Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
పెరటి పెంపకంలో కుందేళ్ళు...

కుందేళ్ళు నేలను రంధ్రాలు చేయుటను అరికట్టడానికి గాను నేలను కాంక్రీటుతో గచ్చువేయించాలి. వ్యర్థపదార్థాలయిన ధాన్యపు ఊక, ఎండుగడ్డితో నేలపై నాలుగు నుండి ఆరు అంగుళాల మందంగా నింపాలి. అలాకాకుండా బోను విధానం కుందేళ్ళను పంచడానికి అవసరమైన నేల ఉంటే సరిపోతుంది బోనులో పెట్టాలనుకుంటే బోను సైజు మగ కుందేలుకు 5చదరపు అడగులు, ఆడకుందేలు: 5చదరపు కుందేలు, పిల్లకుందేళ్ళు 1.5చదరపు అడుగులు కలిగి ఉండేలా చేసుకోవాలి. పెరడులో కుందేళ్ళ పెంపకం కొరకు నిర్మించే బోనులు నేల నుండి 3 నుండి 4 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేయాలి. ఈ బోనుల అడుగుభాగము నీళ్ళు కారని పదార్థంతో తయారుచేయాలి.
కుందేళ్ళకు పెట్టే ఆహారపు మరియు నీళ్ళ తొట్టెలుః కుందేళ్ళ ఆహారపు మరియు నీళ్ళ తొట్టెలు సాధారణంగా జింకు పూతఉన్న ఇనుముతో తయారు చేయబడి ఉంటాయి. కుందేళ్ళ మేత: కుందేళ్ళు అన్ని రకాల తృణధాన్యాలను ఇష్టపడతాయి మరియు చిక్కుళ్ళు, పచ్చిరొట్టలో రకాలైన డెస్మంతస్, పశువులకు వేసే పచ్చిగడ్డి, అగాతి మరియు వంటలో వ్యర్థపదార్థలైన కారెట్, క్యాబేజీ ఆకులు మరియు ఇతర కాయగూరల వ్యర్థాలను కూడా కుందేళ్ళు ఇష్టపడతాయి. కుందేళ్ళ పళ్ళు నిరంతరంగా పెరుగుతూ ఉంటాయి.
అందుచే చిక్కని ఆహారంతో మాత్రమే కుందేళ్ళ పెంపకం అసాధ్యం. కుందేళ్ళకు మేత, సమయం ప్రకారం పెట్టాలి. కుందేళ్ళకు ఆహారం ఇవ్వడం ఆలస్యమైతే అవి నీరసించి బరువు తగ్గిపోతాయి.ఎక్కువ ఉష్ణోగ్రత వలన కుందేళ్ళు పగటిపూట ఆహారం తీసుకోవు. కాని అవి రాత్రిపూట చురుకుగా ఉంటాయి. అందుచే రాత్రి పూట కుందేళ్ళకు పచ్చిరొట్ట ఆహారంగా పెడితే వ్యర్ధం చేయకుండా తింటాయి. అందువలన ఉదయం పూట చిక్కని ఆహారం ఇవ్వాలి.



Click it and Unblock the Notifications