Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
ఇంటి ఆవరణంలో ఆహ్లాదానిచ్చే కృత్రిమ జలపాతం..

1. అతిథులకు చల్లగా స్వాగతం పలికేందుకు గెస్ట్ రూంలలో దృశ్య ప్రధాన కృత్రిమ జలపాతాలను పెడితే చాలా బాగుంటాయి. గదిలో ప్రశాంత వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉండే కృత్రిమ జలపాతాలు అతిథులను చక్కగా ఆకట్టుకుంటాయి.
2. కొంతమంది ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కృత్రిమ జలపాతాలను ఏర్పాటు చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఇంటికి వచ్చే అతిథులకు స్వాగతం పలికేలా వీటిని ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇలాంటివి ఎక్కువగా నేడు విగ్రహాల రూపంలోనే మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే ఇవి ఎక్కువగా దృశ్యప్రధానంగా ఉంటేనే చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి.
3. లివింగ్ రూం పరిమాణాన్ని బట్టి కొంతమంది కృత్రిమ జలపాతాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇలాంటి వాటికి పువ్వులు, మొక్కలు ఉన్నవైతే బాగుంటాయి. పడక గదిలో అయితే ఉత్సాహం, మానసిక ప్రశాంతతను కలిగించేలా సూర్యోదయం, చంద్రోదయం లాంటి దృశ్యప్రధాన కృత్రిమ జలపాతాలు బాగా నప్పుతాయి.
4. విశాలమైన బాల్కనీ ఉండేవారికి కృత్రిమ ఫైబర్ జలపాతం బాగా నప్పుతుంది. అలాగే బాల్కనీ చిన్నదిగా ఉండేవారికి వాల్ ఫౌంటెయిన్ సరిపోతుంది. ఇవి ఏ గదులకైనా అనువుగానే ఉంటాయి. బాల్కనీల సైజును బట్టి కనీసం నాలుగు అడుగుల ఫౌంటెయిన్ ను అమర్చుకోవచ్చు.
5. ఇక పిల్లలు చదువుకునే గదిలో టేబుల్ టాప్ లైటింగ్, షేకింగ్ లైటింగ్ టేబుల్ టాప్ రకాలలో లభ్యమయ్యే కృత్రిమ జలపాతాలు సరిపోతాయి. వీటిలో ప్రకృతిని ప్రతిబింబించేలా ఉండేవి కూడా లభిస్తాయి. చదువుమీద ధ్యాస పెట్టేందుకు, పిల్లల మనస్సు నిర్మలంగా ఉండేందుకు ఇవి బాగా సహకరిస్తాయి.



Click it and Unblock the Notifications