For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తీరని కోరికలే కలలగా వస్తాయా? ఇలాంటి కలలు వస్తే ఏం చేయాలి?

|

మనం బలంగా ఏవైనా కోరుకుంటే అవి కలలుగా వస్తాయని చాలా మంది అనుకుంటారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే సైంటిస్ట్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. కలలు అందరికీ వస్తాయి కానీ చాలా మందికి గుర్తుండవు. కలలకు అర్థాలు ఉండవు. అన్వయాలు మాత్రమే ఉంటాయి. అన్వయం అంటే... అలా జరిగింది కాబట్టి, ఇలా కల వచ్చింది అనుకోవడం. లేదా ఇలా కల వచ్చింది కనుక అలా జరగబోతోందని భావించడం. కల కలే. నిజం నిజమే. రెంటికీ పోలిక లేదు. పొంతన లేదు. అయినప్పటికీ కలలు.. 'తేలిగ్గా తీసి అవతల పడేయవలసిన' కేటగిరీలో ఉండిపోలేదు! కలలపై పరిశోధనలు జరిగాయి. జరుగుతున్నాయి. కలలకు అర్థాలను వెతుకుతున్నారు. అంతరార్థాలను బయటికి లాగుతున్నారు. ఎంత వెతికినా, ఎంత లాగినా... కల అంతు చూడ్డం మనిషికి ఒక కలలానే మిగిలిపోయింది. మరి.. కొన్ని కలలెందుకు నిజం అయ్యాయి? కొన్ని నిజాలెందుకు కలలుగా కనిపించాయి?

కల నిజం అవడం యాదృచ్ఛికం కావచ్చు. నిజం కల అవడం... కలవరింత కావచ్చు. ఏమైనా కలలు ఇంట్రెస్టింగ్. అవి కొత్త లోకాలను చూపిస్తాయి. కొత్త ఊహల్లో తేలియాడిస్తాయి. కొత్త భయాలను కలిగిస్తాయి. కొన్నిసార్లు ఉన్న భయాలనూ పోగొడతాయి. సహజంగా మనం ఏవైనా కోరుకుంటే అవి తీరకపోతే , కలలుగా వస్తాయి సరే. తీరినట్టు వస్తాయా? తీరనట్టే వస్తాయా? ఎలాగైనా రావచ్చు. ఇక ఎప్పటికీ తీరనట్టు కూడా రావచ్చు. ఫ్రాయిడ్ పందొమ్మిదో శతాబ్దపు ఆస్ట్రియా న్యూరాలజిస్టు. సైకోఎనాలసిస్‌కి పితామహుడు.

కలల్ని ఆయన డీసైఫర్ చేశారు. కలల కొలనులో ఈతకొట్టి లోపల ఏం మున్నదీ పైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఫ్రాయిడ్ చెప్పేదాన్ని బట్టి కలలన్నిటీనీ ఒకే మూసలో పెట్టి చూడ్డానికి లేదు. ఏ కలని, ఆ కలగానే ఎనలైజ్ చేయాలి. అప్పుడు ఆ కల దేనికి సంకేతమో తెలిసే అవకాశం ఉంటుందట!

ఫ్రాయిడ్ తర్వాత ఆ స్థాయిలో కలల్ని విశ్లేషించి గూఢార్థాలు కనిపెట్టిన ఆధునిక సైకాలజిస్ట్ ఇయాన్ వాలెస్. ఆయన 1,80,000 కలల్ని కాచి వడబోశారు. 'టాప్ 100 డ్రీమ్స్' అనే పుస్తకం రాశారు. అందుల్లోంచి మళ్లీ సర్వసాధారణంగా మనకు వచ్చే కొన్ని కలలను ప్రత్యేకంగా వేరు చేసి, వాటికి వాలెస్ చెప్పిన అర్థాలను, తీసుకోవలసిన జాగ్రత్తలను, కలల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

ఎవరో తరుముతున్నట్లుగా వస్తే:

ఎవరో తరుముతున్నట్లుగా వస్తే:

లైఫ్‌లో ఏదో సమస్య మిమ్మల్ని వెంటాడుతోంది. దాన్ని పరిష్కరించుకోలేక, దాన్నుంచి తప్పించుకుపోవాలని చూస్తున్నారు. లేదా ఆ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు. అదే కలలో మీరు పరుగెత్తాలని ప్రయత్నిస్తున్నా కూడా మీ కాళ్లు మొరాయిస్తూ, మీరు ఉన్నచోటనే ఉండిపోతున్నట్లు కల వస్తే మీలో ఆత్మవిశ్వాసం కొరవడిందని అర్థం.

ఏం చేయాలి? మీలోని జీవన నైపుణ్యాలకు పదును పెట్టుకోడానికి ఇదొక అవకాశం. మీ శక్తి ఏమిటో గ్రహించి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చెయ్యండి.

నలుగురి మధ్య దిగంబరంగా...:

నలుగురి మధ్య దిగంబరంగా...:

ఇలా కల వస్తే.. మీరు గుర్తింపు కోరుకుంటున్నారని. అది మీకు లభ్యం కావడం లేదని! ఎలాగైనా గుర్తింపు సంపాదించాలని తపిస్తున్నారని.

ఏం చేయాలి? ధైర్యం చేయాలి. జనం మధ్యకు రావాలి. చొరవ చూపాలి. మీ శక్తియుక్తుల్ని నిరూపించుకోవాలి.

పరీక్షకు ప్రిపేర్ కానట్లు...:

పరీక్షకు ప్రిపేర్ కానట్లు...:

జీవితం విసురుతున్న సవాళ్లను ఎదుర్కొలేనేమో అనే భయం మీలో ఉంది. ఓడిపోతానేమో, నెగ్గుకు రాలేనేమో, వైఫల్యం చెందుతానేమో, పరాజయం పాలౌతానేమో అనే నెగిటివ అలోచనలు మిమ్మల్ని నడిపిస్తున్నాయని ఈ కలకు అర్థం.

ఏం చేయాలి? మీ నైపుణ్యాన్ని, సామర్థ్యాలను కలిపి విజయసాధనకు కృషి చెయ్యాలి.

 దెయ్యాలు:

దెయ్యాలు:

కలలో తరచు దెయ్యాలు కనిపిస్తుంటే కనుక.. జీవితానికి, సమాజానికి మీరు దూరంగా ఉంటున్నట్లు లెక్క.

ఏం చెయ్యాలి? మనుషుల్లో కలవాలి. మంచి మంచి విషయాలు షేర్ చేసుకోవాలి.

గాలిలో ఎగురుతున్నట్లు:

గాలిలో ఎగురుతున్నట్లు:

సామాజిక పోకడలకు అనుగుణంగా వెళ్లాలని ఈ కల సూచిస్తోంది. అదే సమయంలో జీవితంలోని సమస్యల విషయంలో ఓపికగా, నేర్పు ప్రద ర్శించాలని చెబుతోంది.

ఏం చెయ్యాలి? మన జీవితం మీద మనం అదుపు సాధించాలి. పట్టువిడుపులతో ఒడుపుగా విజయ శిఖరాలను అందుకోవాలి.

పడిపోయినట్లు:

పడిపోయినట్లు:

మంచం మీది నుంచి పడిపోయినట్లు కనుక కల వస్తే... నిజ జీవితంలో దేని కోసమో మీరు గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారని. ఆ ప్రయత్నం విఫలం కాకూడదని దృఢనిశ్చయంతో ఉన్నారని.

ఏం చేయాలి? మీ మీద మీరు నమ్మకం ఉంచండి. జరిగేది జరగనివ్వండి. మీరు చేయదలచుకున్నది చేసేయండి.

పళ్లు రాలిపోతున్నట్లు వస్తే:

పళ్లు రాలిపోతున్నట్లు వస్తే:

పళ్లు (దంతాలు) ఆత్మవిశ్వాసానికి, శక్తికి సంకేతాలు. పళ్లు రాలిపోతున్నట్టు కల వస్తే, ఆ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే సంఘటనలు ఏవో మీ నిజ జీవితంలో జరగబోతున్నాయని అర్థం.

ఏం చేయాలి? జీవితంలో మీరు మార్పు కోరుకుంటున్నారనే దానికి ఈ కల సూచన కావచ్చు. లేదా మీరు పరిష్కరించుకోవలసిన ఒక సమస్యను మీకు గుర్తు చేయడం అంతరార్థం కావచ్చు. సమస్య పరిష్కారం కోసం పాజిటివ్ ఎనర్జీతో ప్రయత్నించండి.

 పాములు:

పాములు:

పాములు... దాగి ఉన్న భయాలకు చిహ్నాలు. పాములు కలలోకి రావడం అన్నది ఓ హెచ్చరిక కావచ్చు. పొంచి ఉన్న ప్రమాదాల నుంచి మిమ్మల్ని అప్రమత్తం చేయడం కావచ్చు.

ఏం చేయాలి? భయాలను ధైర్యంగా ఎదుర్కోండి. జీవితంలో ఎదురవుతున్న అవరోధాలను నేర్పుగా తొలగించుకుంటూ ముందుకు వెళ్లండి.

మరణం:

మరణం:

జీవితంలో ఊహించని పరిణామాలు ఏవో సంభవించబోతున్నాయనేందుకు చావు కలను ఒక సూచనగా పరిగణించాలి. ఒక ముగింపునకు, ఒక ప్రారంభానికి ఇలాంటి కలలు ప్రతీకలు.

ఏం చేయాలి? మరణానికి సంబంధించిన కలలు ఆత్మపరిశీలనకు, ఎదుగుదలకు సోపానాలు.

అదుపు తప్పిన వాహనాలు:

అదుపు తప్పిన వాహనాలు:

విజయానికి చేరువ చేసే దారిలో మీ ప్రయాణం అదుపు తప్పుతోందని అర్థం కావచ్చు. ప్రస్తుతం ఉన్న ఒక చెడు అలవాటు త్వరలోనే ఒక దీర్ఘ వ్యసనంగా మారబోతోందన్న దానికి ఇదొక సూచన కావచ్చు.

ఏం చేయాలి? రిలాక్స్ అవండి. పట్టు వదలండి. దూకుడు తగ్గించి మీ గమ్యానికి చేరుకునే ప్రయత్నం చేయండి.

జీవిత భాగస్వామి మోసం చేస్తున్నారనే భావన

జీవిత భాగస్వామి మోసం చేస్తున్నారనే భావన

చాలామంది నిపుణులు ఈ కలలను అతీంద్రియ జ్ఞానంలాగా భావించకూడదు అని చెపుతున్నారు. మీ భాగస్వామి మీతో గడపకుండా వేరేవాటి మీద దృష్టి ఉంచి సమయమంతా వెచ్చిస్తున్నప్పుడు ఈ విధమైన కలలు వొస్తాయి.

పిల్లలు

పిల్లలు

కలలో శిశువు కనిపించటం కొత్తదనానికి సంకేతం. అది ఒక క్రొత్త ఆలోచన, పని, కొత్త అభివృద్ధి లేదా జీవితంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో అభివృద్ధి కోసం చేయబోయే సమర్థవంతమైన కొత్త ప్రాజెక్ట్ కావచ్చు.

English summary

What Your Dreams Are Trying To Tell You

First and foremost the question arises is that why do we dream. Dreams are mostly reflections of our imaginations, our activities throughout the day, incidences in our lives, people we have met and our thoughts.
Story first published: Wednesday, September 28, 2016, 13:49 [IST]
Desktop Bottom Promotion