Latest Updates
-
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు!
కొత్తగా పుట్టిన బిడ్డకు స్నానం చేయించవచ్చా?

రోజుకు రెండు సార్లు వైద్యులు సూచించిన విధంగా స్పిరిట్ ఉపయోగించి బొడ్డును శభ్రం చేయాలి. వీలైనంత వరకు బొడ్డు ప్రదేశం పొడిగా వుండేలా చూసుకోవాలి. బొడ్డు గాయం త్వరగా తగ్గాలని చాలామంది మహిళలు బిడ్డ బొడ్డుకు పౌడర్, నెయ్యి లేదా నూనె వంటివి రాస్తూ వుంటారు. కానీ ఇవి ఏవీ రాయకూడదు. ఆ ప్రదేశంలో ఇన్ ఫెక్షన్, నొప్పి లాంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ప్రదేశం ఎర్రగా కందినట్లు అనిపించినా, రక్తం లేదా చీము వస్తున్నా, తక్షణమే వైద్య సలహా పొందాలి.
బిడ్డ కొద్దిగా పెరిగాక ప్లాస్టిక్ టబ్ లో స్నానం చేయించవచ్చు. స్నానం చెయించేటపుడు చర్మం ముడతలు, చేతికింది భాగాలు, మెడ, చేతి వేళ్ళ సందులు, మోకాళ్ళ వెనుక భాగాలు, లైంగిక అవయవాలు తప్పనిసరిగా శుభ్రం చేయాలి. కానీ ఎక్కువగా సబ్బును ఉపయోగించరాదు. తలకి, పెదవుల కింది భాగంలో మాత్రమే సబ్బు ఉపయోగించాలి. బిడ్డకు వాడే సబ్బులు పిల్లలవై వుంటే వారి చర్మానికి సమస్యలు రాకుండా వుంటాయి. ఈ సబ్బులలో రసాయనాలు తక్కువగా వుంటాయి.
సాధారణ సబ్బులు, షాంపూలతో కాకుండా బేబీ సోప్, బేబీ షాంపూలతో మాత్రమే పసిబిడ్డకు స్నానం చేయించండి. ఇంటిలో తయారు చేసిన సున్నిపిండి, పాలు ఉపయోగించి కూడా బిడ్డకు స్నానం చేయించవచ్చు. కానీ నలుగు, సబ్బు, పాలు బిడ్డ శరీరంపై అంటుకుని ఉండిపోకూడదు. వీలైనంత అధిక మొత్తాలలో నీటిని వినియోగించి బిడ్డను శుభ్రపరచాలి. స్నానం పూర్తయ్యాక వెచ్చటి గదిలోకి తీసుకు వెళ్ళి మెత్తటి టవల్ తో మెల్లగా బిడ్డ శరీరాన్ని తుడుస్తూ ఆరనివ్వాలి.



Click it and Unblock the Notifications