For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియాలో ఫేమస్ ప్రాంతాలే కానీ.. లేడీస్ కి నో ఎంట్రీ.. ఎందుకు ?

By Swathi
|

అనేక పద్ధతులు, కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాలకు పెట్టింది పేరు ఇండియా. అలాగే దేవుడిని పూజించే భక్తులు, పూజలకు కూడా ఇండియా పాపులర్. అలాగే దేవతలను పూజించే ఇండియాలోనే ఎక్కువగా అమ్మాయిలను వేధించే దేశం కూడా. ఇండియాలో ఎక్కువ డొమెస్టిక్ వయోలెన్స్ కేసులు నమోదవుతాయి. ఇండియాలో అమ్మాయిగా పుడితే.. అనేక నిబంధనలు ఉంటాయి. అంతేకాదు.. అనేక ప్రాంతాల్లో అడుగుపెట్టడానికి కూడా అవకాశం లేదు.

మీకు నచ్చే డ్రీమ్ గర్ల్ ఏ రాశిలో ఉందో తెలుసుకోవాలనుందా ?

మీ మహిళా ? అయితే మీరు కొన్ని ప్రాంతాల్లోకి వెళ్లడానికి వీలులేదు ? అదేంటి అనుకుంటున్నారా ? నిజమే ఇండియాలో మహిళలను కొన్ని ప్రాంతాల్లో రావడానికి వీలు లేకుండా బ్యాన్ చేశారు. కొన్ని ఆలయాలు, మసీదులకే కాకుండా.. కొన్ని యూనివర్సిటీల్లోకి కూడా, అందులోనూ లైబ్రరీలకు కూడా వెళ్లడానికి వీలు లేకుండా.. మహిళలను బ్యాన్ చేశాడు. మహిళలూ.. నాట్ అలౌడ్ అని చెప్పే ఇండియాలోనే ప్రసిద్ధ ప్రాంతాలు, ప్రదేశాలేంటో ఇప్పుడు చూద్దాం..

శని శింగాపూర్

శని శింగాపూర్

శనిదేవుడిని పూజించే, శని దేవుడికి చాలా ప్రత్యేకమైన శని శింగాపూర్ లో ఆలయానికి వెళ్లడానికి మహిళలకు అర్హత లేదు. అక్కడి శనిదేవుడి విగ్రహాన్ని తాకడానికి గానీ, విగ్రహం దగ్గరకు వెళ్లడానికి గానీ.. మహిళలకు ప్రవేశం లేదు. తాజాగా ఒక మహిళ విగ్రహం తాకడంతో.. అపచారంగా భావించిన ఆలయ అధికారులు ప్రక్షాళన పూజ నిర్వహించారంటే ఎంత కఠినంగా మహిళలను అనుమతించకుండా నియమం పాటిస్తున్నారో అర్థమవుతోంది కదూ.

నిజాముద్దీన్ దర్గా

నిజాముద్దీన్ దర్గా

ఢిల్లీలో ఉన్న నిజాముద్దీన్ దర్గాలోకి మహిళలకు ప్రవేశం లేదు. 14 వ శతాబ్ధానికి చెందిన పవిత్ర మతగురువు నివసించిన దర్గాలోకి ఇప్పటికీ మహిళలు వెళ్లడానికి వీలులేదట. ఈ నిబంధన గత 700 సంవత్సరాలుగా నడుస్తోంది.

ఏఎమ్ యూ యూనివర్సిటీ లైబ్రరీ

ఏఎమ్ యూ యూనివర్సిటీ లైబ్రరీ

అదేంటీ లైబ్రరీలోకి కూడా మహిళలకు ప్రవేశం లేదా ? అని ఆలోచిస్తున్నారా ? నిజమే ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఏఎమ్ యూ మౌలానా ఆజాద్ లైబ్రరీలోకి మహిళలు నాట్ అలౌడ్. ఇదో వింత నిబంధన. అమ్మాయిలు లైబ్రరీలోకి వెళ్తే.. వాళ్లకు అబ్బాయిలు ఎట్రాక్ట్ అయి.. క్రమశిక్షణ కోల్పోతారని భావించి.. యూనివర్సిటీ వీసీ ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు ఒక అమ్మాయి 4 అబ్బాయిలకు సమానమని వీసీ వివరిస్తారట.

హజీ అలీ దర్గా

హజీ అలీ దర్గా

ముంబైలోని హజీ అలీ దర్గా 15వ శతాబ్దంలో నిర్మించారు. దీన్ని సూఫి పవిత్ర మత గురువు హజీ అలీ బుఖారీకి అంకితం చేశారు. కానీ ఇన్ని రోజులుగా ఈ దర్గాలోకి మహిళలను మాత్రం అనుమతించడం లేదు. సూఫీ సమాధి ఉండటం వల్ల లోపలికి మహిళలను అనుమతించరాదని దర్గా అధికారులు చెబుతున్నారు.

శబరిమల

శబరిమల

10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు కలిగిన మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లడానికి అవకాశం లేదు. రుతుక్రమం ప్రారంభం అయిన మహిళలు ఎవరూ కూడా శబరిమల ఆలయ పరిసరాల్లోకి కూడా వెళ్లడానికి వీలు లేదనే కఠిన నియమం ఉంది.

జామా మసీద్

జామా మసీద్

ఢిల్లీలోని జామా మసీద్ లోకి మహిళలు వెళ్లడానికి వీలులేదు. ఇదో కఠిన నియమం ఉంది.

పద్మనాభ స్వామి ఆలయం

పద్మనాభ స్వామి ఆలయం

పద్మనాభ స్వామి ఆలయంలో మహిళలు దండం పెట్టుకోవచ్చు. కానీ.. ఆలయంలోకి మాత్రం కాలు పెట్టడానికి వీలులేదు. సొరంగంలో ఉండే ఆ దేవుడిని దర్శించుకోవడానికి మాత్రం మహిళలను ఆలయ అధికారులు అనుమతించరు. క్లీన్ చేయడానికి గానీ, దేనికీ కూడా మహిళలకు ప్రవేశమే లేదు.

కార్తీకేయ ఆలయం

కార్తీకేయ ఆలయం

కార్తీకేయుడి ఆలయంలోకి పొరపాటున మహిళలు వెళ్తే.. వాళ్లను ఆశీర్వదించడానికి బదులు, శపిస్తాడని గట్టి నమ్మకం ఉంది. అందుకే మహిళలు కార్తీకేయుడి ఆలయంలోకి ప్రవేశించరు. దీనివెనక ఒక పురాణ కథ ఉంది. కార్తికేయుడు ధ్యానంలో ఉండగా.. ఇంద్రుడు ఒక దేవలోక మహిళను కార్తీకేయుడి దగ్గరకు పంపాడట. దీంతో ఆమెపై ఆగ్రహించాడట కార్తీకేయుడు. అందుకే మహిళలు కార్తీకేయుడి ఆలయంలోకి ప్రవేశించడానికి భయపడతారు.

అస్సాంలోని సాంక్టోరమ్

అస్సాంలోని సాంక్టోరమ్

అస్సాంలోని పట్బౌసీ సత్రంలోకి మహిళలను అనుమతించడం లేదు. ఇది ఇప్పుడు పెట్టిన నిబంధన కాదు. 500 ఏళ్లుగా పాటిస్తున్న సంప్రదాయం.

English summary

These places in India are simply off-limits for women!

These places in India are simply off-limits for women! India is a land of ironies, and among them the most popular one is that that a land which worships Goddess has on record the highest rate of female feticide and domestic violence cases.
Desktop Bottom Promotion