For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యంతో పాటు, రుచి, సుగంధ పరిమళమించే మీ గార్డెన్ మొక్కలు.!

|

ఇండియన్ కుషన్స్ లో సుగంధ ద్రవ్యాలు (మసాలా దినుసులు ) అధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇవి లేకుండా చేసే వంటలు చాలా సింపుల్ గా ఉంటాయి. వీటిని ఆహారాల్లో చేర్చడం అటుంచితే. వీటిలో అత్యద్భుతమైన ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంది ఇటువంటి మసాలా దినుసులను తమ తమ గార్డెన్లో పెంచుకోవాలని అనుకుంటారు. కానీ అన్ని మసాలా దినుసులను మన హోం గార్డెన్ లో పెంచుకోవడానికి సాధ్యం కాదు. అందుకు వివిధ కారణాలున్నాయి. పరిసర ప్రాంతాలు మరియు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. హోం గార్డెన్ లో స్పైసీలు(మసాలాదినుసుల మొక్కలు లేదా దుంపలను)పెంచుకోవాలనుకుంటే.. మీకు నచ్చిన కొన్ని స్పైసీల ఎంపిక చేసే మీ హోం గార్డెన్ లో పెంచుకోండి. అయితే వాతావరణ పరిస్థితులను మాత్రం మరవకండి. ఎటువంటి మొక్కలకైనా వాతావరణం ముఖ్యం.

మన ఇంటి గార్డెన్ లో సులభంగా పెంచుకొనే అనేక స్పైసీ మొక్కల్లో రెండు రకాల ప్రయోజనాలున్నాయి. ఔషధగుణాలతో పాటు కులినరీ బెనిఫిట్స్ పుష్కలంగా ఉన్నాయి. అంటువంటి స్పైసీ మొక్కలు మీ హోంగార్డెన్ లో సులభంగా పెంచుకొనే మొక్కలు మీకోసం కొన్ని..

మీ ఇంటి గార్డెన్ లో పెరిగే భారతీయ సుగంధ మొక్కలు.!

తులసి: వెచ్చని వాతావరణంలో సంవత్సరం పొడవునా ఈ తులసి మొక్కను మన ఇంటి ఆవరణంలో లేదా గార్డెన్ లో పెంచుకోవచ్చు. ఇది వేడి వాతావరణంలో, ఎండ వేడిలో పెరుగుతుంది నీళ్ళు మరియు మొక్క పెరగడానికి అనుకూలమైన ప్రదేశం వేళ్ళు పాకడానికి వీలుగా .. విశాలంగా ఉండే ప్రదేశం ఉండాలి. అందుకు కొంచెం పెద్దగా ఉండే కుంపటి(పాట్)ను ఎంపిక చేసుకోవడం మంచిది.

మీ ఇంటి గార్డెన్ లో పెరిగే భారతీయ సుగంధ మొక్కలు.!

పచ్చిమిర్చి: పచ్చిమిర్చి మొక్కలు చిన్నగా మరియు మీడియం సైజ్ మొక్కలుగా పెరుగుతాయి. అర మీటర్ నుండి రెండు మీటర్ల పొడవుంటాయి. పచ్చిమిర్చి విత్తనాలు మొలకెత్తడానికి20డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. మొక్క పెరిగి కాయ కాయడానికి లేదా పండుకావడానికి 30సెంటీగ్రేడ్ ల ఉష్ణోగ్రత అవసరం. ఇక ఈ మొక్కలకు రాత్రి ఉష్ణోగ్రత 15డిగ్రీ సెంటీగ్రేడ్ కు తగ్గకుండా చూసుకోవాలి.

మీ ఇంటి గార్డెన్ లో పెరిగే భారతీయ సుగంధ మొక్కలు.!

అల్లం : ఇది మొక్క కాదు. కానీ భూమిలోపల పెరుగుతుంది. దీనికి సన్నని సూర్యరశ్మి మరియు వెచ్చని వాతావరణం మరియు మంచి మంటి ఉంటే చాలు అద్భుతంగా పెరుగుతుంది. అల్లం పెంచుకోవడానికి వింటర్/వింటర్ వదిలి వసంత కాలంలోనికి ప్రవేశించినా సరే అల్లం బాగా పెరుగుతుంది.

మీ ఇంటి గార్డెన్ లో పెరిగే భారతీయ సుగంధ మొక్కలు.!

రోస్మెరీ: రోస్మెరీ పెరినైల్, ఇది రెండు నుండి మూడేళ్ళ పాటు పెరుగుతుంది. దీనికి మంచి డ్రైనేజ్ ఉండాలి. అలాగే ఎయిర్ సర్క్యులేషన్ మరియు ఎక్కువగా సన్ లైట్ ఉండాలి. చిన్నమొక్క తీసుకొని మట్టి కుండీలో పూడ్చాలి. కుండీలో మట్టి మరియు కాక్టస్ సాండ్ వేసి అందులో అర్ధ మొక్క వరాకూ మంట్టిలోనికి పూడ్చాలి. దీనికి ఎక్కవ నీరు పట్టాల్సిన అవసరం లేదు. మట్టి ఎప్పుడైతే ఎండినట్టు అనిపిస్తుందో అప్పుడు నీరు పడితే సరిపోతుంది.

మీ ఇంటి గార్డెన్ లో పెరిగే భారతీయ సుగంధ మొక్కలు.!

థైమ్: ఈ మొక్కకు ఎక్కువ నీరు పట్టాలనే ఆందోళన పడాల్సిన పనిలేదు. ఇది పొడి వాతావరణంలో కూడా బాగా పెరుగుతుంది. మరియు దీనికి ఎక్కువ న్యూట్రీషియన్స్ అవసరం లేదు. ఈ మొక్క వివిధ రంగుల్లో పెరగుతుంటే..అది ఇంకా పెరుగుతుందని గుర్తించాలి. కాబట్టి ఈ మొక్కలు అధికంగా సన్ లైట్ ఉండే ప్రదేశంలో ఉంచాలి.

మీ ఇంటి గార్డెన్ లో పెరిగే భారతీయ సుగంధ మొక్కలు.!

కరివేపాకు: ఈ మొక్కను చాలా ఇల్లలో ఎక్కువగా పెంచుకుంటారు. ఇది 26-37డిగ్రీ సెంటీగ్రేడ్ లో బాగా పెరుగుతుంది. ఇది ట్రోపికల్ క్లైమెట్ లో బాగా పెరుగుతుంది.

మీ ఇంటి గార్డెన్ లో పెరిగే భారతీయ సుగంధ మొక్కలు.!

కొత్తిమీర: ధనియాలకు ఎక్కువ జాగ్రత్తతీసుకోవల్సిన పనిలేదు. దీనికి నీరు ఒక్కటుంటే చాలు. బాగా పెరుగుతుంది. పువ్వులు రావడం గమనిస్తే చాలు. ఈ మొక్క 4-6వారాలు పెరగడానికి సమయం పడుతుంది. అదే చల్లని వాతావరణంలో అయితే ఎక్కువ నెలలు పడుతుంది. దీనికి అప్పుడప్పడూ నీరు పడుతుంటే చాలు.

మీ ఇంటి గార్డెన్ లో పెరిగే భారతీయ సుగంధ మొక్కలు.!

సోంపు: సోంపును వంటల్లో సువాసనకు మాత్రమే కాదు, తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. దీనికి బాగా ఎండిన ప్రదేశం కావాలి. దాంతో పాటు, అధిక సూర్య రశ్మి కూడా అవసరం.

మీ ఇంటి గార్డెన్ లో పెరిగే భారతీయ సుగంధ మొక్కలు.!

పుదీనా: పుదీనా వేర్లు మంటి కుంపట్లో లేదా భూమిలో పాతి పెడితే చాలు. వేర్లు బాగా అల్లుకుంటాయి. తగినంత సూర్యరశ్మిలో ప్రతి రోజూ ఒక్కసారి నీళ్ళు చిలకరిస్తే చాలు బాగా పెరుగుతంది. ఇది వంటల సువాసనకు మరియు రుచికి మాత్రమే కాదు, ఔషధగుణాలు కూడా పుష్కలమే.

మీ ఇంటి గార్డెన్ లో పెరిగే భారతీయ సుగంధ మొక్కలు.!

మెంతులు: మెంతులు తడి పొడిగా ఉన్న వాతావరణంలో బాగా పెరగుతుంది. పొడిగాఉన్న నేలమీద మెంతులు చల్లి, ప్రతి రోజూ నీరు పడితే నెలరోజుల్లో మెంతి మొక్కలు బాగా మొలుస్తాయి. వీటిని వంట రుచికి మాత్రమే వాడరు. మెంతి ఆకుల్లో అనేక ఔషధ గుణాలున్నాయి.

English summary

Indian Spices To Grow In Garden | మీ ఇంటి గార్డెన్ లో పెరిగే భారతీయ సుగంధ మొక్కలు.!

Spices are the soul of Indian cuisines and without them the food is simply bland. Apart from adding flavours to your food, the medicinal properties they hold are of immense value. Many of us dream to have a garden that incloses spices as a part of it, but not many have a space for the same.
Story first published: Monday, March 25, 2013, 16:02 [IST]
Desktop Bottom Promotion