For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవానంతరం వికారం కలగడానికి గల కారణాలు?

|

గర్భంధారణ సమయంలో వికారం, వాంతులు అనే సమస్యలు సర్వసాధారణం. కానీ ప్రసవానంతరం కూడా కొందరు మహిళలు వికారం సమస్యను ఎదుర్కొంటారు. దీనిని పోస్ట్ పార్టమ్ నోసి(ప్రసవానంతర వికారం)అంటారు. కొంత మంది మహిళలు మాత్రం ఇది సాధరణంగా వచ్చే మార్నింగ్ సిక్ నెస్ గా భావిస్తారు. కొంత మంది మాత్రం ఇతర లక్షణాలతో కూడాని అభుభవాన్ని పొందుతారు. ప్రసవం తర్వాత మీ శరీరంలోని హార్మోన్ లెవల్స్ మరియు దాని చర్యలు స్థిరపడటానికి కొంత సమయం పడుతుంది. దాని ప్రభావం వల్ల ప్రసవానంతరం కూడా మహిళల్లో కొంత ఎక్కువ సమయం వికారానికి దారితీయవచ్చు. అంతేకాక, ప్రసవానంతరం శిశువుకు పాలు పట్డడం వల్ల శరీరం కలిగి మార్పులు కూడా వికారం యొక్క ఉనికికి దోహదం చేస్తుంది.

నార్మల్ డెలివరీ లేదా సి సెక్షన్ ఏదైనా సరే, ప్రసవానంతరం కొన్ని వారాల వరకూ తేలికపాటి వికారం ఉండటం సాధారణం. కానీ మీ వికారం అనేది ఎక్కువ సమయం అలాగే కొనసాగితే లేదా వికారానికి కొన్ని ఇతర లక్షణాలతో సంబంధం కలిగి ఉంటే మీరు తప్పనిసరిగా వైద్య సదుపాయాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. ప్రసవం తర్వాత కూడా వికారం అనుభూతిని చెందడానికి కొన్ని సాధారణ కారణాలున్నాయి. వాటిని పరిశీలించండి.

Simple Causes Of Nausea After Childbirth

1. ఆక్సిటోసిన్ విడుదల: బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో వికారం కలగడం చాలా సాధారణం. ఇది ఆక్సిటోసిన్ అనే హార్మోన్ వల్ల ఈ అనుభూతి కలుగుతుంది. సాధారణంగా ఇటువంటి వికారం ప్రసవం జరిగిన 8 వారాల తర్వాత కనిపించకుండా పోతుంది.

2. డీహైడ్రేషన్: శిశువుకు పాలు పట్టే సమయంలో, తల్లులు డీహైడ్రేషన్ కు గురైయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పాలిచ్చే తల్లులు ప్రతి రోజూ తగు మోతాదులో నీరు తాగడం వల్ల మీ శరీరాన్ని డీహైడ్రేషన్ లో ఉంచుకోవచ్చు. అందుకు ప్రతి రోజూ 8గ్లాసుల నీళ్ళను త్రాగాలి. అప్పుడే మీరు హెల్తీగా ఉండటంతో పాటు, వికారాన్ని నివారించుకోవచ్చు.

3. డెలివరీ తర్వాత కోలుకోవడం: గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో వివిధ భౌతిక మరియు హార్మోనుల మార్పులకు గురౌతుంది. అటువంటి మహిళలకు వారి శరీరం తిరిగి యాథాస్థితికి చేరుకోవడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. అటువంటి మహిళలు ప్రసవంత తర్వాత కూడా వికారంను ఎదుర్కొంటారు.

4. బేబీ పెరుగుదల: బేబీ పెరుగుదల సమయంలో ఎక్కువ పాలు త్రాగుతారు. దాంతో తల్లి శరీరంలో హార్మోన్ లెవల్స్ పెరుగుతాయి. అందువల్ల కూడా ప్రసవం తర్వాత బాలింతల్లో వికారానికి గురిఅవుతారు . ఈ వికారం నుండి బయటపడాలంటే సరైన ఆహార నియమాలు మరియు నీరు తీసుకోవడం మంచి పద్దతి.

5. యాంటీ డిప్రజెంట్ డ్రగ్స్: ప్రసవం తర్వాత బాలింతలు తీసుకొనే యాంటీడిప్రజెంట్ మందుల వల్ల కూడా వికారం కలిగి ఉండటం ఒక సాధారణ స్థితి. ప్రసవానంతరం ఒత్తిడికి గురయ్యే మహిళలకు ఈ యాంటీడిప్రజెంట్ మందులను సూచిస్తారు. బాలింతల్లో వికారం,వారు తీసుకొని ఔషదం యొక్క రకం మరియు మోతాదు మీద ఆధారపడి ఉంటుంది.

6. ఐరన్ లోపం లేదా రక్తహీనత: ఐరన్ లోపం లేదా రక్తహీనత. ప్రసవానంతరం బాలింతల్లో వికారం కలగడానికి ఇది మరో కారణం. ప్రసవ సమయంలో అధికంగా రక్తాన్ని కోల్పోవడం మరియు తీసుకొనే ఆహారంలో ఐరన్ పాళ్ళు లోపించిన ఫుడ్ ను తీసుకోవడం కూడా రక్తంలో ఐరన్ లోపానికి ప్రధాణ కారణం. కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్స్ రెగ్యులర్ డైట్ లో తీసుకోవడం వల్ల ప్రసవానంతర వికారన్ని నివారించవచ్చు.

7. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్: ప్రెగ్నెన్సీ సమయంలో రోగనిరోధక శక్తి స్థాయి తక్కువగా ఉంటుంది. అలాగే ప్రసవం తర్వాత కొన్ని వారాల వరకూ కూడా ఉంటుంది. ప్రసవం తర్వాత సరైన శుభ్రత పాటించకపోవడం వల్ల మరియు శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోనుల ప్రభావం వల్ల యూరినరీ ట్రాక్ మార్గంలో ఇన్ఫెక్షన్స్ దారి తీస్తుంది . ప్రసవం తర్వాత జర్వంతో పాటు వికారాన్ని ఎదుర్కొంటుంటే మీరు ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.

English summary

Simple Causes Of Nausea After Childbirth | బాలింతల్లో వికారం కలగడానికి గల ప్రధాన కారణాలు.!

Nausea is very common during pregnancy. But there are certain women who may experience nausea even after childbirth, which is called postpartum nausea. Some women may feel it as the common morning sickness, while some others experience it along with other symptoms.
Desktop Bottom Promotion