For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేషియల్ వల్ల మీకు తెలియకుండా కలిగే సైడ్ ఎఫెక్ట్స్..

By Swathi
|

మీ పెళ్లి అయినా, మీ ఫ్రెండ్ ఫంక్షన్, మీ ఇంట్లో శుభకార్యం, ఆఫీస్ పార్టీ, టూర్, ట్రిప్స్.. ఇలా సందర్భం ఏదైనా.. వెంటనే పార్లర్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. స్పెషల్ ఎట్రాక్షన్ కోసం.. చాలా మంది ఫేషియల్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

ఎదటివాళ్ల మనస్తత్వం తెలుసుకోవడానికి ఫేస్ చూస్తే చాలు !!

కొత్త బట్టలు, కొత్త షూస్, మేకప్, హెయిర్ స్టైల్ ఇలా.. అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటారు. అంతేకాదు ఫేషియల్ కూడా చాలా స్పెషల్ గా వెడ్డింగ్ ఫేషియల్ చేయించుకుంటారు. ఫేషియల్ వల్ల కాంప్లెక్షన్ పెరుగుతుందని, చర్మం గ్లోయింగ్ గా మారుతుంది, అలాగే చర్మం సాఫ్ట్ గా, క్లియర్ గా ఉంటుందని భావిస్తారు.

యంగ్ అండ్ ఫెయిర్ స్కిన్ పొందడానికి అమేజింగ్ ఫ్రూట్ ఫేషియల్స్

బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ని తొలగిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఫేషియల్ చేసేటప్పుడు క్లెన్సింగ్, ఎక్స్ ఫ్లోయిటింగ్, టోనింగ్, బ్లీచింగ్ ఇలా అన్నీ ట్రీట్మెంట్స్ చేస్తారు. అలాగే పార్లర్ కి వెళ్తే.. ఫ్రూట్ ఫేషియల్స్, గోల్డ్ ఫేషియల్స్, హెర్బల్ ఫేషియల్స్ ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఫేషియల్ వల్ల చర్మంలో గ్లో వస్తుంది. కానీ.. రెగ్యులర్ గా ఫేషియల్ చేయించుకోవడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. కాబట్టి ఫేషియల్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకోవడం చాలా అవసరం.

దురద

దురద

ఫేషియల్స్ లో ఉపయోగించే సొల్యూషన్స్, క్రీమ్స్ లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. అవి చర్మానికి చాలా హాని చేస్తాయి. అవి చర్మ కణాలను డ్యామేజ్ చేస్తాయి. దీనివల్ల చర్మంపై దురద, చికాకు ఏర్పడతాయి.

మచ్చలు

మచ్చలు

ఫేషియల్స్ చేసేటప్పుడు స్క్రబ్ చేయడం వల్ల చర్మంలో ఉండే మాయిశ్చరైజర్ ని బయటకు పంపుతుంది. అలాగే చర్మం పైపొరను కూడా డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల చర్మంపై మచ్చలు ఏర్పడతాయి.

రెడ్ నెస్

రెడ్ నెస్

ఫేషియల్స్ చేసేటప్పుడు ఉపయోగించే కొన్ని కెమికల్స్ మీ చర్మ తత్వానికి సరిపోకపోవచ్చు. దీనివల్ల చర్మం ఎర్రగా మారడం, వాపు రావడానికి కారణమవుతుంది.

యాక్నె

యాక్నె

ఫేషియల్ తర్వాత చాలామందికి పింపుల్స్, యాక్నె సమస్య పెరుగుతుంది. ఎందుకంటే ఫేషియల్స్ తర్వాత చర్మ గ్రంధులు తెరుచుోవడం వల్ల సెబమ్ ఉత్పత్తి అయి.. మొటిమలకు కారణమవుతాయి.

ఎలర్జీ

ఎలర్జీ

చాలా రకాల ఫేసియల్స్, ఫేషియల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటిల్లో రకరకాల పదార్థాలు మిక్స్ చేస్తారు. అయితే ఫేషియల్స్ ఉపయోగించే కొన్ని పదార్థాలు అలర్జీలకు, దురదలు, రాషెష్ కి కారణమవుతాయి.

గీతలు

గీతలు

బ్లాక్ హెడ్స్ తొలగించేటప్పుడు బ్యూటీషియన్స్ చేతి వేళ్లు లేదా పరికరాలు ఉపయోగిస్తారు. ఇలా చేసేటప్పుడు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. గాయాలు, గీతలు ఏర్పడటానికి కారణమవుతాయి.

డ్రై స్కిన్

డ్రై స్కిన్

రెగ్యులర్ ఫేషియల్స్ న్యాచురల్ మాయిశ్చరైజర్ ని తొలగిస్తాయి. అలాగే పీహెచ్ లెవెల్స్ ని డ్యామేజ్ చేయడం వల్ల.. చర్మం చాలా పొడిబారుతుంది.

చూశారుగా ఫేషియల్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్. ఇకపై ఫేషియల్ చేయించుకునే ముందు జాగ్రత్త వహించండి. అలాగే మీ చర్మ తత్వాన్ని బట్టి ఫేషియల్ ఎంచుకోవడం చాలా ముఖ్యమని మరచిపోకండి.

English summary

7 Unknown Side Effects Of Getting Facials

7 Unknown Side Effects Of Getting Facials. While it may be true that facials can have certain beneficial effects on your skin, some people opine that getting facials done on a regular basis can do more harm than good to your skin.
Story first published:Tuesday, May 24, 2016, 14:50 [IST]
Desktop Bottom Promotion