితే అందుకు కారణం కూడా కనిపెట్టలేము. కాబట్టి మాయిశ్చరైజింగ్ క్రీమ్ ను ఎంపిక చేసుకొనే ముందు మీరు ప్రతి రోజూ స్నానం చేసే నీటిని ఒక సారీ పరీక్షించండి. అవి ఎటువంటి నీళ్ళో తెలుసుకోండి. ఉప్పు నీళ్ళా, లేదా మంచి నీళ్ళా లేదా క్లోరినేటెడ్ వాటరా అని తెలుసుకోవాలి. ఒకవేళ హార్డ్ వాటర్(ఘాడత గల నీరు)అయితే, మీ చర్మ సమస్యలకు ఈ హార్డ్ వాటర్ కంటే మరో కారణం లేదని చెప్పవచ్చు. ఇలా సాధారణంగా బోర్ వాటర్ లేదా బావి నీరు ఉపయోగించే వారిలో ఇలా జరగుతుంటుంది. ఒక వేళ బాత్ టబ్ నిక్షేపాలు ఏర్పడటం మరియు రస్ట్(తుప్పుపట్టడం) వంటి లక్షణాలులన్నట్లైతే ఖచ్చితా మీరు ఉపయోగిస్తున్నవి హార్డ్ వాటర్ (ఘాడతగల నీరు)గా గుర్తించాలి.

హార్డ్ వాటర్ లో అధిక శాతంలో మినిరల్స్ అంటే క్యాల్షియం కార్బొనేట్ మరియు డోలమైట్ వంటి ఘాడత గల అంశాలు ఉంటాయి. ఇటువంటి మినిరల్స్ వల్ల మీ చర్మాన్ని శుభ్రపరచడానికి, మురికిని తొలగించడానికి వీటియొక్క అసమర్థతయే కారణంగా ఉంది. చివరికి మీ చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి మరియు ఇతర చర్మ సమస్యలకు కారణమౌతుంది. మరి హార్డ్ వాటర్(ఘాడత అధికంగా ఉన్న నీటిని)ఉపయోగించడం వల్ల ఏర్పడే సాధారణ చర్మ సమస్యలేంటో ఒక సారి పరిశీలించండి..

మీ అందాన్ని పాడుచేసే బావి - బోరు నీళ్ళు...!

చర్మ కణాలకు నష్టం వాటిల్లుతుంది: హార్డ్ వాటర్ వినియోగించడం వల్ల మీ ఆరోగ్యకరమైన చర్మ కణాలకు హాని కలుగించవచ్చు. హార్డ్ వాటర్ వినియోగం వల్ల హార్డ్ వాటర్ లో ఉండే జింక్, సీసం, మెగ్నీషియం మరియు క్యాల్షియం వంటి మూలకాలు ఆరోగ్యకరమైన చర్మం కణాల్లో ఉండే ఎలాస్టిన్ మిరయు కొల్లాజెన్ వంటి వాటిని నశింపచేస్తుంది. లేదా హాని కలిగిస్తుంది.

మీ అందాన్ని పాడుచేసే బావి - బోరు నీళ్ళు...!

మచ్చలు: హార్డ్ వాటర్ లో ఉండే కఠన మినిరల్స్ (జింక్, సీసం, మెగ్నీషియం మరియు క్యాల్షియం వంటి మూలకాలు) ముఖంలో మొటిమలు, మచ్చలు మరియు చర్మ పొడిబారడం వంటి చర్మ సమస్యలకు దారితీస్తుంది.

మీ అందాన్ని పాడుచేసే బావి - బోరు నీళ్ళు...!

పొడి చర్మం: హార్డ్ వాటర్ వినియోగం వల్ల వాటిలోని సహజ నూనెలో వల్ల చర్మ పొడిబారడానికి కారణం అవుతుంది. అంతే కాదు ఇంకా అదనంగా పొడిబారిన చర్మ దురద పెట్టడానికి కూడా కారణం అవుతుంది. ఈ పరిస్థితిని ప్రారంభంలోనే గుర్తించి పరిష్కరించుకోకపోతే, చర్మ వాచి మరియు పగుళ్ళకు దారితీస్తుంది.

మీ అందాన్ని పాడుచేసే బావి - బోరు నీళ్ళు...!

ఇన్ఫెక్షన్: హార్డ్ వాటర్ లోని మినిరల్స్ (జింక్, సీసం, మెగ్నీషియం మరియు క్యాల్షియం వంటి మూలకాలు) వల్ల చర్మ మీద ఒక సన్నని పొర ఏర్పడుతుంది. చర్మలోపల ఉన్న నూనె గ్రంథుల నుండి సహజ నూనెలు చర్మం యొక్క బాహ్యచర్మం చేరుకోవడానికి కష్టం కలిగిస్తుంది. చివరకు యాంటీమైక్రోబయల్ లక్షణాలు వల్ల చర్మానికి వైఫల్యం సంభవిస్తుంది.

మీ అందాన్ని పాడుచేసే బావి - బోరు నీళ్ళు...!

మొటిమలు: హార్డ్ వాటర్ తో స్నానం చేయడం వల్ల శరీరం నుండి సోపు యొక్క అవశేషాలను తొలగించడానికి కష్ట కలిగిస్తుంది. దాంతో చర్మం మీద సూక్ష్మ రంధ్రాలు దుమ్ము, జిడ్డు వల్ల మూసుకుపోయి మొటిమలు ఏర్పడటాకి కారణం అవుతుంది. మరి మీకున్న మొటిమలు హోం రెమెడీస్ తో లేదా ఔషధాలకు ప్రతిస్పంధించకపోతే అప్పుడు మీరు వాడుతున్న నీరును పరిశీలించాలి.

మీ అందాన్ని పాడుచేసే బావి - బోరు నీళ్ళు...!

తామర వ్యాధి: తామర అనేది చర్మయొక్క బాహ్య చర్మం మీద బయటి పొర మీద వాపు, లేదా ఇన్ఫెక్షన్ కలగడానికి కారణం అవుతుంది. పొడి చర్మం ఉన్నవారికి ఈ తామర వ్యాధి మరియు దద్దుర్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది.

మీ అందాన్ని పాడుచేసే బావి - బోరు నీళ్ళు...!

దురద: హార్డ్ వాటర్ వినియోగం వల్ల చర్మం నుండి సోపుయొక్క కణాలను తొలగించడానికి కష్టం అవుతుంది. హార్డ్ వాటర్ మరియు సోపు వల్ల చర్మ పొడిబారడం మరియు దురదకు కారణం అవుతుంది.

మీ అందాన్ని పాడుచేసే బావి - బోరు నీళ్ళు...!

ముడుతలు: హార్డ్ వాటర్ లోని మలినాలు ఆరోగ్యకరమైన చర్మలో ఫ్రీరాడికల్స్ ఏర్పడటానికి దారితీస్తుంది. దాంతో చర్మలో ఉన్న కొల్లాజెన్ ఉత్పత్తిని తగ్గించి ముడుతలు ఏర్పడటానికి దారితీస్తుంది.

English summary

Hard Water Causes Skin Problems! | మీ అందాన్ని పాడుచేసే బావి - బోరు నీళ్ళు...!

Sometimes we may find it difficult to manage our dry skin even with top moisturizers available in the market. But, before blaming or changing your moisturizer, take a minute to check the water in which you bath daily.
Story first published: Wednesday, April 10, 2013, 12:51 [IST]
Desktop Bottom Promotion