For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన అందమైన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం ఎలా...

|

అందమంటే బయటకు కనిపించే చర్మమే కదా! తెల్లటి శరీరఛాయతో మెరిసిపోవటమే సగం అందానికి కారణం. వయస్సు పెరిగే కొద్ది మన శరీరపు చర్మసౌందర్యం మెరుపు తగ్గిపోతుంది. వయసువలనే అనే అపోహ చాలా మందిలో వుంది కాని కారణం కాదు. ముఖ్యంగా ఎండలో తిరగటం ఎక్కువ శారీరకశ్రమ, ఇవన్నీ చర్మ సౌందర్యాన్ని మసక బారేలా చేసి నల్లబరుస్తుంది. స్నానం చేశాక తుడుచుకున్నప్పుడు చూసుకుంటే మన చర్మపు రంగు ఏమిటో ప్రస్తుతం బైటికి కనిపించే శరీర అవయవాల రంగేమిటో తెలుస్తుంది. అంత తేడా వుండటానికి కారణం బట్టలతో చర్మాన్ని రక్షణగా వుంచకపోవటం, అలా అని శరీరం అంతా బట్టలతో చుట్టుకోమని కాదు స్నానం చేశాక కాలాన్ని బట్టి మాయిశ్చరైజర్‌ రాసుకోవటం, చలికాలం అయిత కోల్డ్‌ క్రీము రాసుకోవటం చేయాలి. మనం చేయాల్సింది ఎండలో బైట తిరిగేటప్పుడు కేర్‌ తీసుకోవటం, బ్యూటీ పార్లర్‌కు వెళ్ళే మీకు తెలియనిది కాదు. పార్లర్‌ లో ఫేషియల్‌ చేయించుకొని ఎండలో బైటికి వచ్చి ఇంటి కొచ్చి చూసేసరికి అయ్యో అలానే వున్నానే అక్కడే పార్లర్‌లోనే కాసేపాగి వచ్చినా సరిపోయేది లేదా సాయంత్రం వెళితే సరిపోయేదే, అని అనుకోవటం సహజం.

అంటే ఎండలో వుంటే రెండు వందలు పెట్టి చేయించు కున్న ఫేషియల్‌ కూడా పోతుందంటే రోజూ ఎండలో ఏ మాత్రం కేర్‌ లేకుండా తిరిగే మీ చర్మపు రంగులో ఎంత మార్పు వస్తుంది. కారణం అర్ధమయిందిగా, సూర్యుని నుంచి వచ్చే యూవి కిరణాలు చర్మసౌందర్యాన్ని డిస్ట్రబ్‌ చేస్తాయి. మెరిసిపోయే మీ అందాన్ని హరింపచేస్తాయి. విటమిన్‌ సి, మెలనిన్‌ ఉత్పత్తిని నిషేధించి చర్మం రంగును, కాంతిని మెరుగు పరుస్తుంది. వయసుని పళ్ళరసాలు తగ్గిస్తాయి. సూర్యకిరణాల్లో హాని చేసే యూవి-బి కిరణాల నుంచి కూడా విటమిన్‌ ‘సి'వల్ల రక్షణ పొందవచ్చు. శరీరఛాయ నల్లబడకుండా ఎక్సట్రా బెనిఫిట్‌ ఇస్తుంది. కాబట్టి సూర్మరశ్మి శరీరానికి అవసరమైనంత తీసుకోవాలి.

ఎక్కువగా ఎండలో వుంటే చర్మం నల్లబడి పోతుంది. ఇప్పటి దుస్తులు కూడా అలానే వున్నాయి. శరీరానికి ఎండ బాగా తగిలే విధంగా వుంటున్నాయి. చర్మానికి కొత్తదనముతో పాటు చర్మము చిట్లకుండా వుండాలంటే ఆహారములో మార్పులు రావాలి. అంటే విటమిన్‌ ఎ వుండే ఆహార పదార్ధాలను తీసుకోవాలి. బీట్‌రూట్‌ సహజ క్లెన్సర్‌లా పనిచేసి చర్మాన్ని ప్రకాశవంతంగా, కోమలంగా మృదువుగా వుంచుతుంది. సాధారణంగా ముఖానికి ఎటువంటి మేకప్‌ చేయకుండా వుండటమే మంచిది. మరీ అవసరమైతే తప్ప మేకప్‌ వేసుకోకూడదు. అందులో మేకప్‌కు మీరు వాడే సామాగ్రి బ్రాండెడ్‌ అయి వుండాలి. సాధారణ ప్యాకలుే అంటే ఇంట్లో చిట్కాలను ఉపయోగించి ప్యాక్స వేసుకోవచ్చు. దీని వలన ముఖానికి ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స వుండవు. అంతేకాక ముఖం పై ముడతలు కూడా రావు. ఇటువంటివి మనం రెగ్యులర్ గా తీసుకోవల్సిన మరికొన్ని జాగ్రత్తలు ఏంటో చూద్దాం...

చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం ఎలా...

కోకోనట్: చర్మ సౌందర్యం పెంచుకోవాలనుకునే మహిళలు కొబ్బరి నీరు వారంలో కనీసం మూడు సార్లు తాగితే చర్మంలో తేమ కలిగి మంచి నిగారింపు వస్తుందంటున్నారు. ముఖంపై వచ్చే మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటివి కూడా పోతాయని అన్ని కాలాలలోను లభించే ఈ సహజపానీయంలో ఔషధ గుణాలు కూడా మెండుగా వున్నాయని మహిళలు కొబ్బరి నీటిని డెలివరీ అయిన తర్వాత రెగ్యులర్ గా తాగుతూంటే ప్రసవ సమయంలో పోయిన శక్తి తిరిగి పొందుతారని పోషకాహార నిపుణులు తెలుపుతున్నారు.

చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం ఎలా...

వ్యాయామం: ప్రతి రోజూ మంచి ఆహారంతో పాటు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కండరాలు సంకోచ, వ్యాచాలు చెంది, రక్త ప్రసరణ బాగా జరిగి చర్మానికి మంచి నిగారింపును ఇస్తుంది. వ్యాయామంతో శరీరంలో ఉండే మలినాలు బయటకు పంపి చర్మం క్లియర్ గా ఉండేలా చేస్తుంది. దాంతో ముడతులు, తొలగి వయస్సు మీద పడకుండా చేస్తుంది.

చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం ఎలా...

నిద్ర: ఒక్క రోజు సరిగా నిద్రలేకపోవడం వల్ల కళ్ళక్రింద వలయాలు, నిర్జీవమైనచర్మం, కళ్ళు లోతుగా, ముఖం అందవిహీనంగా కనబడుతాం. కాబట్టి ప్రతి రోజూ తగినంత నిద్ర (7-8గంటలు)పోవడం వల్ల చర్మానికి మాత్రమే కాదు మొత్తం శరీరానికి విశ్రాంతి కలిగి ఉదయం తాజాగా కనబడుతారు.

చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం ఎలా...

గర్భాధరణ: గర్భాధారణ సమయంలో తప్పనిసరిగా చర్మంలో చాలా మార్పులు(చర్మంలో చారలు) చోటుచేసుకుంటాయి. కాబట్టి ప్రసవం తర్వాత, ప్రసవానికి ముందు కూడా మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం చాలా అవసరం. విటమిన్ ఎ క్రీములు మరియు లేజర్ థెరపీ కూడా చాలా బాగా సహాయపడుతుంది. శరీరంలో విడుదలయ్యే ఎక్కువ హార్మోనుల వల్ల మొటిమలు ఎక్కువగా బాధిస్తాయి. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రతి రోజూ ముఖాన్ని రెండు సార్లు కడుక్కోవాలి. తర్వాత ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ను ఉపయోగించాలి.

చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం ఎలా...

సూర్యరశ్శి: ఎండలో ఎక్కువగా తిరగడం లేదా అతి వేడి వల్ల కూడ చర్మం డ్యామేజ్ అవుతుంది. దాంతో వివిధ రకాల చర్మ సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి సన్ స్రీన్ లోషన్ తోపాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నాం 2 మధ్యల మద్య ఎండలో ఎక్కువగా తిరగకపోవడం మంచిది

చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం ఎలా...

వయస్సు మీదపడ్డప్పుడు: వయస్సు పెరిగేకొద్ది, చర్మంలో మార్పులు సహజం. మీ శరీరం ఎక్కువ కొలాజెన్ ఉత్పత్తి చేయ్యదు. దాంతో చర్మంలో ముడతలు, స్ప్రింగ్స్ లా కనబడుతాయి. చర్మాన్ని వదులా చేస్తాయి. కాబట్టి నాన్ డ్రైయింగ్ సోపులు వాడటం వల్ల చర్మానికి శక్తినిస్తుంది విషాలను తొలగిస్తుంది, డెడ్ స్కిన్ తొలగి తాజాగా కనబడుతారు. విటమిన్ సి క్రీములు ముఖంలో ముడతలను ఏర్పడనియ్యవు.

చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం ఎలా...

మద్యం: ఆల్కహాలు త్రాగడం వల్ల చర్మానికి మాత్రమే కాదు, శరీరానికి కూడా హానికరమే. ఆల్కహాల్ శరీరంలోని నీరు లేకుండా చేసి చర్మాన్ని డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది. దాంతో చర్మం నిర్జీవంగా పొడిబారిపోయినట్లు కనిపిస్తుంది. ఇంకా ముఖ చర్మ ఎర్రగా మారి రక్తకణాలను డ్యామేజ్ చేస్తుంది.

చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం ఎలా...

పొగత్రాగడం: స్మోకింగ్, చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. స్మోకింగ్ వల్ల పొడి చర్మం, ముడతుల అధికంగా ఉంటుంది. స్మోకింగ్ రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. అంతే కాదు కొల్లాజెన్ ఉత్పత్తిని తగ్గించి చర్మాన్ని నిర్జీవంగా మార్చి, కళ్ళ క్రింద వలయాలు ఏర్పడేలా చేసి, పెదాలు పొడిబారేలా నల్లగా మారుతాయి. కాబట్టి స్మోకింగ్ నిలిపివేయడం మీ చర్మాన్ని కాపాడుకోవడానికి మంచి మార్గం.

చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం ఎలా...

ఫేస్ వాష్: కాలుష్యం వల్ల చర్మం చాల తర్వాత కాలుష్యం చెందుతుంద. కాబట్టి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతి రోజూ రెండు మూడు సార్లు ముఖాన్ని మంచి నీళ్ళతో శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.

చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం ఎలా...

విటమిన్స్ : మీ ఆరోగ్యంతో పాటు, అందాన్ని పెంపొందించుకోవడానికి తరచూ మీరు తీసుకొనే డైయట్ లో విటమిన్ సి ఫుడ్ అధికంగా తీసుకోవాలి. మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల తప్పని సరిగా మీ చర్మంలో మార్పులు ఏర్పడుతాయి. యాంటీఆక్సిడెంట్, ప్రోటీలను, వెజిటేబుల్స్, ప్రూట్స్, చేపలు అధికంగా తీసుకోవడం వల్ల చర్మానికి రక్షణ కల్పిస్తాయి.

English summary

How to keep your Skin Beautiful | చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం ఎలా...

Your skin protects your body, but that's not all. It's the face you present to the world. When healthy, it's a source of beauty. The choices you make every day, what you eat, where you go, how you feel -- affect how your skin looks. Use this visual guide to keep your skin youthful, healthy, and wrinkle-free.
Story first published: Tuesday, February 26, 2013, 12:43 [IST]
Desktop Bottom Promotion