Latest Updates
-
బీహారీ స్టైల్ మామిడికాయ పచ్చడి..ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
అనుకోని ధన యోగం.. ఈ రాశుల వారికి నేడు కెరీర్, ఆర్థిక పరంగా తిరుగులేని అదృష్టం! -
మీ ఇంట్లో RO వాటర్ వాడుతున్నారా? మలమూత్రాల ద్వారా వచ్చే ఈ-కొలి బ్యాక్టీరియా..తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు.. -
గురు పుష్య యోగం: ఈరోజు బంగారం కొంటే మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయా? అదృష్టం మీదే! -
కూరల్లో పెరుగు వేసేటప్పుడు ఇలా చేస్తే అస్సలు విరిగిపోదు..సెలబ్రిటీ చెఫ్ టిప్స్! -
2026లో అధిక మాసం వచ్చింది.. ఈ సమయంలో ఏ పనులు చేస్తే ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయో తెలుసా? -
సర్వార్థ సిద్ధి యోగం: ఈ రోజు ఈ పనులు మొదలుపెడితే తిరుగులేని విజయం మీదే! -
కర్కాటక, కన్యా, వృశ్చిక రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 21 మే 2026 -
కంచంలో ఎన్ని కూరలున్నా సరే.. ఈ మామిడి అల్లం చారు ముందు దిగదుడుపే! -
పల్లెటూరి స్టైల్ పానీపూరి ఇలా చేస్తే.. బయట దొరికే రుచిని మించిపోతుంది, ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది!
అవినీతి అంతానికి నడుంకట్టిన నారీమణి!

కిరణ్ బేడి జూన్ 9, 1949వ తేదీన పంజాబ్ లోని అమృతసర్ లో జన్మించింది. ఈమె ఒక రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ మరియు ఒక సామాజిక కార్యకర్త. పోలీస్ సర్వీస్ లో ఈమె 1972 వ సంవత్సరంలో ప్రవేశించారు. ఐపిఎస్ కేడర్లలో మొట్టమొదటి మహిళా ఆఫీసర్ గా పేరొందారు. డిసెంబర్ 2007 సంవత్సరంలో కిరణ్ బేడి డైరెక్టర్ జనరల్, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవలప్ మెంట్ లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రెండు స్వచ్ఛంద సేవా సంస్ధలను ప్రారంభించారు. ప్రభుత్వ సేవలకుగాను ఈమెకు రామన్ మెగసేసే అవార్డు 1994 లో లభించింది.
టెన్నిస్ ఆటలో ప్రావీణ్యత అధికం. తన 22 సంవత్సరాల వయసుకే అనేక జాతీయ స్ధాయి అవార్డులు గెలుచుకుంది. ప్రాధమిక విద్యాభ్యాసం అమృతసర్ లోనే జరిగింది. 1972 వ సంవత్సరంలో కిరణ్ బేడి బ్రిజ్ బేడి అనే పారిశ్రామిక వేత్తను మతాంతరంగా వివాహమాడింది. ఈమెకు ఒక కుమార్తె. ఆమె కూడా సామాజిక కార్యకర్తగా పేరొందింది. ప్రభుత్వంలో ఒక ఐపిఎస్ ఆఫీసర్ గా తాను నిర్వహించిన పదవులలో అనేక సవాళ్ళను ఎదుర్కొంది.
మత్తు మందుల నియంత్రణపై అనేక చర్యలు చేపట్టి పేరు గాంచింది. జైళ్ళలో నేరస్తులకు ఎన్నో సంస్కరణలు చేసింది. అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కిరణ్ బేడి ఒక ప్రధాన సభ్యురాలు. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టే చర్యలలో భాగంగా బలమైన ఒక లోక్ పాల్ బిల్లును రూపొందించాల్సిందిగా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆందోళనలలో భాగంగా ప్రభుత్వం ఈమెను అరెస్టు చేసింది. కిరణ్ బేడి జీవితంపై ఆస్ట్రేలియా చలన చిత్ర నిర్మాత మేగన్ డోనేమన్ ఒక చిత్రం నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచంలోని ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఒకటిగా చూపబడుతోంది. ఈ చిత్రానికి ఉత్త మ డాక్యుమెంటరీ ఫిలింగా 100,000 డాలర్ల నగదు బహుమతి వచ్చింది.



Click it and Unblock the Notifications