పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం. అని మనందరికీ తెలిసినా కూడా నికోటిన్ ఆరోగ్యానికి చెడు కలిగిస్తుందని తెలిసినాకూడా చాలా మంది పొగ త్రాగడాన్ని మాత్రం మానలేకపోతున్నారు. ప్రమాదకరమైన వ్యాధులకు ప్రధాన కారణం పొగాకువాడకం... అలాంటి పొగత్రాగడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాలుగా హానికరమే.. పొగాకు పొగనుంచి శరీరానికి హాని కలిగించే సుమారు 300 రకాల పదార్థాలు కనుగొనబడ్డాయి. అందులో ముఖ్యమైన రెండు పదార్థాలు నికొటిస్, కార్బన్ మోనాక్సైడ్. సుమారు 20 సిగరెట్లు త్రాగటం వలన 0.09గ్రాముల నికోటిన్, 369ఘన సెంటీ లీటర్ల కార్బన్ మోన్సాక్సైడ్ శరీరంలోనికి ప్రవేశిస్తాయి.
ఈ రెండు పదార్థాల లక్షణాలు ఏమంటే అవి-గుండె రక్త ప్రసరణ వ్యవస్థపై ఎక్కువగా పనిచేస్తాయి. నికోటిన్ వలన రక్తనాళాలు కుదించుకు పోయి, రక్తపోటు హెచ్చుతుంది. నికోటిన్ శరీర నాడీ మండల వ్యవస్థను ఉద్రిక్తపరచడం వలన శరీరంలోని రస గ్రంథుల నుండి ప్రవించే రసాలు ఎక్కువవుతాయి. వీటివలన శరీర వ్యవస్థతో చురుకుగా పనిచేసే పదార్థాలు రక్తంలోకి అధికంగా ప్రవేశించి గుండెమీద, రక్తనాళాల మీద చెడు ప్రభావం కలిగిస్తాయి. వీటి వలన శరీరంలోని ముఖ్యభాగాలైన గుండె, మెదడు, మూత్రపిండాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. పొగత్రాగేవారికి గుండె నొప్పులు ఎక్కువగా వచ్చుట సహజం. నెలకు 38 ప్యాకెట్లు సిగరెట్లు త్రాగేవారిలో గుండె రక్తనాళం ఒకటి దెబ్బ తింటుంది.
పొగతాగడాన్ని మానేస్తాను అని అనుకోవడం తొలిమెట్టు. ధూమ పానం వల్ల కలిగే అనర్థాలను అర్థం చేసుకోసుకోవడం ముఖ్యం.గతంలో సిగరెట్ తాగడం మొదలు పెట్టేందుకు ఎన్నో కారణాలుండొచ్చు. ఒత్తిడి తగ్గించుకోవడానికి ధూమపానానికి అలవాటుపడి ఉండొచ్చు. ధూమపానం మానేస్తాను అనే ధృఢంగా అనుకోవాలి. సిగరెట్ తాగే స్నేహితులు ఉంటే కొంతకాలం వారికి దూరంగా ఉండాలి. పొగ మానేందుకు మందులు కూడా ఉన్నాయి. వీటన్నింటితో పాటు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. కొన్ని రకాల ఆరోగ్యకరమైన ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలోని నికోటిన్ బయటకు పంపబడుతుంది.
ఈ గ్రీన్ వెజిటేబుల్స్ లోవిటమిన్ సి మరియు బి5 అధికంగా ఉన్నాయి. పొగతాగడం వల్ల శరీరంలో విటమిన్ సి తగ్గిపోతుంది. అందువల్ల బ్రొకోలి ఆహారంతో తీసుకోవడం వల్ల శరీరంలో చేరే నికోటిన్ ను బయటకు నెట్టివేయబడుతుంది. అంతే కాదు బ్రొకోలి బరువు తగ్గించడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా గర్భినీ స్త్రీలకు ఆరోగ్యకరమైన ఆహారం.
పొగతాగడం వల్ల శరీరంలో విటమిన్ సి, ఇ మరియు ఎ లు తగ్గిపోతాయి. ఈ విటమిన్స్ శరీరానికి కావల్సినంత ఉన్నప్పుడు ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. పోగతాగడం మానేయాలనుకొనే వారు, విటమిన్ సి, ఇ, మరియు ఎ లు అధికంగా ఉంన్న ఆహారాలను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని నికోటిన్ బయటకు నెట్టివేయబడుతుంది. క్యారెట్స్, డార్క్ లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్, లెట్యుస్, డ్రైయిడ్ హెర్బ్స్, బాదం, పైన్ నట్స్, ఆకుకూరలు, ఆలివ్స్, క్యాప్సికమ్, జామ, బ్రొకోలీ వంటి వాటిల్లో సి, ఇ మరియు ఎ విటమిన్లు అధికంగా ఉంటాయి. విటమిన్ బి5యాంటీ స్ట్రెస్ విటమిన్ సప్లై చేస్తుంది. దాంతో ఒత్తిడి నుండి బయటపడవచ్చు. అందుకు కారణమయ్యే హార్మోన్స్ ను కూడా ఇది ఉత్పత్తి చేస్తుంది. ఒత్తిడితో పోరడాగలిగే శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ ఆహారాలను ప్రతి రోజూ మీరు తీసుకొనే ఆహారంలో చేర్చుకొని శరీరంలోని నికోటిన్ బయటకు పంపేయండి.



































