For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయిల్ స్కిన్ నివారించే అమేజింగ్ హోం మేడ్ స్ర్కబ్

|

చర్మ సమస్యల్లో ఆయిల్ స్కిన్ ఒకటి. ఆయిల్ స్కిన్ వల్ల చర్మంలో మొటిమలు, మచ్చలు మొదలగునవి ఇబ్బంది కలిగిస్తాయి. ఆయిల్ స్కిన్ ను మెయింటైన్ చేయడం అంత సులభమైన పనికాదు.

అందుకే ఆయిల్ స్కిన్ ఉన్న వారు స్ట్రిట్ గా కొన్ని బ్యూటీ టిప్స్ ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది స్కిన్ కండీషన్స్ ను దూరం చేస్తుంది.

కొన్ని ఎసెన్సియల్ ఆయిల్ చర్మ జిడ్డుగా మరియు అన్ అట్రాక్టివ్ గా కనబడేలా చేస్తుంది . సరైన స్కిన్ కేర్ తీసుకోకపోవడం వల్ల చర్మం మరింత జిడ్డుగా కనబడుతుంది. దాంతో మొటిమలు ఎక్కువ అవుతాయి. చర్మానికి క్లెన్సింగ్, మరియు ఎక్సఫ్లోయేటింగ్ వంటి సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల కొద్దిగా వ్యత్యాసం కనబడుతుంది.

నిజానికి, ఆయిల్ స్కిన్ ఉన్న వారు వారానికొకసారి లేదా రెండు సార్లు స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అబిప్రాయపడుతున్నారు. వారానికొకసారి ఎక్సఫ్లోయేట్ చేసుకోవడం వల్ల చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. బ్రేక్ అవుట్ తగ్గిస్తుంది. చర్మంలో మచ్చలను, ఇతర సమస్యలను నివారిస్తుంది.

ఆయిల్ స్కిన్ నివారించి, చర్మం అందంగా, క్లియర్ గా, హెల్తీగా కనడుటకోసం కొన్ని ఎక్సఫ్లోయేటింగ్ స్ర్కబ్ ను ఈ రోజు మీకు బోల్డ్ స్కై అందిస్తోంది.

ఈ అమేజింగ్ హోం మేడ్ స్ర్కబ్ ను చౌకైన , నేచురల్ పదార్థాలతో ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు.

ఆయిల్ స్కిన్ నివారించడం కోసం ఉపయోగించే హోం మేడ్ స్క్రబ్ ఏవిధంగా తయారుచేసుకోవాలి. ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం...

Have You Heard Of This Amazing Homemade Scrub For Oily Skin?

కావల్సినవి:
బ్రౌన్ షుగర్ : 4 టేబుల్ స్పూన్లు
ఓట్ మీల్ 4 టేబుల్ స్పూన్లు
ఆపిల్ సైడర్ వెనిగర్ 4 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం : 3 టేబుల్ స్పూన్లు

ఎలా తయారుచేసుకోవాలి?
బ్రౌన్ షుగర్, ఓట్ మీల్, ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసం అన్ని పదార్థానలు ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి.
వీటిని మెత్తాన్ని మెత్తగా పేస్ట్ చేయాలి.
స్ర్కబ్ ప్యాడ్ ఉపయోగించి , ముఖం మొత్తం అప్లై చేసుకోవాలి.
నిదానంగా మీ చర్మానికి 10 నుండి 15నిముషాలు స్ర్కబ్ చేయాలి.
స్క్రబ్ చేసిన 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.
ఈ హోం మేడ్ స్ర్కబ్ ను వారంలో రెండు మూడు సార్లు అప్లై చేస్తుంటే ముఖంలో మలినాలను, మ్రుతకణాలను తొలగించి, కొత్త చర్మ కణాలు ఏర్పడే విధంగా చేస్తుంది.

ఈ హోం మేడ్ స్ర్కబ్ వల్ల క్లియర్ అండ్ బ్యూటీఫుల్ స్కిన్ పొందవచ్చు,

సూచన: ఈ హోం మేడ్ స్ర్కబ్ ను ఉపయోగించడానికి ముందు ప్యాచ్ టెస్ట్ వేసి, ఎటువంటి స్కిన్ అలర్జీ లేకపోతే నేరుగా అప్లై చేసుకోవచ్చు.

English summary

Have You Heard Of This Amazing Homemade Scrub For Oily Skin?

Oily skin is more prone to skin conditions like breakouts, acne, pimples, etc. And managing oily skin is no easy task. That is why, people with oily skin should follow a strict beauty regime to keep these skin conditions at bay.
Story first published: Wednesday, June 29, 2016, 6:47 [IST]
Desktop Bottom Promotion