Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
పాలు పట్టడం తల్లికి ప్రయోజనకరమే!

సాధారణంగా తల్లులు తమ పిల్లలకు కనీసం ఆరు నెలలు వచ్చేటంతవరకు తల్లిపాలు పట్టాలి. అంతకు మించి, బిడ్డకు ఒక సంవత్సరం వరకు కూడా పట్టినప్పటికి ఆమె ఆరోగ్యానికి ఎటువంటి హాని కలుగదు. తల్లిపాలలో లభించే పోషక విలువలు బిడ్డకు మరే ఇతర పాలలోను లేదా పోషకాహారాలలోను లభించదు. తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు బాగా సహకరిస్తాయి. వేరుగా గేదె పాలు లేదా ఆవు పాలు లేదా బాటిల్ పాలు ఏవి పట్టినప్పటికి బిడ్డకు అవసరమైన కొవ్వు, ఇతర పోషకాలు సమపాళ్ళలో లభించవు.
అమెరికా ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రసవించే వారిలో 50 శాతం మంది తల్లిపాలు బిడ్డలకివ్వాలని వుండగా, 77 శాతం మంది తల్లిపాలు ఇవ్వటమైతే మొదలుపెడుతున్నారు కానీ బిడ్డకు ఆరు నెలల వయసు లోపే 36 శాతం మంది వాటిని నిలుపుతున్నారని పరిశోధన చెపుతోంది. అయితే, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పేడియాట్రిషియన్స్ సంస్ధ బిడ్డలకు పూర్తిగా ఒక సంవత్సరం వయసు వచ్చే వరకు తల్లిపాలు ఇవ్వాలనిసిఫార్సు చేస్తోంది. ప్రభుత్వ చేసే ప్రచారం తల్లులు మొదలు పెట్టే వరకే పనిచేస్తోందని తర్వాత దానిని కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టటంలేదని వారు తెలిపారు.
బిడ్డలు అనారోగ్యానికి గురై మరణించిన వారిలో చాలామంది తల్లిపాలు త్వరగా నిలిపివేసిన కారణంగానే మరణాలు సంభవించినట్లుగా కూడా ఈ సర్వే వెల్లడించింది. కనుక తల్లులు, కనీసం బిడ్డకు ఒక సంవత్సరం వయసు వచ్చే వరకు తమ పాలను పడుతూ పోషణ చేయాలి. తల్లులు ఉద్యోగస్తులైనప్పటికి వారు తమ ఉద్యోగాలకు వెళ్ళే ముందే తగిన ఏర్పాట్లు బిడ్డకు చేయాలి. నేటి రోజులలో తల్లుల స్తనాలనుండి పాలు త్వరగా తీయటానికి మెషీన్లు కూడా వస్తున్నాయి. వాటిని ఉపయోగించి తల్లి ముందస్తుగా బిడ్డకవసరమైన పాలను రిఫ్రిజిరేటర్ వంటి సాధనాలలో నిలువవుంచి తాను ఇంటినుండి దూరంగా వున్నప్పటికి బిడ్డకు పట్టే ఏర్పాట్లు చేయవచ్చు.



Click it and Unblock the Notifications