Latest Updates
-
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.!
శిశువుకు అవసరమైన పోషకాలకు తల్లిపాలే ఆధారం!

తల్లిపాలు పట్టటం ఒక సహజ లక్షణం. మహిళలకు అది ఒక ప్రోత్సాహం కాగా అమెరికావంటి ధనిక దేశంలో కొన్ని ప్రాంతాలలో అదొక దురాచారంగా భావిస్తున్నారు. బిడ్డకు తన స్తనపాలు పట్టే తల్లిని అసహ్యించుకునే వారు కూడా ఆ సమాజంలో లేకపోలేదు. తల్లి తన స్తనాల పాలు బిడ్డకు పట్టటమనేది శారీరక ధర్మంగా భావించాలి. అది సమాజపరంగా సంబంధం లేని అంశం. మన సంస్కృతిలో ఎంతమంది చూసినప్పటికి దానిని సర్వసాధారణంగా భావిస్తారు. తల్లిపాలు బిడ్డకు అందించడం ఒక సహజ చర్య అంతేకాని అది సిగ్గుపడవలసినది కాదని వారు గుర్తించాలి.
వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్ధ బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చేంతవరకు తప్పక తల్లిపాలు పట్టాలని ఆ తరువాత రెండు సంవత్సరాలు అంతకు మించి కూడా ఇవ్వవచ్చని సిఫార్సు చేస్తోంది. అయితే, అమెరికాలో నేటికి 15 శాతం మంది పిల్లలకు మాత్రమే తల్లిపాలు లభిస్తున్నట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోలో వెల్లడి చేసింది. కొంతమంది బహిరంగ ప్రదేశాలలో తల్లులు పిల్లలకు పాలివ్వటమనేది నిరసిస్తారు. ఇది వారు తమ పిల్లలపట్ల నిరసన ప్రదర్శించటంగానే భావించాలి. కాని నేటికి మన సమాజంలో తల్లులు బహిరంగ ప్రదేశాలలో సైతం పిల్లలకు పాలు పడుతూనే వున్నారు. మన దేశంలోని కొన్ని బహిరంగ ప్రదేశాలు అంటే సూపర్ మార్కెట్లు, ఆస్పత్రులు వంటి వాటిలో తల్లులు, ఏడుస్తున్న తమ పిల్లలకు పాలు పట్టటానికి కొన్ని ప్రత్యేక ప్రదేశాలతో ఏర్పాట్లు చేశారు.
కొత్తగా అపుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలను మించిన ఆహారం లేదు. తల్లిపాలలో బిడ్డకు శారీరకంగా, మానసికంగా పెరుగుదలకు అవసరమైన పోషకాహారాలు అన్నీ వుంటాయి. కనుక బిడ్డ ఎదుగుదల సరిగా వుండాలంటే, తల్లిపాలు బిడ్డకు మొదటి ఆరు నెలలు పట్టాలి. మహిళ ప్రసవం అయిన తర్వాత వెంటనే తన స్తనాలలో పొందే పాలు ఎంతో చిక్కగా వుంటాయి వీటిని ముర్రు పాలు అంటారు. ఈ పాలను సైతం అపుడే పుట్టిన బిడ్డకు అందించాలి.



Click it and Unblock the Notifications