For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల ఒంటరితనాన్ని దూరం చేయండిలా...

|

సాధారణంగా ఇంట్లో చిన్న పిల్లలున్నప్పుడు వారి గురించి ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. బాబైనా, పాపైనా తల్లిదండ్రులకు ఒక్కరే సంతానమైతే... మానసికంగా వారు ఒంటరితనాన్ని ఫీలవుతారా? మొండిగా ప్రవర్తిస్తుంటారా? ఒక్కరే అయితే సరిగ్గా పెంచడం కష్టమే అనుకుంటున్నారా..? అయితే ఈ సూచనలు మీకోసమే...

Smacking linked to mental illness

బిజీబిజీగా... ఈ ఆధునిక ప్రపంచంలో థియేటర్ ఆర్ట్స్ నుంచి ఆస్ట్రానమీ వరకు, కరాటే నుంచి పెయింటింగ్ వరకు, ఇండరో, ఔట్ డోర్ గేమస్.. ఇలా ఒకటేంటి మల్టీ టాలెంట్ కు కావల్సిన అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మీ బాబు, లేదా పాప అందిపుచ్చుకోవడానికి అవకాశాలు కల్పించడండి. ఒంటరితనం అనే భావనే వారి దరిచేరదు.

ప్రత్యేక శ్రద్ద: ఇంట్లో ఒక్కరే ఉంటే ఎవరితో ఆడుకోవాలో తెలియదు. బయట స్నేహితులున్నా అదీ కాసేపే. ఇలాంటప్పుడు పేరెంట్స్ ఒంటరితనాన్ని పోగొట్టడానికి రోజులో ప్రత్యేకించి కొంత సమయం వారితో తప్పనిసరిగా గడిపేలా ప్లాన్ చేసుకోవాలి.

గిఫ్ట్ లను అందించాలి: ఈ రోజుల్లో భార్య భర్త సంపాదనాపరులు అవడం, ఒక్కరే అని పిల్లలపై కానుకల వర్షం కురిపిస్తుంటారు. పిల్లల అవసరాలకు మించి ఇచ్చే ప్రతి కానుక వారికి చెడే చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అడిగిన వెంటనే కాదనకుండా ఇచ్చేస్తుంటే కష్టం అంటే ఏమిటో తెలుసుకోలేరు. ఫలితంగా జీవితంలోవచ్చే ఒడిదొడుకులను తట్టుకోలేరు.

వినోదం: సాహిత్యాన్ని పరిచయం చేస్తే పుస్తకాల మీద ఆసక్తి పెరుగుతుంది పుస్తకాలు స్నేహితుల లోటును భర్తీ చేస్తాయి. ఒంటరిగా ఉండే పిల్లలు టీవీ చూడటం, ఇంటర్ నెట్ బ్రౌజింగ్ తో కాలాన్ని వధాగా గడిపేస్తుంటారు. అందుకని ఖచ్చితమైన సమయాన్ని మాత్రమే కేటాయించాలి.

కుటుంబ పరిధి: ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బంధువులతో సందడిగా ఉండే వాతావరణాన్ని సష్టించండి. కుటుంబ పరిధి పెరుగుతున్నా కొద్ది పిల్లలు ఒంటరివారిమనే భావనకు దూరం అవుతారు.

అతి శ్రద్ద: అమ్మాయో, అబ్బాయో ఒక్కరే ఉంటే ఇంట్లో వారి దృష్టి అంతా వారి మీదకే మళ్లుతుంది. ఒక్కరే కదా అని అతి శ్రద్దతో పిల్లలను స్వేచ్చను హరించడం వారి భవిష్యత్తుకు శ్రేయస్కరం కాదు. అడుగు వేస్తే కందిపోతారేమో అన్నంతగా చూస్తే పిల్లలు ఏ పని చేయడానికైనా సొంత నిర్ణయం తీసుకోలేరు. స్నేహితులుగా ఉండగిగే ఆహ్లాదకరమైన ఇంటివాతావరణం, భరోసా ఇచ్చే పేరేంట్స్ ఉంటే ఒంటరి అనే భావనే పిల్లల ధరిచేరదు..

English summary

Smacking linked to mental illness | పిల్లలు మొండిగా ప్రవర్తిస్తుంటే...

A child who is spanked, slapped, grabbed or shoved as a form of punishment runs a higher risk of becoming an adult who suffers from a wide range of mental and personality disorders, even when that harsh physical punishment was occasional and when the child experienced no more extreme form of violence or abuse at the hands of a parent or caregiver, says a new study.
Desktop Bottom Promotion