Latest Updates
-
బీహారీ స్టైల్ మామిడికాయ పచ్చడి..ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
అనుకోని ధన యోగం.. ఈ రాశుల వారికి నేడు కెరీర్, ఆర్థిక పరంగా తిరుగులేని అదృష్టం! -
మీ ఇంట్లో RO వాటర్ వాడుతున్నారా? మలమూత్రాల ద్వారా వచ్చే ఈ-కొలి బ్యాక్టీరియా..తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు.. -
గురు పుష్య యోగం: ఈరోజు బంగారం కొంటే మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయా? అదృష్టం మీదే! -
కూరల్లో పెరుగు వేసేటప్పుడు ఇలా చేస్తే అస్సలు విరిగిపోదు..సెలబ్రిటీ చెఫ్ టిప్స్! -
2026లో అధిక మాసం వచ్చింది.. ఈ సమయంలో ఏ పనులు చేస్తే ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయో తెలుసా? -
సర్వార్థ సిద్ధి యోగం: ఈ రోజు ఈ పనులు మొదలుపెడితే తిరుగులేని విజయం మీదే! -
కర్కాటక, కన్యా, వృశ్చిక రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 21 మే 2026 -
కంచంలో ఎన్ని కూరలున్నా సరే.. ఈ మామిడి అల్లం చారు ముందు దిగదుడుపే! -
పల్లెటూరి స్టైల్ పానీపూరి ఇలా చేస్తే.. బయట దొరికే రుచిని మించిపోతుంది, ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది!
ధైర్య సాహసాల ప్రతీక ఝాన్సీ లక్ష్మీబాయి!

ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబాయి లు. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి రాణి నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే కన్ను మూసింది. దాంతో ఆమెను పెంచాల్సిన భాద్యత తండ్రి మీద పడింది. ఆమెకు కత్తిసాము, గుర్రపుస్వారీ,తుపాకీ పేల్చడం వండి విద్యలంటే మక్కువ ఎక్కువ. ఖడ్గం ధరించి, కళ్ళెం బిగించి గాలి విసురుకు ఉవ్వెత్తుగా ఎగిరే కురులతో గుర్రపు స్వారీ చేస్తూ దూసుకుపోయేది.లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ తో వివాహమైంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. 1851లో లక్ష్మీబాయి ఒక కుమారునికి జన్మనిచ్చింది. అయితే ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూశాడు.
1857లో అలజడి రేగడంతో ఝాన్సీ పట్టణం విప్లవ కారులకు నిలయంగా మారింది. లక్ష్మీబాయి స్వచ్చంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా ఆత్మరక్షణ బలోపేతం చేసింది. మహిళలను కూడా సైన్యంలో చేర్చుకుని వారికి ఆయుధ శిక్షణను ఇవ్వనారంభించింది. ఆమె దగ్గర సైన్యాధ్యక్షులుగా ఉన్న వారంతా ఆమె యుద్ధం చేస్తున్న కారణానికి మద్దతుగా స్వచ్చందంగా ముందుకు వచ్చిన వారే. సెప్టెంబర్ మరియు అక్టోబర్ 1857 లో ఆమె ప్రక్క రాజ్యాలైన దతియా మరియు ఓర్చా రాజ్యాల నుంచి దాడిని విజయవంతంగా ఎదుర్కొనగలిగింది.
జనవరి 1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీ ని ముట్టడించడం ప్రారంభించింది. రెండు వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. రాణి 1858, జూన్ 17 వ తేదీన గ్వాలియర్ యుద్ధం లో మరణించింది. ఈమె మరణానికి కారణమైన పరిస్థితుల గురించి చాలా వాదనలున్నాయి. ఇప్పటి బ్రిటీష్ రిపోర్టులను బట్టి ఆమె బుల్లెట్ గాయాలు తగిలి మరణించిందని తెలుస్తోంది. టి.ఎ మార్టిన్ రాసిన లేఖ ఆధారంగా ఈ విషయం తెలుస్తోంది.



Click it and Unblock the Notifications