For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి స్పెషల్-మాల్పువా స్వీట్

By Lekhaka
|

దుర్గా పూజలో ప్రసిద్ధ బెంగాలీ స్వీటు మాల్ పువాని ఉపయోగిస్తారు.అసలు ఈ స్వీటు లేకుండా బెంగాలీలకి నవరాత్రులు పూర్తి కావు అలాగే డిశంబరు నెలలో వచ్చే పిఠే-పులి ఉత్సవ్ లేదా పాన్‌కేక్స్ మరియూ మోమోస్ ఉత్సవంలో కూడా ఈ స్వీటు తయారు చేస్తారు.

ఇంట్లో చేసిన స్వీట్లు ఏవైనా సరే రుచికరంగా ఉంటాయి ఇక మాల్ పువా అయితే మీరు చివరి ముక్క వరకూ ఆపకుండా తిని చేతులు కూడా వదలకుండా నాకుతారు.

ఈ స్వీటు తయారీ బాగా సులభం పైగా దీనిని ఇంట్లో ఉండే పదార్ధాలతోనే తయారు చేసుకోవచ్చు.మరింక ఆలశ్యమెందుకు ఈ విజయ దశమికి మీ ఇంట్లో మాల్ పువా చేసి రబ్రీ, బాదం, కుంకుమ పువ్వుతో అలంకరించి మీ అతిథులకి వడ్డించి వారి మనసు దోచుకోండి.

ఎంత మందికి సరిపోతుంది-4

వండటానికి పట్టే సమయం-20 నిమిషాలు

సమాగ్రి సమకూర్చుకోవడానికి-25 నిమిషాలు

కావాల్సిన పదార్ధాలు:

  • మైదా లేదా రీఫైండ్ ఫ్లోర్-ఒక కప్పు
  • సేమోలీన-400 గ్రాములు
  • వాము-అర టేబుల్ స్పూను
  • ఎల్లో ఫుడ్ కలర్
  • పాలు-2 కప్పులు
  • పంచదార-1 కప్పు
  • నీళ్ళు-ఒక కప్పు
  • గార్నిషింగ్ కోసం-కుంకుమ రేకులు, బాదాం,రబ్రీ స్వీట్

తయారు చేయు విధానం:

Navratri Special: Malpua Bengali Sweet

1.ఒక పెద్ద గిన్నెలో మైదా(రీఫైండ్ ఫ్లోర్), సెమోలీనా, వాము, ఎల్లో ఫుడ్ కలర్, పాలు వేసి జారు పిండిలాగ కలుపుకోవాలి.

Navratri Special: Malpua Bengali Sweet

2.ఈ పిండిని వేడి నూనెలో వేసి గోధుమ రంగు వచ్చేవరకూ వేయించాలి.

Navratri Special: Malpua Bengali Sweet

3.నూనెలోనుండి తీసి పంచదార పాకంలో వేసి 2-3 నిమిషాలు ఉంచాలి.

Navratri Special: Malpua Bengali Sweet

4.కొంచం రబ్రీ స్వీటు, కుంకుమ రేకులు,బాదాం పప్పులని మాల్ పువా మీద వేసి సర్వ్ చెయ్యాలి.

English summary

Navratri Special: Malpua Bengali Sweet

Malpua is one of the most favourite Bengali desserts and it is also offered as Naivedyam during Durga puja.Celebrating Durga Puja will remain incomplete without having malpua and Bengalis also prepare it in the month of December, which is the month of ‘Pithe-puli Utsav’ or the festival of pancakes and sweet momos.
Desktop Bottom Promotion