Latest Updates
-
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.!
రోజా/గులాబీ మొక్కలను ఎలా నాటాలి? జాగ్రత్తలు ఏంటి

కొన్నిరకాల కొన్ని రకాల మొక్కలను మీ ఇంట్లో పెంచుకున్నట్లయితే.. ఇక ముందు మీరు మరింత మానసికోల్లాసంతో జీవిస్తారు.
రోజా, పసుపు, అరలీ, వాడామల్లి, అలమందా పువ్వు అనే రకరకాల చెట్లను పెంచడం ద్వారా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ప్రపంచాన్ని పరిమళభరితం, ఆనందమయం చేసే అంశాల్లో పూలది తిరుగులేని స్థానం. అందులో గులాబీ చోటు మరింత పదిలం. అందుకే దానిని పువ్వులలో రాణిగా అభివర్ణిస్తాం. గులాబీ మొక్క పెంచడమంటే పసికందును సాకినంత మెలకువగా ఉండాలి. అలా మనచేతుల్లో పెరిగిన మొక్క, విరబూసిన ఆ అందాన్ని తనివితీరా చూసుకుని మురిసిపోతాం.
పెరట్లో మొక్కలు వేయడానికి సరైన ప్రదేశాన్ని చూసుకోవాలి, కుండీల్లోనైనా పెంచుకోవచ్చు. గులాబీ మొక్క నాటేందుకు ఒకటిన్నర అడుగు లోతు, వెడల్పు ఉన్న గొయ్యి తవ్వాలి. ఇలా తీసిన గొయ్యి ఒక నెలపాటు వదిలేస్తే తరువాత మొక్కకు పురుగు పట్టకుండా ఉంటాయి. తరువాత గొయ్యిని మట్టితోనింపాలి. అందుకోసం
ఎర్రమట్టి, మాన్యూర్ (ఎరువు), ఇసుక తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గొయ్యిలో వేసి గులాబీలో ఏ రకం కావాలంటే వాటిని తీసుకొని నాటుకోవాలి.
ముఖ్యంగా గులాబీ మొక్కలు పెంచుకోవాలంటే తగు జాగ్రత్తలు తప్పని సరి: ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలంలో గులాబీ మొక్కకు ఆయా రుతువుల్ని బట్టి జాగ్రత్తలు తీసు కోవాలి. ఎండాకాలంలో గులాబీమొక్కలు ఎండలో ఉండకూడదు. నీడపట్టున ఉండాలి. అందుకు పైన షెడ్ వెయ్యాలి. ఇంట్లో అయితే మొక్కల కుండీలు నీడలో ఉంచాలి.
వర్షాకాలంలో మొక్క తడవచ్చు కానీ మొదళ్లలో నీరు నిలువ కాకుండా చూసుకోవాలి. అందుకోసం మొదళ్లలో మట్టి పోగులా చేసి ఉంచితే నీరు జారి పోతుంది. శీతాకాలంలో ఎలా ఉన్నా పరవాలేదు. మరి నీరుపోసే విషయంలో వేసవికాలంలో ప్రతిరోజూ తగినంత నీరు పోయాలి. వర్షాలు పడితే నీరు పోయనక్కర్లేదు. శీతాకాలంలో రెండురోజులకోసారి నీరుపోయాలి. గులాబీల సీజన్ నవంబర్ నెల నుంచి జనవరి వరకూ. మొక్కని ఆగస్టులో నాటితే సీజన్‌కి అందుకుంటుంది. 15 రోజులకొకసారి పురుగుల మందులు స్ప్రే చేయాలి. మొక్కనాటిన తరువాత 40 నుంచి 45 రోజుల్లో గులాబీమొగ్గ తొడుగుతుంది.



Click it and Unblock the Notifications