Latest Updates
-
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు!
బాలింతలకు మసాజ్ ప్రయోజనాలు!

బాలింతలకు మసాజ్ ప్రయోజనాలు
విశ్రాంతి - కాన్పు తర్వాత మహిళలకు ఒత్తిడి వుంటుంది. తన బిడ్డకు అధిక సమయం కేటాయించడంతో కొత్త తల్లి శారీరకంగా, మానసికంగా అలసిపోతుంది. కనుక, అలసిన శరీరానికి మసాజ్ చాలా అవసరం.
శారీరక నొప్పులు - కాళ్ళలో, తొడలలో, చేతులు, మెడ, వీపు వంటివి కాన్పు తర్వాత నొప్పులు పెడతాయి. మసాజ్ చేస్తే వీటినుండి విముక్తి పొందవచ్చు. మసాజ్ రాత్రివేళ చేస్తే మంచిది. నిద్రించేముందు కొద్ది నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. లేదా భర్త సహాయం తీసుకుని మసాజ్ చేయించుకోవాలి. నొప్పిలేని నిద్ర పడుతుంది.
రక్త సరఫరా - శరీర మసాజ్ శరీరమంతా రక్తప్రసరణ వుండేలా చేస్తుంది. నొప్పి దూరమవటమే కాక, అది ఆక్సిజన్ అధికంచేసి రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది.
పాలు ఉత్పత్తి - ఆమెలోని పాలగ్రంధులు అధిక ఉత్పత్తి చేయాలంటే మసాజ్ సహకరిస్తుంది. స్తనాలు మసాజ్ చేస్తే పాలు అధికమవటమే కాక, రొమ్ములు వేలాడకుండా వుంటాయి. అంతవరకు అడ్డగించబడిన పాలగ్రంధులకు రక్తప్రసరణ బాగా జరిగి ఉత్పత్తి అధికమవుతుంది.
కండరాలు బిగువు - కాన్పు సమయంలో ఆమె కండరాలు వదులవుతాయి. కాన్పు తర్వాత చేసే మసాజ్ కు కండరాలు మరోమారు ఫిట్ నెస్ సంతరించుకుంటాయి.
బరువు తగ్గుట - కాన్పు ముందరి శరీర రూపం పొందాలంటే, పొట్ట తగ్గాలంటే, శరీర కొవ్వు కరగాలంటే మసాజ్ తప్ప మరోమార్గం లేదు.
స్ట్రెచ్ మార్కులు - ప్రసవానంతరం పొట్టపై వచ్చే స్ట్రెచ్ మార్కులు మసాజ్ తో తగ్గుతాయి. మంచి నూనెలు వాడి మసాజ్ చేయించాలి.
చర్మం - చర్మంపై అప్పటివరకు వున్న మృతకణాలు మసాజ్ తో తొలగిపోతాయి.
బాలింతలకు మసాజ్ చేయటం వలన ఈ ప్రయోజనాలు చేకూరుతాయి. డెలివరీ తర్వాత శరీరానికి కొంత విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతి మసాజ్ తర్వాతి దశలో దొరుకుతుంది. మసాజ్ చేసేటపుడు గోరు వెచ్చటి నూనెలు ఉపయోగించండి. ఈ మసాజ్ ఇంటివద్దే చేసుకొనవచ్చు.



Click it and Unblock the Notifications