For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శీతాకాలంలో డ్రై స్కిన్ నివారించడానికి బెస్ట్ ఫేస్ ప్యాక్స్

|

వేసవి కాలం తర్వాత వేడి నుండి బయట పడటానికి శీతాకాలం వస్తుంది. శీతాకాలంలో వీచే చల్లగాలులు, చలి మిమ్మల్ని ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. అయితే మీ చర్మం మాత్రం అలా ఫీలవదు?శీతాలకాలంలో వీచే బలమైనటువంటి చల్లగాలులు, లోలెవల్ మాయిశ్చరైజర్ వల్ల చర్మం మరియు కేశాలు అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. చర్మం, కేశాలు, పొడిబారడం, దురద, పాదాల పగుళ్ళు, ఒంటి మీద గీతలు ఇలా ఇంకా ఎన్నో సమస్యలను తెచ్చి పెడుతుంది.

నవంబర్ డిసెంబర్ వచ్చిందంటే చాలు చలి వనికించేస్తుంది. అంతే కాదండోయ్ పెరిగిన చలి చర్మ సంరక్షణ అవసరాన్ని పెంచుతోంది. ఎంత ఆయిలీ స్కిన్ అయినా ఈ చలిగాలులకు పొడిబారుతోంది. రంగుమారి.. కళావిహీనంగా తయారవుతుంది.

చర్మ సౌందర్యానికి మిగిలిన కాలాల్లో తీసుకొనే జాగ్రత్తల కంటే శీతాకాలంలో మరికొంత ఎక్కువ శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాతవరణలో మార్పుల వల్ల చర్మ పగుళ్ళు ఏర్పడి, తడి ఆరిపోయి, గీతలు ఏర్పడి అందవిహీనంగా కనబడుతారు కాబట్టి. కొన్ని రకాల ఫేస్ మాస్క్ లను ఉపయోగించడ వల్ల సున్నితమైన... నునుపైన చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది. పూర్వం మహిళలు తమ సౌందర్యం కోసం సహజ పద్దతులతో తమ సౌందర్యాన్ని కాపాడుకొనే వారు. ప్రస్తుత కాలంలో కూడా అలాంటి నేచురల్ పద్దతులను ఉపయోగించడం వల్ల టాక్సిన్, క్లెన్సింగ్, పొడిబారడం, డ్రై స్కిన్ కలవారు ఈ శీతాకాల ఫేస్ మాస్క్ లను ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండి...

1. అవొకాడో ఫేస్ ప్యాక్:

1. అవొకాడో ఫేస్ ప్యాక్:

అవకాడో ఫేస్ మాస్క్ పొడిబారిన చర్మానకి చాలా ఫర్ ఫెక్ట్ గా పనిచేస్తుంది. ముఖంగా శీతాకాలంలో చర్మం పొడిబారి దురదగా ఉండటం వంటి లక్షణాలను అవకాడో ఫేస్ మాస్క్ పోగొడుతుంది. తాజాగా ఉన్న అవాకోడోను బాగా మెత్తగా చేసి దానికి ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి బాగా ముఖానికి అప్లై చేయాలి. ఈ ఫేషియల్ మాస్క్ చర్మానికి కావాలసిన మినరల్స్, విటమిన్స్, యాంటిఆక్సిడెంట్స్ అందించి చర్మాన్ని నునుపుగా మార్చుతుంది. శీతాకాలంలో చర్మం పొడిబారనీయకుండా చేస్తుంది.

2. మిల్క్ ఫేస్ ప్యాక్:

2. మిల్క్ ఫేస్ ప్యాక్:

కల్చర్డ్ మిల్క్ మాస్క్ చాలా సులభమైనటువంటి చర్మ సంరక్షణ పద్దతి. దీంతో చర్మం అలసిన చర్మం తేజోవంతంగా మారుతుంది. అందుకు ఒక మిక్సింగ్ బౌల్ ల్లో కొద్దిగా పెరుగు, మజ్జిగ, సోర్ క్రీమ్ ను వేసి బాగా మిక్స్ చేసి కళ్ళు మాత్రం వదిలి మిగిలిన ముఖ భాగం అంతా అఫ్లై చేయాలి. పదిహేను నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల చలికాలంలో చల్లగాలి, మంచు వల్ల చర్మ పొడి బారీ, పగుళ్ళు ఏర్పడకుండా చేస్తుంది.

3. ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్:

3. ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్:

గుడ్డులోని తెల్ల సొన ఆయిల్ స్కిన్ ఉన్నవారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎగ్ వైట్ తీసుకొని దాన్ని ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడం వల్ల మీ చర్మం మునపటి కంటే చాలా ఆరోగ్యంగా కనబడుటయే కాకుండా జిడ్డును వదిలించి చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతే కాదు ముఖ చర్మం వదులుగా లేకుండా టైట్ చేస్తుంది. చలికాలంలో దీన్ని వేసుకోవడం వల్ల చలినుండి, మంచు నుండి చర్మాన్ని కాపాడుతుంది.

4. బనానా ఫేస్ ప్యాక్:

4. బనానా ఫేస్ ప్యాక్:

చలికాలం, శీతాకాలం, వర్షాకాలంలో చర్మాన్ని రక్షించుకోవడం కొంచెం ఇబ్బదికరమైన విషయమే. సున్నితమైన చర్మ తత్వం కలవారు శీతాకాలంలో సున్నితమైనటువంటి బనానా ఫేషియల్ మాస్క్ వేసుకోవడం చాలా మంచిది. బాగా పండిన అరటిపండును బాగా మెత్తగా చేసి అందులో తాజాగా ఉన్నటువంటి స్వీట్ క్రీమ్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట పాటు అలా ఉండాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం సున్నితంగా.. మృదువుగా ప్రకాశంతంగా మారుతుంది. శీతాకాలంలో చలిగా ఉందనో, చర్మ పొడిబారి గీతలు పడుతుందనే అనుకోవాల్సిన పనిలేదు ఎప్పుడైనా ఈ మిశ్రమాన్ని వేసుకోవచ్చు.

5. ఓట్స్ ఫేస్ ప్యాక్:

5. ఓట్స్ ఫేస్ ప్యాక్:

శీతాకాలంలో చర్మాన్ని రక్షించడంలో ‘ఓట్ మీల్' చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఓట్ మీల్ కు గుడ్డులోని తెల్లసొన మరియు తేనె కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి అరగంట పాటు అలాగే వదిలేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖంలో తడి ఆరిన తర్వాత గమనించినట్లైతే ముఖం తాజాగా..నునుపు మారడాన్ని గమనిస్తారు.

6. బొప్పాయి ఫేస్ ప్యాక్:

6. బొప్పాయి ఫేస్ ప్యాక్:

బొప్పాయలో అనేక స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి శీతాకాలంలో చర్మ సంరక్షణకు అద్భుతంగా సహాయపడుతాయి . ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది మరియు చర్మం టైట్ చేస్తుంది. బాగా పండిన బొప్పాయిని గుజ్జులా చేసి అందులో కొద్దిగా పాలు మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. పది నిముషాల తర్వాత శుభ్ర చేయడం వల్ల అద్భుతంగా ఉంటుంది.

7. గ్లిజరిన్:

7. గ్లిజరిన్:

శీతాకాలంలో డ్రై స్కిన్ కు ఒక బెస్ట్ మాయిశ్చరైజర్ గ్లిజరిన్ ఫేస్ ప్యాక్. ఇదే కాకుండా గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్ మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల ఒక మంచి టోనర్ గా పనిచేస్తుంది.

8. ఆరెంజ్ అండ్ హనీ:

8. ఆరెంజ్ అండ్ హనీ:

ఆరెంజ్ తొక్కను ఎండ బెట్టి, తర్వాత పౌడర్ చేయాలి. తర్వాత ఈ పౌడర్ కు పాలు మరియు తేనె మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం వల్ల అనేక స్కిన్ బెనిఫిట్స్ పొందవచ్చు.

9. మిల్క్ పౌడర్ మరియు బాదం ఆయిల్:

9. మిల్క్ పౌడర్ మరియు బాదం ఆయిల్:

వింటర్ సీజన్ లో డ్రై స్కిన్ తొలగించుకోవడానికి, మిక్క్ పౌడర్ లో కొద్దిగా బాదం ఆయిల్, రోజ్ వాటర్ మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి . ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ డ్రై స్కిన్ ను తొలగిస్తుంది. ముఖం కాంతివంతంగా మార్చుతుంది.

10. శెనగపిండి మరియు పెరుగు :

10. శెనగపిండి మరియు పెరుగు :

డ్రై స్కిన్ నివారణకు ఇది ఒక పాపులర్ హోం మేడ్ ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ కు నిమ్మరసాన్ని కలపకండి. ఎందుకంటే శీతాకాలంలో మీ చర్మాన్ని మరింత డ్రై గా మార్చుతుంది. తేనెను మిక్స్ చేసి ప్యాక్ లా వేసుకోవాలి.

11. రోజ్ ఫేస్ ప్యాక్:

11. రోజ్ ఫేస్ ప్యాక్:

రోజాపువ్వుల యొక్క రేకులు మీ ముఖంలో తాజాదనాన్ని నింపుతుంది. మరియు చర్మం ప్రకాశవంతంగా మార్చుతుంది . మీరు రోజ్ వాటర్ లో తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది మీ చర్మాన్ని తేమగా మరియు సాఫ్ట్ గా ఉంచుతుంది. అలాగే రోజా పువ్వుల యొక్క రేకులను పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవచ్చు.

12. కోకో పౌడర్ ఫేస్ ప్యాక్:

12. కోకో పౌడర్ ఫేస్ ప్యాక్:

కోకో పౌడర్ ఇది చర్మానికి మాయిశ్చరైజ్ గానే కాకుండా, చర్మాన్ని సాప్ట్ గా మార్చుతుంది. కోకో పౌడర్ కు తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి . పది నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Treat Dry Skin In Winter: Face Packs

Applying face packs is a traditional method to ensure skin care. Your skin changes as per weather conditions. As winter is coming closer, you will see some changes in your skin. Most of the women tend to suffer from dry skin during winters.
Desktop Bottom Promotion