For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందవిహీనంగా మారిన పాదాలకు ఇవిగో అద్భుతం చిట్కాలు...!

|

సాధారణంగా కొంత మందిని గమనించినట్లైతే చాలా అందంగా కనబడుతారు. పైనుండి క్రింద వరకూ చాలా చక్కగా శరీర ఆకృతి, శరీర ఛాయ ఆకర్షనీయంగా ఉంటాయి. అయితే పాదాల విషయానికొస్తే మాత్రం అక్కడ చిన్న లోపం కనిపిస్తుంది. నిండు చందమామలో నల్ల మచ్చలా. దాంతో సిగ్గు, బిడియం చోటు చేసుకుంటుంది. పాదాలు పగుళ్ళతో కాళ్ళు అందవిహీనంగా ఉంటాయి. ముఖ్యంగా ఆడవారి పాదాలకి ఎంతో విశిష్ట స్థానం ఉంది. అటువంటి పాదాల్ని నిర్లక్ష్యం చేయడం సౌందర్యానికే కళంకం అనుకోవచ్చు. పాదరక్షలు ధరించినంత మాత్రాన, కాళ్ళు కడుకున్నంత మాత్రానా పాదాలు శుభ్రంగా అయిపోవు. వాటికి కూడా తగినంత సంరక్షణ చేసుకుంటూనే ఉండాలి.

అందుకు కొన్ని బలమైన కారణలు ఉంటాయి. అవి శరీరములో అధిక వేడి, పొడి చర్మం, ఎక్కువ సేపు నిలబడి పనిచేయువారికి సాదారణంగా వస్తుంటాయి. కఠిన నేలపై నడవడం కూడా ఒక కారణమే. ఎత్తైన చెప్పులు ధరించి నడవడంతో పాదల వద్ద రక్తప్రసరణ సరిగా జరగదు. అలాగే అధిక బరువు కలిగిఉండడం, పాదాల మీద శ్రద్ద తీసుకోకపోవడం, పోషకాహార లోపము పాదాల పగుళ్ళకు కారణమౌతున్నాయి...

పొడిబారిన పాదాలు మరియు పాదాల పగుళ్ళు చూడటానికి అసహ్యంగా ఉంటాయి. అంతే కాదు నొప్పిగా కూడా ఉంటాయి. పాదాల వెనుక బాగంలో పాదం చుట్టు గరుకుగా ఇబ్బంది పెడుతుంటాయి. దురదగా కూడా ఉంటాయి. ఇటువంటి సమస్యల నుండి బయట పడాలంటే మాయిశ్చరైజర్ తప్పనిసరి. నేచురల్ మాయిశ్చరైజర్ చేయడం వల్ల పాదాలు సున్నితంగా మారుతాయి. పాదాల పగుళ్ళ పోగొట్టుకోవడానికి సలూన్, స్పాల చుట్టు తిరిగి అధిక మొత్తంలో డబ్బు కర్చుచేయడం కంటే ఇంట్లో దొరికే కొన్ని హోమ్ రెమడీస్ వాడటం వల్ల ఖచ్చితమైన ప్రయోజనాలను పొందివచ్చు. ఖర్చు కూడా తక్కువే...! అందుకు ఇక్కడ కొన్ని పద్దతుల ద్వారా పొడిబారిన మరియు చీలిన పాదాలను సున్నితంగా మార్చుకోవచ్చు. మరి ఆ హోమ్ రెమడీస్ ఏంటో ఒక సారి చూద్దాం...

పాదాలు.. పద్మాల్లా కనిపించాలంటే..!

ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ ను చాలా రకాల బ్యూటీ ట్రీట్మెంట్స్ లో ఉపయోగించి ఉంటారు. ఆలివ్ ఆయిల్ పగిలిన మరియు చీలి పాదలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకు ఆలివ్ ఆయిల్ మరియు బాదాం ఆయిల్ ను రెండింటిని సమంగా తీసుకొని బాగా మిక్స్ చేసి కాళ్ళకు 15నిముషాల పాటు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత నీళ్ళతో శుభ్రం చేసుకుంటే పాదాలు సున్నితంగా కనబడుతాయి.

పాదాలు.. పద్మాల్లా కనిపించాలంటే..!

ఉప్పు: పాదాల సంరక్షణలో ఉప్పును కామన్ హోం రెమడీగా ఉపయోగిస్తుంటారు. మీ పాదాలను హాట్ వాటర్ లో కొద్దిసే నాననివ్వాలి. ఆ నీటిలో ఉప్పు కూడా వేయాలి. కాళ్ళను అలా 10నిముషాల ఉంచి తర్వాత బయటకు తీసి ఫ్యూమిస్ స్టోన్ తో రుద్దాలి. దాంతో పాదాల మీద ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోతుంది. కాళ్ళు అందంగా కనబడుతాయి.

పాదాలు.. పద్మాల్లా కనిపించాలంటే..!

తేనె-పాలు: పగిలిన, పొడిబారిన పాదాల నివారణకు సహజ పద్దతిలో తేనె మరియు పాలు ఉపయోగించే హోం రెమెడి. తేనె నేచురల్ మాయిశ్చరైజర్. ఇది చర్మానికి మంచి మెరుపునందిస్తుంది. గోరు వెచ్చని నీటిలో పాదాలను ముంచి పదినిముషాలతర్వాత బయటకు తీసి ఫ్యూమిస్ స్టోన్ తో స్ర్కబ్ చేయాలి. అలా చేయడం వల్ల డెడ్ సెల్స్ తొలగించబడుతుంది. ఇప్పుడు తేనె మరియు పాలు సమంగా మిక్స్ చేసి పాదాలకు మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

పాదాలు.. పద్మాల్లా కనిపించాలంటే..!

గ్రేప్ సీడ్ ఆయిల్: పగిలిన మరియు పొడిబారిన పాదాలకు అద్భుతమైన మార్పును తీసుకొచ్చే గ్రేప్ సీడ్ ఆయిల్. గోరువెచ్చని నీటిలో ఆలివ్ ఆయిల్, గ్రేప్ సీడ్ ఆయిల్ వేసి కాళ్ళను ఇరవై నిముషాల పాటు నాన్చాలి. తర్వాత కాళ్ళను నీటిలో నుండి బయటకుతీసి స్ర్కబ్ చేయాలి.

పాదాలు.. పద్మాల్లా కనిపించాలంటే..!

వాజలైన్: వాజలైన్ చర్మానికి చాలా ప్రభావంతమైన మార్పును తీసుకురావడం బాగా సహాయపడుతుంది. డ్యామేజ్ అయిన లేదా పొడిబారిన పాదాలకు నివారణ కలిగిస్తుంది. ఈ స్కిన్ కేర్ వాజలైన్ ను పాదాలకు ప్రతి రోజూ మర్ధన చేయడం వల్ల సున్నితమైన పాదాలను పొందవచ్చు.

పాదాలు.. పద్మాల్లా కనిపించాలంటే..!

బట్టర్: బట్టర్ ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాదు శరీరం మొత్తానికి హైడ్రేషన్ కలిగిస్తుంది . మీ పాదాలను స్ర్కబ్ చేసిన తర్వాత చేతి నిండుకు బట్టర్ తీసుకొని కాళ్ళకు మసాజ్ చేయాలి. తర్వాత ఫలితాలను చూడండి.

పాదాలు.. పద్మాల్లా కనిపించాలంటే..!

ఓట్స్: పొడిబారిన మరియు పగిలిన పాదాలకు ఓట్ మీల్ స్ర్కబ్ ఒక మంచి హోం రెమడీ. ఓట్ మీల్ ను పేస్ట్ లా తయారు చేసి పాదాలకు స్ర్కబ్ చేయాలి.

పాదాలు.. పద్మాల్లా కనిపించాలంటే..!

కోకా బట్టర్: కోకా బట్టర్ మరొక ఫూట్ కేర్ ప్రొడక్ట్. దీన్ని పగిలిన మరియు పొడి బారిన పాదాలకు ఉపయోగించవచ్చు. కోకా బట్టర్ లో పగుళ్ళను నివారించే అద్భుతమైనటువంటి విటమిన్ ఇ మరియు ఇతర నేచురల్ మాయిశ్చరైజర్స్ ఉన్నాయి. ఇవి పొడిబారిన పగిలి పాదాలకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. కాబట్టి కోక బాటర్ ను పదిహేను నిముషాల పాటు పాదాలకు మసాజ్ చేయాలి.

పాదాలు.. పద్మాల్లా కనిపించాలంటే..!

గ్లిసరిన్: చర్మ సమస్యలను నివారించడంలో గ్లిసరిన్ మరియు రోజ్ వాటర్ మంచి కాంబినేషన్. ఈ రెండింటి నేచురల్ మాయిశ్చరైజర్ కాంబినేషన్స్ తో పాదాలను మసాజ్ చేయడం వల్ల పాదాలు సున్నితంగా మారుతాయి. దాంతో పొడిబారిన మరియు గరుకుదనం మాయం అవుతుంది.

పాదాలు.. పద్మాల్లా కనిపించాలంటే..!

కాఫీ: కాఫీ త్రాగడానికి మాత్రమే కాదు ఇది ఒక అద్భుతమైన హోం రెమడీగా ఉపయోగపడుతుంది. పగిలిన, పొడిబారిన పాదాలను ఒక కప్పు కాఫీ పౌడర్ లో 5చెంచాల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ఎండిన తర్వాత స్ర్కబ్ చేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల సన్ టాన్ తొలగించి చర్మాన్ని కాంతి వంతంగా మార్చుతుంది.

English summary

Home Remedies To Treat Dry n Cracked Feet! | పాదాలు.. పద్మాల్లా కనిపించాలంటే..!

Every women strives to look good and beautiful in all the possible ways. We spend excessively in order to look presentable; we hit the parlors often not bothered about our pocket getting burnt. Meanwhile, when we get our beauty treatments done, we always concentrate on our face as opposed to the other parts of our body.
Story first published: Friday, March 1, 2013, 19:24 [IST]
Desktop Bottom Promotion