Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
హోమ్ గార్డెన్ కి ప్రాథమిక అంశాలు...

1. మొదటగా మొక్కులు పెంచుకోవడానికి సరిపడే స్థలం, సంవత్సరంలో ఏ కాలంలో నైన మొక్కలను గాలి, వెలుతురు, సూర్యరశ్మి ప్రసరించే స్థలంను ఎన్నుకోవాలి.
2. విత్తనాలు లేదా మొక్కల నారు సిద్దం చేసుకోవాలి. నర్సరీ నుండి విత్తనాలు కొనడం కంటే మనమే విత్తనాలు చల్లి నారు పెంచుకుంటే ఖర్చు తగ్గుతుంది. ఒక వేళ విత్తనాలు చల్లాల్సిన సీజన్ లో సాధ్యం కాకపోయినా, చల్లిన విత్తనాలు సరిగా మొలకెత్తకపోయినా అప్పుడు డైరెక్ట్ గా నర్సరీ నుండి మొక్కలను తెచ్చుకోవాలి.
3. విత్తనాలు వేసేముందుకానీ, మొక్కను నాటే ముందుకానీ ఆ చెట్టు స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు స్థలం కేటాయించాలి. వేర్లు భూమిలోకి చొచ్చుకుపోవడానికి వీలుగా రాళ్లను తొలగించి, మట్టిని గుల్లబరిచి నేలను చదరున చేయాలి. పై పొరలో ఆకులు, గడ్డి నింపాలి. ఇలా చేయండం వల్ల నీరు ఎక్కువ, తక్కువల ప్రభావం మొక్కల మీద పడకుండా నియంత్రిస్తుంది. అంతే కాకుండా ఈ పొర భూమిలో తేమను పీల్చుకుంటుంది. అలాగే నేల త్వరగా ఎండిపోకుండా కాపాడుతుంది.
4. విత్తానాలు చల్లిన ప్రదేశాన్ని నీటితో నింపకూడదు. ఆ ప్రదేశంలో ప్రతిరోజు తగుమాత్రం నీటిని చిలకరించి వదలాలి. అలాగే ఎండుటాకులు, మొక్కలకు హాని కలిగించే పురుగులను ఎప్పటికప్పుడు తొలగించాలి.
5. క్యారట్, బీట్ రూట్ వంటి దుంపకూరలను లోతుగా ఉండే కుంపట్లు, లేదా బాక్స్ టైప్ వాటిలో నాటుకోవాలి. పాలకూర, కొత్తిమీర వంటి ఆకు కూరలకు విత్తనాలను టబ్ లనో చల్లాలి.
6. టమోటో, బఠాణీ, కీరదోసం వంటి వాటికి నిలువుగా ఉన్న కంటైనర్ లను వాడాలి. తీగజాతి చెట్లకు కాయలు కిందకు వేళ్లాడుతాయి కాబట్టి అవి నేలకు ఏమాత్రం తగలకుండా ఉండేట్టు ఏర్పాటు చేసుకోవాలి.
7. అరుదైన పూల మొక్కలు పెంచితే మీ ప్రత్యేకత పెరుగుతుంది. గార్డెన్ చక్కగా మెయింటైన్ చేసే ఇల్లు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది. తాజా పూల పరిమళాలను ఆశ్వాదించటంతో పాటు తాజా కాయగూరలతో రుచికరమైన భోజనం చేయవచ్చు.ఔషధ ప్లాంట్లు మాత్రమే పెంచితే హాబీ, ఆరోగ్యం, అమ్మితే లాభం కూడా. కాస్త ఎక్కువ స్థలం ఉంటే ఇది సాధ్యం. రోజంతా ఒత్తిడుదలకు లోనయినా అరగంట సమయం మొక్కల మధ్య తిరిగితే టెన్షన్ నుంచి బయటపడవచ్చు.



Click it and Unblock the Notifications