Latest Updates
-
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త!
వేసవిలో ఇండోర్ మొక్కలను పెంపకమే తేలిక...!

వేసవి మొదలవుతుందంటే మొక్కలను ట్రింమ్ చేయడం, ఎండిన ఆకులను, కొమ్మలను తొలగించడం వంటివి తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అందుకు మార్చి, ఏప్రిల్ నెలలు అనుకూలమైనవి. సాధారణంగా మొక్కలకు నీళ్లు ఎంత అవసరం అన్న సంగతి కుండీలోని మట్టిని తాకగానే తెలిసిపోతుంది. ఒకసారి తాకగానే ఎండినట్లు కనిపిస్తే వెంటనే నీటిని పోయాలని అర్థం చేసుకోవాలి. కనీసం నెలకోసారి ఏదేని ఎరువుల రసాయనాన్ని నీటిలో కలిపి మొక్కలకు పోస్తే ఆరోగ్యంగా కనిపిస్తాయి. అయితే ఎరువుల మోతాదు ఏమాత్రం పెరిగినా మొక్కలు చనిపోయే అవకాశం ఉంది.
అలాగే మొక్కలు పెరిగే కొద్ది వాటి వేర్లు విస్తరిస్తుంటాయి. కాబట్టి మొక్కల సైజును బట్టి చిన్న కుండీల నుండి పెద్ద కుండీలలోని మార్పు చేయుటకు అనువైన కాలం. ముఖ్యంగా ఇండోర్ మొక్కలను డైరెక్ట్ సన్ లైట్(సూర్య రశ్మి)పడకుండా చూసుకోవాలి. వేసవిలో రూం టెపరేచరే ఈ మొక్కలకు సరిపోతుంది. మిగతా కాలాల్లో అయితే అప్పుడప్పుడు కొద్ది సమయం బయట తీసుకెళ్ళి పెట్టి తిరిగి లోపల పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే వేసవిలో ఆ ఇబ్బంది ఉండదు.కుండీలో ఏర్పాటుచేసే మొక్కలకు చెదలు పట్టవు. పురుగుల బెడదా ఉండదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా రెండు వేప నూనెను నీటిలో కలిపి పిచికారి చేస్తే మంచిది. ఇలా చేయటంవల్ల మట్టి ద్వారా సంక్రమించే తెగుళ్లు, పురుగుల్ని అరికట్టొచ్చు. మొక్కలను ఎప్పుడూ ఒకేచోట, ఒకే కోణంలో ఉంచకూడదు. ఒకటి లేదా రెండు వారాలకు ఒకసారి వాటిని మారుస్తూ ఉండాలి.



Click it and Unblock the Notifications