Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
ముచ్చటైన రూపం మీ సొంతమవ్వాలంటే!

బేబేని డెలివరీ చేసినప్పటికి మీరు గర్భం ధరించినట్లే వుంటే, మీరు తప్పక బెల్ట్ ధరించాలి. అది ఎలా మీకు ఉపయోగపడుతుందంటే....
1. మీ వీపుకు బలం చేకూర్చి నొప్పి రాకుండా చేస్తుంది. పెరిగే బేబీ మీ వీపుపై అధిక బరువు ఒత్తిడి కలిగిస్తాడు. కనుక వీపు కండరాలు బలహీనపడతాయి. మూడవ త్రైమాసికంలో మొదలైన నొప్పి డెలివరీ అయినా తగ్గదు. కనుక నడుముకు బెల్ట్ తప్పక వేసి వీపు కండరాలకు బలం చేకూర్చాలి. పూర్వపు గట్టితనం కండరాలకు రావాలంటే ఈ సమయంలో బెల్ట్ వేయాలి.
2. పొట్ట సహజంగా తగ్గుతుంది. బిడ్డ లోపల వుండగా పొట్ట పూర్తిగా ఉబ్బుతుంది. దానిని సిజేరియన్ చేస్తారు. బేబీ బయటకు వచ్చిన వెంటనే మీలోని కొవ్వు అంతా బయటకు రాదు. సిజేరియన్ అయినప్పటికి మీరు ఇంకా గర్భవతిగానే కనపడతారు. యోనిద్వారా జననం అయితే వారు తమ పొట్టను బెల్ట్ లేకుండానే తొలగించుకోగలరు. కాని సిజేరియన్ అయిన మహిళలు తప్పక బెల్ట్ వేయాలి.
3. బెల్ట్ పెట్టుకుంటే మీరు సన్నగా కూడా కనపడతారు. అది మీ పొట్టను లోపలికి తోసి వుంచుతుంది. మీ శరీరం చక్కని రూపంలో లావు లేకుండా ఉంటుంది.
4. మీ కదలికలు బెల్ట్ పెడితే తేలికగా వుంటాయి. సిజేరియన్ అయినప్పటినుండి మీ శరీర కదలిక మందంగా వుండి నొప్పితో వుంటుంది. ప్రత్యేకించి కూర్చొనటం, లేవటం కష్టమవుతుంది. ఈ పొట్ట బెల్ట్ పొట్ట చుట్టూ వదులుగా వున్న మాంసాన్ని పట్టి వుంచి మీ కదలికలు తేలిక చేస్తుంది.
5. ఆపరేషన్ కోత త్వరగా నయమవుతుంది. పొట్ట గట్టిగా దాని స్ధానంలో వుండటంతో మీ గాయం త్వరగా నయమవుతుంది. లేకుంటే మీ పొట్ట అటూ ఇటూ కదులుతూంటే వేసిన కుట్లు నయమవటానికి సమయం పడుతుంది.
సిజేరియన్ కాన్పు తర్వాత కనీసం 6 నెలలైనా మహిళ బెల్ట్ ధరించాలి. మీరు త్వరగా కోలుకోవడంలో, గతంలో బెల్ట్ లు ఏ రకంగా మీకు ఉపయోగ పడ్డాయనేది మాకు వ్రాయండి.



Click it and Unblock the Notifications