For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బొజ్జతో అనర్థాలు: బొజ్జ తగ్గించే చిట్కాలు

|

బొజ్జ : వయసు మీద పడుతున్న కొద్దీ పొట్ట కూడా పెరగటం సహజమే. పురుషులు పెద్దగా పట్టించుకోకపోవచ్చు గానీ ఇది ఎంతోమంది స్త్రీలకు పెద్ద సమస్యగానే పరిణమిస్తుంది. శరీరాకృతినే మార్చేసి మరింత వయసు ముదిరినట్టు చేస్తుంది మరి. ఇది అందానికే కాదు ఆరోగ్యానికీ చేటు కలిగిస్తుంది. శరీరంలో మిగతా భాగాల్లోని కొవ్వు కన్నా పొట్ట మీద పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైంది తెలుసా?

ఇది గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు రావటానికీ దోహదం చేస్తుంది. అలాగని బాధ పడుతూ కూచోకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవటంతో పాటు కొన్ని రకాల వ్యాయామాలు చేయటంతో దీనిని తగ్గించుకునే ప్రయత్నం చేయటం చాలా అవసరం.

How to Lose Belly Fat Faster..!

వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియలు మందగిస్తుంటాయి. దీంతో శరీరంలో కొవ్వు మోతాదూ నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. పురుషుల్లో కన్నా స్త్రీలల్లోనే ఇది ఎక్కువ. మెనోపాజ్‌ అనంతరం చేతులు, కాళ్లు, తొడల వద్ద కొవ్వు తగ్గిపోతూ పొట్ట దగ్గర పేరుకుపోవటం ప్రారంభిస్తుంది. కడుపుని పట్టుకున్నప్పుడు చర్మం కింద చేతికి తగిలే కొవ్వు కన్నా.. లోపల అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు ఇంకా ప్రమాదకరం. ఇది వంశ పారంపర్యంగానూ రావొచ్చు. ముట్లుడిగిన తర్వాత కలిగే హార్మోన్ల మార్పు కూడా దీనికి దోహదం చేస్తుంది. బరువు పెరగకుండా బొజ్జ పెరుగుతున్నా ప్రమాదకరమే.

అధిక పొట్టతో ఎదురయ్యే అనర్థాలు: బొజ్జ మూలంగా రకరకాల జబ్బులు దాడి చేసే ప్రమాదముంది. అవి: గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్‌, మధుమేహం, జీవక్రియల అస్తవ్యస్తం, పిత్తాశయ సమస్యలు, అధిక రక్తపోటు, పెద్దపేగు క్యాన్సర్‌.

MOST READ: స్తనాల (వక్షోజ) సైజు పెద్దగా పెరగాలంటే ఇవి తినాల్సిందే..!MOST READ: స్తనాల (వక్షోజ) సైజు పెద్దగా పెరగాలంటే ఇవి తినాల్సిందే..!

అల్పా హారము తప్పనిసరి

అల్పా హారము తప్పనిసరి

ప్రతి రోజూ ఉదయము అల్పాహారము తీసుకోవడము తప్పనిసరి . ఉదయము ఎమీ తినకపోవడమంటే ఎవరికి వారు శిక్ష విధించుకోవడమే. ఉదయము నిండి సాయంత్రమువరకూ చేసే పనులన్నింటికీ తగిన శక్తినిచ్చేది . . . ఆ అల్పాహారమే . అల్పాహారమువలన శరీరము బరువు , ఆకృతి అదుపులో ఉంటాయి .

ఉప్పు తగ్గించాలి

ఉప్పు తగ్గించాలి

ఎవరైతే తక్కువ ఉప్పు తింటారొ వారు లవెక్కరు . ఉప్పుకు శరీరములో నీటిని , కొవ్వును నిలవా చేసే గుణము ఉన్నది . ఫలితము వా బరువు పెరుగుతారు .చలాకీతనము తగ్గుతుంది. అందుకే రోజుకు 6 గ్రాములకు మించి ఉప్పు వాడకుండా ఉంటే పొట్ట తగ్గుతుంది.

మూడు పూట్లా తినండి

మూడు పూట్లా తినండి

బరువు తగ్గాలి అనగానే ఆహారము తీసుకోవడము మానేస్తారు. ఇటు వంటి డైటింగ్ ప్రమాదకరము . లావు తగ్గాలన్నా , పొట్ట కరగాలన్నా మూడు పూటలా ఆహారము తీసుకోవాలి . ఆ తినే ఆహారము విషయము లో జాగ్రత్తపడాలి . శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు సమపాళ్ళలో లభించేలా ఆహారము తీసుకోవాలి. పరిమితమైన ఆహారము తీసుకోవాలి.

నడక అవసరము

నడక అవసరము

నదక సహజ వ్యాయామము . ఇతర వ్యాయామాలు చేసేవారు కూడా నడాల్సిందే . 1.5 కిలోమీటర్లు పావుగంట కాలము లో వేగము గా నడిచేవిధముగా సాధనచేయాలి . రోజుకు సుమారు 3 కి.మీ నడిస్తే మంచిది.

ఎత్తుపల్లాల్లో పరుగు

ఎత్తుపల్లాల్లో పరుగు

కాళ్ళకు బలాన్నిస్తుంది పరుగు . కొవ్వును బాగా కరిగిస్తుంది. ఎత్తు పల్లాలో కొండలమీదికి నడక , పరుగు , ఎక్కి దిగ గలిగితే పాదము నేలమీద తాకే సమయము బాగా తగ్గుతుంది. ఫ్యాట్ కరిగేందుకు దోహదపడుతుంది . గుండెజబ్బులున్నవారు కొండలెక్కడము మంచిది కాదు .

MOST READ:శరీరం మీద పుట్టుమచ్చలు: వాటి రహస్యాలుMOST READ:శరీరం మీద పుట్టుమచ్చలు: వాటి రహస్యాలు

వేపుళ్ళు వద్దు

వేపుళ్ళు వద్దు

రుచికి బాగుంటాయని ఎక్కువమంది వేపుడు కూరలు తింటారు .. కాని ఆరోగ్యరీత్యా వేపుడు కూరలు మంచివి కావు . ఉడికించిన కూరలు తింటేనే శరీరరూపము మెరుగ్గా ఉంటుంది. కాబట్టి కూర లన్నింటినీ సగం మేర ఉడికించి తర్వాత కొంద్దిగా వేయించి తినడం ద్వారా రుచి, ఆరోగ్యము రెండూ లభిస్తాయి.

సాయంకాల సమయ ఆహారము

సాయంకాల సమయ ఆహారము

సాయంకాలము లో ఏదో ఒకటి తినాలి . ఆకలితో ఉండకూడదు . ఎండిన పళ్ళు, కొవ్వులేని ఆహారపదార్ధములు, తాజా పండ్లు తినాలి. నూనెలో ముంచి తేలిన చిప్స్ , నూడిల్స్ , కురుకురేల వంటివి అస్సలు తినకూడదు .

నీరు బాగా త్రాగాలి

నీరు బాగా త్రాగాలి

నీరు మన దాహానికి తగ్గట్టుగా తాగుతూ ఉండాలి . నీరు తాగడము వలన ఆహారము తీసుకోవడము తగ్గుతుంది. జీవ పక్రియ మెరుగవుతుంది. నీరు శరీరానికి అవసము . తగినంత ఉంటే ఆలోచనలు స్పస్టముగా ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడము లో అటు ఇటు అవ్వదు .

శ్వాసతీరు మార్చుకోవడము

శ్వాసతీరు మార్చుకోవడము

సైనికులకు శ్వాస వ్యాయామము ప్రత్యేకము గా చేయిస్తారు. శ్వాసక్రియను చాతీకి పరిమితం చేయక కిందనున్న పొట్టను పైకిలాగుతూ శ్వాసను పీల్చి వదలడము చెయ్యాలి. ఇది పరుగెడుతున్నప్పుడు చేయాలి . ఉదరబాగముతో కలిపిన శ్వాసక్రియవల్ల శరీర రూపములో మార్పువస్తుంది . పొట్ట లోపలికి పోతుంది.

బరువుతో పరుగు

బరువుతో పరుగు

పరుగు చక్కని వ్యాయామము . అయితే పొట్ట బాగ తగ్గాలంటే వీపుకు ఏధనా బరువును కట్టుకొని పరుగెట్టడము మంచిది. సైనికులు తమ అవసరాలకు సంబంధించిన సామానులతో కూడిన సంచి వీపుకు తగిలించుకొని పరిగెడు తుంటారు దీనివలన కొవ్వు కరిగిపోతుంది. కొత్తగాకొవ్వు చేరనివ్వదు .

MOST READ:శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేదని తెలిపే సంకేతాలు....MOST READ:శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేదని తెలిపే సంకేతాలు....

పరుగు తీరు

పరుగు తీరు

మేము ప్రతిరోజూ పరిగెడుతున్నాము . . . కాని శరీరములో మార్పు కనిపించడము లేదంటారు. పరిగెత్తేటపుడు త్లల ఎత్తి ఉంచాలి . ముందుకు చూస్తూఉండాలి . వీపును వెనక్కి నెట్టినట్లుగా , మోచేతులు శరీరానికి పక్కగా ఉంచి పరుగెత్తాలి .దీనివల్న పరుగు వేగము అందుకుంటుంది ... కొవ్వు కరిగే అవకాశాలు ఎచ్చువ అవుతాయి.

తగినంత నిద్ర

తగినంత నిద్ర

నిద్ర వలన రెండురకాల లాభాలున్నాయి. ఒకటి కండరాలు అలసటనుండి తేరుకుంటాయి. నిద్రలో ఎక్కువ కాలరీలు కరుగుతాయి. నిద్ర తగినంత పోకపోతే బలహీన పడతారు. కొవ్వు అదనము పేరుకుపోయి ఇబ్బంది కలిగిస్తుంది.

వ్యాయామములో మార్పు

వ్యాయామములో మార్పు

ఒకే తరహా కసరత్తు నెలల తరబటి చేయకుండా రకరకాల పద్దతులలో వ్యాయామము మార్చి చేస్తూ ఉండాలి .దీనివలన కొత్త ఉత్సాయము , కొత్త లాబాలు శరీరానికి చేర్చిన వారవుతారు.

రిలాక్ష్ అవ్వాలి

రిలాక్ష్ అవ్వాలి

నిరంతము టెన్సన్‌ మంచిది కాదు . ఒత్తిడిలో ఉన్నవారు ఆహారము అధికము గా తీసుకుంటారు. వారి హార్మోనులు సమతుల్యము తప్పుతాయి. సరియైన సమయానికి అవసరమైన పని చేస్తూ మిగతా సమయాల్లో విశ్రాంతి తీసుకోవాలి. గాబరా గాబర గా ఏదో ఒకటి తింటూ ఎల్లప్పుడు పని ఒత్తిడిలో ఉండకూడదు . వీరు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ నే తీసుకోవడము జరుగుతూ ఉంటుంది. . . ఇవి కొవ్వును అధికం చేస్తాయి.

English summary

How to Lose Belly Fat Faster..!

Having belly fat is a testament to the unhealthy lifestyle choices made by you. You will not be able to look attractive in most of your clothes, due to your prominent paunch of muffin top. Having lower belly fat means you are eating too much junk food and not exercising enough.
Desktop Bottom Promotion