Latest Updates
-
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు!
ఆలస్యంగా గర్భం ధరిస్తేవచ్చే పాల సమస్య....!

పాలు సక్రమంగా రాని బాలింతలకు కాల్షియం, ఇతర మందులను అందజేస్తారు. ఈ మహిళలు ఎక్కువ క్యాలరీల తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్లు, విటమిన్లతో కూడిన ఆహారంతో పాటు పాలు, పండ్లు, ఆకు కూరలు తీసుకోవాలి. తల్లికి తగినంత నిద్ర ఉండాలి. నీళ్లు బాగా తాగాలి. ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు తల్లి బిడ్డకు తగినంత పాలివ్వగల్గుతుంది. తల్లి పాలు కడుపు నిండా తాగిన పిల్లలు అవసరమైన బరువు పెరుగుతారు. కొందరు తమ బిడ్డకు ఎక్కువగా పాలిస్తారు. ఇది మంచిదికాదు. దీంతో శిశువుకు వాంతులు రావడం జరుగుతుంది. బిడ్డకు తగిన మోతాదులోనే పాలు పట్టాలి.
స్తనాలలో ఇన్‌ఫెక్షన్, గడ్డలు ఉన్నప్పుడు తల్లి బిడ్డకు సరిగా పాలివ్వలేదు. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్‌తో చికిత్స చేయించు కోవాలి. బిడ్డకు జలుబు ఉన్నప్పుడు ముక్కు పట్టేసి పాలు తాగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. జలుబు ఉన్న పిల్లలకు వెంటనే వైద్యం చేయించాలి. తల్లిలో ఏదైనా ఇన్‌ఫెక్షన్ ఉంటే పాల ద్వారా అది బిడ్డకు సోకవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్‌ఫెక్షన్‌కు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్య చికిత్సలు చేయించుకోవాలి.
తీవ్రమైన గుండె వ్యాధులతో బాధపడుతున్న తల్లులు బిడ్డకు పాలివ్వలేరు. ఇక డెలివరీ సమయంలో షాక్ తో సైకో గా మారిన వారు సైతం తమ పిల్లలకు సక్రమంగా పాలివ్వలేరు. ఇటు వంటి వారు వెంటనే వైద్యం చేయించు కోవడం అవసరం. తల్లిపాలు ఎంత ఆరోగ్యకరమో ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రచారం చేస్తున్నది. మహిళలు తమకుగల అపోహలు వదలి, బిడ్డలకు పాలిస్తే వారు భవిష్యత్తులో ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు. తల్లిపాలు తాగిన వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications