పిల్లలు బాగా చదవాలంటే పోషకాహారమే బలం..

Posted By:
Subscribe to Boldsky

Nutrients Food For The Growing Kids
పిల్లల ఆరోగ్యానికి ఆహారం, వ్యాయామమే పునాది. చిన్నప్పుడు పోషకాహారం పిల్లలకు అందకపోతే అది పెద్దయ్యాక కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని చాలా పరిశోధనల్లో తేలింది. అంతేకాదు వాళ్ల చదువు, మార్కుల మీద కూడా తీసుకునే ఆహారం ప్రభావం చూపుతుందట అందుకే...

1. రోజూ టిఫిన్‌, రెండుపూటలా భోజనం మాత్రమే కాకుండా కనీసం మరో రెండుసార్లు చిరుతిళ్లు తినేలా చూడండి. ఉడికించిన శనగలు, వేయించిన వేరుశనగపప్పు, ఉడికించిన చిలకడదుంపల్లాంటి వాటిని ఆ చిరుతిండిలో చేర్చండి.

2. ఉదయాన్నే టిఫిన్‌ మాత్రం తప్పకుండా తినేలా చూడండి, సెలవుల్లో ఆలస్యంగా లేవడం వల్ల స్కూలు ఉన్నప్పుడేమో వ్యాన్‌ వచ్చేస్తుందన్న కంగారులోనూ పిల్లలు టిఫిన్‌ ఎగ్గొడుతుంటారు. దానికి మాత్రం ఒప్పుకోవద్దు. కొద్దిగా ముందు లేపి అయినా సరే పెట్టి పంపించండి. వీలయితే ఏదైనా పండు కూడా టిఫిన్‌తో పాటు తినే ఏర్పాటు చేయండి.

3. వీలైనన్ని రకాల తిళ్లను (కూల్‌డ్రింక్స్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌ కాదు) అందుబాటులో ఉంచితే వాటిలో ఏ కొన్ని నచ్చినా తింటుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. పళ్లు, నట్స్‌, ఎండుఫలాలతో పాటు ఆయా సీజన్‌లలో దొరికే కందికాయలు, అలసందకాయల్లాంటి, కిడ్నీబీన్స్ వంటి వాటిని పిల్లలకు చిన్నప్పటి నుంచే పరిచయం చేస్తూరండి. వాటిలో వాళ్లకు రుచిగా అనిపించినవి తింటారు. ఒకసారి నచ్చలేదన్నారని వదిలేయవద్దు. కొన్నాళ్లు ఆగి ఆ తర్వాత తినిపిస్తే వాళ్లకి నచ్చవచ్చు.

4. తిండి విషయంలో పిల్లల ఇష్టాయిష్టాలు శాశ్వతంగా ఉండవు. ఉడికించిన, బేక్‌ చేసిన, కొద్దినూనెలో మగ్గించిన ఆహారాన్ని పెట్టడానికే ప్రాధాన్యం ఇవ్వండి. చిప్స్‌లాంటి నూనెలో వేయించిన పదార్థాల్ని ఎంత తక్కువ పెడితే అంత మంచిది. ఇష్టంగా తింటున్నారని అలాంటి వాటిని ఇంట్లో నిల్వ ఉంచకండి. కావాలని మరీ పేచీ పెడితే ఎప్పుడన్నా ఒక ప్యాకెట్‌ కొనివ్వండి చాలు.

5. ఈ మధ్య టిన్‌లలో వచ్చే పళ్లరసాలను పిల్లల చేత ఎక్కువగా తాగిస్తున్నారు. కాని వాటి కంటే తాజాపళ్లను పెడితేనే ఎక్కువ పోషకాలు అందుతాయి. చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలను పిల్లలకు అలవాటు చేయకండి.

English summary

Nutrients Food For The Growing Kids | ఎదిగే పిల్లలకు పోషకాహారమే బలం..ఆరోగ్యం..

School-aged children are still growing. Growth requirements combined with physical activity play a role in determining a child's nutritional needs. Genetic background, gender, body size and shape are other factors. The nutrients needed by children are the same needed by adults, but the amounts vary.
Please Wait while comments are loading...
Subscribe Newsletter