For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసిపిల్లలు నిద్రిస్తున్నప్పుడు చేయాల్సిన 5ముఖ్యమైన పనులు

|

మహిళలు గర్భం పొందినప్పటి నుండి ఒక్కో ప్రసవం అయ్యే వరకూ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే, ప్రసవం తర్వాత మరిన్నితల్లితో పాటు, బిడ్డకు కూడా మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రసవం తర్వాత చిన్నపిల్లలను అతి జాగ్రత్తగా మరియు సున్నితంగా చూసుకోవాల్సి ఉంటుంది. మరియు పసి శిశువులు మేల్కొని ఉండగా వారు ఎటువంటి పనులు చేసుకోలేరు. అంతే కాదు, శిశువు పడుకొన్నప్పుడు తల్లితో పాటు, శిశువుకు కూడా కొన్ని అదనపు పనులను సులభంగా అనుసరించవచ్చు. పసిపిల్లలకు గోళ్ళు చాలా షార్ప్ గా వేగంగా పెరుగుతాయి . వాటి కట్ చేయాలంటే తల్లికి కష్టమైన పనే. వారు మేల్కొని ఉన్నప్పుడు శిశువు ఇటు, అటు కదలడం వల్ల గోళ్ళను కట్ చేయడానికి కష్టం అవుతుంది. ఇటువంటి చిన్న చిన్న పనులను పసిపిల్లలు నిద్రించే సమయంలో చేయడం వల్ల పెద్దలకు సులభం అవుతుంది. అంతే కాదు, పిల్లలకు సురక్షితం కూడా .

పసిపిల్లలు నిద్రించే సమయంలో పిల్లలకు చేయాల్సిన కొన్ని పనులను ఈ క్రింది విధంగా వివరించడం జరిగింది . అలాగే చిన్న పిల్లలకు డైపర్స్ వల్ల ఏర్పడే రాషెస్ ను నివారించాలంటే, వారు నిద్రించేప్పుడు చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు ఈక్రింది విధంగా ఉన్నాయి...

5 Things To Do While Baby Is Sleeping

1. నెయిల్స్ కట్ చేయడం: గోరువెచ్చని నీటితో స్నానం చేయించి తర్వాత నిద్రపుచ్చండి. ఆ తర్వాత గోళ్ళను సాఫ్ట్ గా కట్ చేయాలి. వారి బుల్లి చేతులు, కాళ్ళ యొక్క గోర్లు కట్ చేయడానికి ఇది ఒక ఉత్తమ సమయం. తర్వాత బేబీ ఆయిల్ తో వారి కాళ్ళు చేతుల వేళ్ళకు మసాజ్ చేయాలి.

2. చెవులను శుభ్రం చేయడం: బేబీ నిద్రించే సమయంలో చేయాల్సిన మరో పని, చెవులను శుభ్రం చేయడం. మేల్కొని ఉన్నప్పుడు వారి చెవులను శుభ్రం చేయడానికి ఎలాగు అంగీకరించరు కాబట్టి, నిద్రించే సమయంలో చెవులను శుభ్రం చేయడానికి మంచి సమయం.

3. న్యాపి మార్చండి: ప్రతి రెండు గంటలకొకసారి పసిపిల్లల న్యాపిలను శుభ్రం చేయడం ఉత్తమం. చిన్న పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉండటం వల్ల తరచూ న్యాపిలు మార్చకుంటే, న్యాపిలు తడిగా ఉండటం వల్ల స్కిన్ రాషెస్ ఏర్పడుతాయి.

4. డైపర్ క్రీమ్ ను అప్లై చేయాలి: బేబీ నిద్రించే సమయంలో చేయాల్సిన మరో పని డైపర్ క్రీమ్ ను అప్లై చేయడం. వారు నిద్రించేటప్పుడు డైపర్ క్రీమ్ అప్లై చేయడం వల్ల త్వరగా ఆరి, రాషెస్ మార్క్ లేకుండా అప్పటికప్పుడు మాయం చేస్తుంది.

5. బేబీ హెయిర్ ను ట్రిమ్ చేయడం: బేబి నిద్రించేప్పుడు చేయాల్సిన మరో పని, బేబీ హెయిర్ ను ట్రిమ్ చేయడం. వారి తల చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

English summary

5 Things To Do While Baby Is Sleeping

When you are a mother to a newborn, you would hardly find the time for yourself until and unless your baby is asleep. Mothers who are new to the parenting world can also make use of this special time by trimming their baby's hair and cutting their nails.
Story first published: Tuesday, June 24, 2014, 18:04 [IST]
Desktop Bottom Promotion