For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కంటి అద్దాల వల్ల ఏర్పడ్డ మచ్చల నివారణకు పరిష్కారం...!

|

ప్రస్తుత కాలంలో చాలా మంది కళ్ళజోడును ధరిస్తున్నారు. కళ్ళ జోళ్ళు దీర్ఘకాలం పాటు వేసుకోవడం వల్ల ముక్కుమీద నల్లని చారలు శాశ్వత మచ్చలుగా అభివృద్ధికి దారితీస్తుంది. కళ్ళజోడును ధరించడం దీర్ఘకాలం పాటు పాటిస్తున్నట్లైతే అది ఒక అలవాటుగా మరుతుంది. కళ్ళ జోడు ధరించడం వల్ల ఏర్పడే ముక్కుమీద నల్లని మచ్చలను తొలగించడానికి అవకాశం ఉంది. అందుకు కొన్ని హోం రెమడీస్ మరియు బేసిక్ టిప్స్ ఉన్నాయి. ఇవి ముక్కు మీద మచ్చలను తొలగించడం మాత్రమే కాదు తిరిగా అటువంటి మచ్చలు ఏర్పడకుండా నివారిస్తాయి. క్రింద ఇవ్వబడ్డ కొన్ని హోం రెమడీస్ కంటి అద్దాలు పెట్టుకోవడం వల్ల ముక్కుమీద ఏర్పడ్డ నల్ల మచ్చలను తొలగించుకోవచ్చు.

1. హీలింగ్ ప్రోత్సహించండి: మీరు కంటి అద్దాలు నిరంతరం పెట్టుకొంటున్నట్లైతే..ముక్కమీద నల్లమచ్చలు రాకుండా ఉండాలంటే రోజులో అప్పడప్పుడు కళ్ళ అద్దాలు పెట్టుకోకుండా కళ్ళకు విశ్రాంతి కలిగించండి. దాంతో నల్ల మచ్చలు ఏర్పడవు మరియు ఆ ప్రదేశంలో బ్యాక్టీరియా మరియు మరే ఇతర ఇన్ఫెక్షన్లు కలగకుండా మిమ్మల్ని కాపాడుతుంది . మీ చర్మాన్ని ముఖ్యంగా ముక్కు మీద రోజుకు రెండు సార్లు శుభ్రం చేసుకోవడం వల్ల నల్లమచ్చలను నివారించవచ్చు. దాంతో ముక్కుమీద ఎరుపుదనం తగ్గుతుంది. దురద మరియు ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా నివారించుకోవచ్చు. మరియు మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి.

Remove Scars On Nose Due To Specs

2. మాయిశ్చరైజింగ్: మచ్చలు కల్యూజ్డ్ కణజాలం వల్ల ఏర్పడుతాయి. కాబట్టి వీటికి రెగ్యులర్ మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల ఆ ప్రదేశం తేమగా మారి చర్మానికి రక్షణకల్పిస్తుంది . ఇది చివరికి మచ్చలు తొలగింపుకు దారితీస్తుంది. ఇది క్రమం తప్పకుండా రోజుకు రెండు సార్లు ముక్కుమీద మాయిశ్చరైజర్ రాయడం వల్ల నల్ల మచ్చలు, చారలు పూర్తిగా నయం అవుతాయి.

3. నేచురల్ బ్లీచింగ్: మచ్చలు ఏర్పడ్డ ప్రాతంలో బ్లీచింగ్ చేయించుకోవడం వల్ల సాధారణ చర్మంతో పోల్చితే ఆ ప్రాంతంలో మరింత కాంతివంతంగా కనిపిస్తుంది. రసాయనాలతో బ్లీచింగ్ చేయించుకోవడం కంటే సహజంగా టమోటో లేదా బంగాళదుంపల స్లైస్ తో ముక్కు మీద రుద్దడం వల్ల మచ్చలను మాయం చేసుకోవచ్చు. వీటిని ఉపయోగించేటప్పుడు తప్పనిసరిగా తాజాగా ఉన్నవి ఎంపిక చేసుకోవాలి .

4. టోనర్ అప్లై చేయాలి: చర్మానికి సరైన మరియు రెగ్యులర్ టోనింగ్ చేయించుకోవడం వల్ల ఇది మరో మంచి పద్దతి . కంటి అద్దాలు రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల ఏర్పడ ముక్కుమీద మచ్చలు పూర్తిగా నివారించదలుచుకొన్నట్లైతే టోనర్ ను తరచూ అప్లై చేస్తుండాలి. టోనర్ రాయడం వల్ల చర్మం మరింత స్ట్రాంగ్ గా మరియు సాగే గుణాన్ని కలిగించడంతో ఈ హెల్తీ స్కిన్ మీద మచ్చలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది.

5. నేచురల్ రెమడీస్: సహజ చిట్కాలు అంటే కీరదోసకాయ ముక్కలు, విటమిన్ ఇ బాదాం ఆయిల్ మరియు ఓట్ మీల్-పాల మిశ్రమం మరియు తేనె వంటివి రెగ్యులర్ గా చర్మంమీద అప్లై చేసి రుద్దడం వల్ల కంటి అద్దాలు పెట్టుకోవడం వల్ల ఏర్పడ్డ మచ్చలను సులభంగా తొలగించుకోవచ్చు.

English summary

Remove Scars On Nose Due To Specs | కంటి అద్దాల వల్ల ఏర్పడ్డ మచ్చల నివారణకు పరిష్కారం...!

Most of the people can vouch safe for the fact that wearing spectacles for any length of time can lead to the development of a permanent scar on the surface of the nose. While you can do nothing about wearing spectacles, it is possible to remove the scars on your nose that bear evidence to your habit.
Story first published: Tuesday, May 28, 2013, 12:24 [IST]
Desktop Bottom Promotion